Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • చిన్న విషయాలే కావచ్చు.. జీవితమంతా గుర్తుంటాయి: రష్మిక

    ‘కుబేర’తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు రష్మిక.  తాజాగా ఈ చిత్రంలో తన కోస్టార్‌ ధనుష్‌పై  ఆమె ప్రశంసలు కురిపించారు. ‘‘ మీరు సెట్‌లో నాకోసం తెచ్చిన లడ్డూలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నాకు తమిళ డైలాగుల్లో మీరు చేసిన సాయం..నేను ఏదైనా డైలాగు చెప్పినప్పుడు మీరు ప్రశంసించిన తీరు.ఇవన్నీ చిన్న విషయాలే కావచ్చు.. కానీ, జీవితమంతా గుర్తుంటాయి’’అంటూ ధనుష్‌తో దిగిన సెల్ఫీని షేర్‌ చేశారు.

     

  • అట్లీ – అల్లు అర్జున్‌ మూవీ లేటెస్ట్‌ అప్‌డేట్‌!

    అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ ముంబయిలో జరగనున్నట్లు సమాచారం. దీని తర్వాత అమెరికా వెళ్లనున్నట్లు టాక్‌.

     

  • హీరో అరెస్ట్‌… అసలేం జరిగిందంటే?

    డ్రగ్స్‌ కేసులొ హీరో శ్రీరామ్‌ (శ్రీకాంత్‌) పేరు అనూహ్యంగా బయటకొచ్చింది. చెన్నైలో ఓ బార్‌లో జరిగిన ఘర్షణకు సంబంధించి AIADMK నేత ప్రసాద్‌ను పోలీసులు గతంలో అరెస్ట్‌ చేశారు. ఆయనపై డ్రగ్స్‌ వాడిన ఆరోపణలు ఉండటంతో దర్యాప్తు ప్రారంభించారు. ఎవరి నుంచి కొన్నారు? ఎవరికి అమ్మారనేది ఆరా తీయగా నటుడి పేరు బయటపడింది. 40సార్లకు పైగా డ్రగ్స్‌ కొన్నట్లు గుర్తించి శ్రీరామ్‌‌ను అరెస్ట్‌ చేశారు.

  • OTTలోకి వచ్చేసిన ‘పంచాయత్‌’ నాలుగో సీజన్‌

    ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా అలరించిన వెబ్‌సిరీస్‌ ‘పంచాయత్‌’. ఈ సిరీస్‌ నాలుగో సీజన్‌  ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అందుబాటులో ఉంది. హిందీలో రూపొందిన ఈ సిరీస్‌ ఇతర భాషల ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఇందులో జితేంద్ర కుమార్‌ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సిరీస్‌ తెలుగులో ‘సివరపల్లి’ పేరుతో రీమేక్‌ అయిన సంగతి తెలిసిందే.

     

     

  • నాలుగు సినిమాలు లైన్లో పెట్టిన వెంకటేష్!

    టాలీవుడ్‌ సీనియర్‌ హీరో వెంకటేశ్‌ తర్వాతి సినిమాలు ఏంటనే విషయంపై ప్రస్తుతం సినీ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. చిరంజీవి-అనిల్‌ రావిపూడి సినిమాలో ఆయన గెస్ట్‌ రోల్‌లో కనిపిస్తారని, త్రివిక్రమ్‌తో చేయబోయే మూవీ 2026 సమ్మర్‌లో రిలీజవుతుందని సినీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ‘దృశ్యం-3’తో పాటు అనిల్‌ రావిపూడితో ‘సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం’ టైటిల్‌తో సినిమా చేస్తారని సమాచారం.

  • ఈ కాలానికి ఈ సినిమా ఎంతో అవసరం : మంచు విష్ణు

    ‘కన్నప్ప’ మూవీ జూన్ 27న రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలోనే నటుడు మంచు విష్ణు ఈసినిమాపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ”చిన్న తనంలో కన్నప్ప కథను విన్నాను. ఆ తర్వాత నాలో పరిణితి వచ్చాక కథలో ఉన్న పరమార్థం నాపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఈ కాలానికి ఈ సినిమా ఎంతో అవసరం. నమ్మకం కోసం ఒకమనిషి ఎంతదూరం ప్రయాణిస్తాడో తెలుస్తుంది” అని తెలిపారు.

     

  • అతడితో పనిచేసినప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష

    తమిళనటి త్రిష ఓ ఇంటర్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘మహేశ్‌ అద్భుతమైన నటుడు. నాకు ఇష్టమైన నటుల్లో ఆయన ఒకరు. పెద్ద స్టార్‌ అయినప్పటికీ తోటి నటులను ఎంతో గౌరవిస్తారు. చాలా హార్డ్‌వర్క్‌ చేస్తారు. అతడు మూవీ షూటింగ్‌లో తను క్యారీవ్యాన్‌కు వెళ్లడం నేనెప్పుడూ చూడలేదు. తన సీన్‌ షూట్‌ లేనప్పుడు కూడా.. మానిటర్‌ దగ్గరే కూర్చునేవారు. పొద్దున వచ్చి రాత్రి 10:30కి ఇంటికెళ్లేవాడని’ చెప్పుకొచ్చింది.

  • ఓటీటీలోకి ఒకే రోజు మూడు సినిమాలు

    ప్రముఖ ఓటీటీ సంస్థ ‘సన్‌నెక్స్ట్‌’లో ఒకే రోజు మూడు సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. ఈ నెల 27న రిలీజ్‌ కానున్నాయి.

    • ఒక పథకం ప్రకారం (తెలుగు)
    • ది వర్డిక్ట్‌ (తమిళం)
    • ఆజాదీ (మలయాళం)

  • ‘తమ్ముడు’ మూవీకి ముందుగా ఆ హీరోని అనుకున్నాం: దిల్‌ రాజు

    ‘తమ్ముడు’ సినిమాలో హీరోగా ముందుగా నానిని తీసుకుందామని అనుకున్నామని నిర్మాత దిల్ రాజు అన్నారు. అప్పటికే నాని ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో నితిన్‌ని ఎంపిక చేశామని తెలిపారు. శ్రీరామ్‌ వేణు తెరకెక్కించిన ఈ సినిమా జులై 4న విడుదల కానుంది.

  • ‘స్క్విడ్‌ గేమ్‌ థీమ్‌’.. ఇండియన్‌ వెర్షన్‌ గురూ

    ఓటీటీ ప్రేక్షకులను అలరించిన వెబ్‌సిరీస్‌ల్లో ‘స్క్విడ్‌ గేమ్‌’ ఒకటి. జూన్‌ 27వ తేదీ నుంచి ‘స్క్విడ్‌గేమ్‌: సీజన్‌3’ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ‘సీజన్‌2’లో వచ్చిన ‘మింగిల్‌ గేమ్‌ సాంగ్‌’ భాషతో సంబంధం లేకుండా అందరినీ అలరించింది. ఆ సాంగ్‌ను భారతీయ వాయిద్య పరికరాల ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ రీక్రియేట్‌ చేసింది. భారతీయ సంగీతకళాకారులు తమ ప్రతిభతో ఆ పాటకు మరింత వన్నె తెచ్చారు.