Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • “కన్నప్ప” దర్శకుడి గురించి తెలుసా?

    రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ చేరికతో ‘కన్నప్ప’పై మరింత బజ్‌ క్రియేట్‌ అయినా ఈ సినిమా దర్శకుడి గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావన లేదు. ఈ మూవీ దర్శకుడి పేరు ముకేశ్‌ కుమార్‌ సింగ్‌. ఈయన రామాయణ్‌, మహాభారత్‌ వంటి పౌరాణిక సీరియల్స్‌లో కొన్ని ఎపిసోడ్స్‌కు దర్శకత్వం వహించారు. వీటితో పాటు తెనాలి రామ, మేరే సాయి వంటి సీరియల్స్‌ తీశారు.

  • గంగూలీ బయోపిక్‌ చేయాలంటే టెన్షన్‌గా ఉంది: రాజ్‌కుమార్‌ రావ్‌

    భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో నటించడంపై రాజ్‌కుమార్ రావ్ తొలిసారి స్పందించాడు. “గంగూలీ పాత్ర పోషించడం గౌరవం, కానీ టెన్షన్‌గా ఉంది. ఆయన జీవితాన్ని తెరపై ఆవిష్కరించడం సవాల్‌తో కూడిన బాధ్యత” అని చెప్పాడు. విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో, లవ్ రంజన్ నిర్మాణంలో ఈ చిత్రం 2026లో విడుదల కానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

  • ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సీజన్ 3పై కీలక అప్డేట్

    మనోజ్ బాజ్‌పేయ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. రెండు సీజన్లు సూపర్‌హిట్ కాగా.. మూడో సీజన్‌ త్వరలో రానున్నట్లు అమెజాన్ ప్రకటించింది.

     

  • ఓటీటీలోకి ‘రైడ్‌ 2’ మూవీ.. ట్రైలర్‌ విడుదల

    అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రైడ్‌ 2’. ఇందులో రితేష్ దేశ్ ముఖ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ మూవీ ఈ నెల 26 నుంచి ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా చిత్ర బృందం ట్రైలర్‌ రిలీజ్‌ చేసింది.

  • శృతి హాసన్‌ సోషల్ మీడియా ఖాతా హ్యాక్‌

    హీరోయిన్ శృతి హాసన్ ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. ఆమె అకౌంట్ నుంచి బిట్‌కాయిన్‌, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన సందేశాలు దర్శనమిచ్చాయి. వరుసగా ఆమె ఖాతా నుంచి ఈ సందేశాలు రావడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. దీంతో శృతి హ్యాకింగ్ గురించి ఇన్‌స్టా వేదికగా ఆ మెసేజ్‌లకు స్పందించవద్దని విజ్ఞప్తి చేసింది. అయితే 2017లోనూ ఆమె ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు.

  • ‘కన్నప్ప’ మూవీ సెన్సార్ పూర్తి

    విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’. తాజాగా మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ రన్‌టైమ్ 3 గంటల 2 నిమిషాలు. కాగా సెన్సార్ బోర్డు 12 నిమిషాలు సీన్లను తొలగించినట్లు తెలిపింది. భారీ యాక్షన్, భక్తి రసంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులముందుకు ఈ నెల 27న విడుదల రానుంది.

  • హీరో అజిత్ న్యూ లుక్‌

    కోలీవుడ్ స్టార్ అజిత్‌ కుమార్ ఈ ఏడాది గుడ్ బ్యాడ్ ‍అగ్లీ మూవీతో సూపర్ హిట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే అజిత్‌కు కారు రేసింగ్ అంటే ప్రాణం. తాజాగా రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అజిత్ గుండు చేయించుకుని కొత్త లుక్‌తో దర్శనమిచ్చారు. అజిత్‌ని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

  • ‘తమ్ముడు’ మూవీ నుంచి ‘బగళాముఖి’ సాంగ్ విడుదల

    నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ‘తమ్ముడు’. తాజాగా ఈ చిత్రం నుంచి బగళాముఖి అమ్మవారి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జులై 4న విడుదల కానుంది.

  • న‌వీన్ చంద్ర ‘షో టైమ్’ ట్రైల‌ర్ విడుద‌ల

    టాలీవుడ్ యువ న‌టుడు నవీన్ చంద్ర, పోలిమేర ఫేం కామాక్షి భాస్కర్ల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘షో టైమ్’ ఈ సినిమాకు మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. నరేష్, రాజా రవీంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ యూనిట్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. కాగా ఈ సినిమా జూలై 04న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

  • అమ్మ ఆరోగ్యంగానే ఉంది: నాగబాబు

    తన తల్లి అంజనాదేవీ ఆరోగ్యంపై నాగబాబు స్పందించారు. ‘‘అమ్మ ఆరోగ్యంగానే ఉంది. అవన్నీ రూమర్స్ మాత్రమే’ ’ అని నాగబాబు ఖండించారు.