Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం: సత్యరాజ్‌

    తమిళనాడు మురుగన్‌ సభలో ఏపీ డిప్యూటీ సీం పవన్‌ కళ్యాణ్‌ చేసిన కామెంట్లకు సినీ నటుడు సత్య రాజ్‌ పరోక్షంగా కౌంటరిచ్చారు. “దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోం. పెరియార్‌ సిద్ధాంతాలు నమ్ముకున్న మమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు. ఒకవేళ మోసం చేశామనుకుంటే అది మీ తెలివి తక్కువతనమే. తమిళ ప్రజలు తెలివైనవారు, వారిముందు మీ ఆటలు సాగవు’అని ఫైర్‌ అయ్యారు.

  • SSMB29 కోసం డ్యాన్స్‌ రిహార్సల్స్‌లో బిజీగా ప్రియాంక..

    హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో‘SSMB29’ వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సినిమా ముస్తాబవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ప్రస్తుతం ప్రియాంక డ్యాన్స్ ప్రాక్టీస్‌లో బిజీగా ఉంది. ప్రియాంక ఎంతో శ్రద్ధగా డ్యాన్స్‌ రిహార్సల్స్‌ చేస్తుందంటూ   కొరియోగ్రాఫర్‌ విక్కీ భార్తియా కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

     

  • అమితాబ్‌ను డైరెక్ట్‌ చేయాలన్నది నా కల: మంచు విష్ణు

    నటుడు మంచు విష్ణు తన మనసులోకి కోరికను బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో మీరు డైరెక్షన్‌ వైపు వెళ్తారా.. అనే ప్రశ్నపై స్పందిస్తూ…‘‘నేను దర్శకత్వం వహిస్తే.. అమితాబ్‌ సినిమాకు డైరెక్టర్‌గా వర్క్‌ చేస్తాను. అది నా కల. గతేడాది వచ్చిన ‘కల్కి’లో ఆయన అశ్వత్థామ పాత్రలో అద్భుతంగా నటించారు’ అని చెప్పారు. కాగా, మంచు విష్ణు న్యూ మూవీ‘కన్నప్ప’ జూన్‌ 27న విడుదల కానుంది.

     

     

  • అఖిల్ సినిమా నుంచి శ్రీలీల ఔట్?

    ప్రముఖ నటి శ్రీలీల టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ బ్యూటీ తాజాగా అఖిల్ సినిమాకు హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. శ్రీలీల చేతిలో ప్రస్తుతం రెండు హిందీ, ఒక తమిళం, రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. అయితే, ఈ భామ ఎక్కువగా హిందీ, తమిళ సినిమాలకే డేట్స్ ఇస్తున్న కారణంగా శ్రీలీలకు బదులు మరో హీరోయిన్‌‌ను చూసుకోవాలని టీమ్ భావిస్తుందట.

  • హార్దిక్‌తో డేటింగ్‌.. హీరోయిన్‌ క్లారిటీ

    టీమిండియా క్రికెటర్‌ హార్దిక్‌ పొండ్యతో తాను డేటింగ్‌ చేసినట్లు వచ్చిన వార్తలపై బాలీవుడ్‌ హీరోయిన్‌ ఈషా గుప్తా స్పందించారు. ‘హార్టిక్‌, నేను కొన్ని నెలలపాటు మాట్లాడుకున్నాం. వ్యక్తిగతంగా రెండు సార్లు మీట్‌ అయ్యాం. దాన్ని డేటింగ్‌ అనలేం. కానీ డేటింగ్‌ స్టేజికి ముందే మా బంధం తెగిపోయింది. ప్రస్తుతం అతడితో కాంటాక్ట్‌లో లేను’అని స్పష్టం చేశారు. కాగా, 2018లో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది.

     

  • ప్రముఖ నటి ఇంట్లో విషాదం

    ప్రముఖ నటి సనా ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి సయీదా కన్నుమూశారు. తన తల్లి తీవ్ర అనారోగ్య పరిస్థితులతో మరణించినట్లు సనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో బాధను వ్యక్తపరిచింది. కాగా, ఈ నటి తెలుగులో Mr.నూకయ్య, కల్యాణ్‌రామ్ కత్తి, గగనంతోపాటు పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది.

  • ‘కూలీ’ తెలుగు రైట్స్ @ రూ.48 కోట్లు!

    తమిళ నటుడు రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కూలీ’. లోకేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఈ మూవీ తెలుగు రైట్స్‌ రూ.48 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ ఈ చిత్ర తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నారట. లోకేశ్ గత చిత్రాల రికార్డుల వల్ల భారీ ధర దక్కినట్లు తెలుస్తోంది.

  • వీడియో గేమ్‌లో కనిపించిన రాజమౌళి

    హిడియో కోజిమా రూపొందించిన ‘డెత్ స్టాండింగ్ 2’ వీడియో గేమ్‌ త్వరలో రానుంది. ఈ గేమ్‌లో ప్రముఖ తెలుగు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఆయన కుమారుడు కార్తికేయ కనిపించారు. ఈ గేమ్ జూన్ 26 నుంచి ప్లే స్టేషన్‌లో అందుబాటులోకి రానుంది. రాజమౌళి కామియో నటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

     

  • BJPలో చేరనున్న సినీనటి మీనా?

    ఒకప్పుడు తమిళ సినీరంగంలో అగ్రనటిగా వెలుగొందారు మీనా. 45ఏళ్ల సినీ ప్రస్థానంలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం తదితర పలు భాషల్లో నటించారు. ఆమె భర్త 2022లో అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ వెళ్లిన మీనా ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కలిశారు. ఆ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఆమె BJPలో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

  • ఆ దర్శకుడితో ధనుష్ మరో మూవీ!

    ‘కుబేర’ మూవీ హిట్ జోష్‌లో ఉన్న ధనుష్ తర్వాతి చిత్రంపై బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తనకు తెలుగులో మొదటి హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరితో ధనుష్ మూవీచేసేందుకు కమిట్ అయ్యాడని సమాచారం. సినిమాను 2027లో ప్రారంభం అవ్వొచ్చు. వెంకీ ప్రస్తుతం సూర్యతో మూవీ చేస్తుండగా.. ధనుష్ చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. అవి పూర్తయితేనే వీరి కాంబోలో మూవీ వస్తుంది.