Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • బాలాజీ దర్శనం..అంత సులభం కాదు: మంచు విష్ణు

    బాలాజీ అనుగ్రహం ఉంటేనే దర్శనం దొరుకుతుందని మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “తిరుపతిలో మోహన్ బాబు విశ్వవిద్యాలయం ఉంది. నేను కావాలంటే ప్రతిరోజూ బాలాజీ ఆలయానికి వెళ్ళి దర్శనం చేయవచ్చు. కానీ అది అంత సులభం కాదు. ఇది బాలాజీ ఆహ్వానం. అతను మిమ్మల్ని అనుమతించాలి” అని అన్నారు.

  • తమన్నాతో కటీఫ్.. దంగల్ నటితో విజయ్ డేటింగ్!

    ఇటీవల నటి తమన్నాకు బ్రేకప్ చెప్పిన తరువాత బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ దంగల్ నటి ఫాతిమా సనాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఇద్దరూ “ఉల్ జలూల్ ఇష్క్” (ఇప్పుడు “గుస్తాఖ్ ఇష్క్”) సినిమా షూటింగ్ సమయంలో సన్నిహితంగా మారారని, తరచూ కలిసి సమయం గడుపుతున్నారని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఇరువురు ధృవీకరించాల్సి ఉంది.

  • ‘తమ్ముడు’ సెకండ్ సాంగ్ ప్రోమో

    శ్రీరామ్ వేణు దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. ఈ మూవీ నుంచి రెండో పాట ‘జై బగళాముఖీ’ని జూన్ 24న విడుదల చేయనున్నారు. కాగా ఈ సాంగ్‌ ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. పూర్తి పాట్ రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది.

  • ‘దృశ్యం3’ కీలక అప్డేట్!

    మోహన్‌లాల్‌ కీలక పాత్రలో, జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో ‘దృశ్యం3’ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా మలయాళం, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుందని సమాచారం. అక్టోబర్ 2025లో చిత్రీకరణ ప్రారంభం కానుందని జీతూ జోసెఫ్‌ తెలిపారు. స్క్రిప్ట్‌ దాదాపు పూర్తయింది. హిందీ వెర్షన్‌ కూడా అదే కథతో రూపొందుతుందని ఆయన స్పష్టం చేశారు. మలయాళంలో మోహన్‌లాల్‌, హిందీలో అజయ్‌ దేవ్‌గణ్‌, తెలుగులో వెంకటేష్‌ నటించనున్నారు.

     

  • ‘సర్దార్‌ జీ3’లో పాక్‌ నటి.. భారత్‌లో విడుదల!

    దిల్జిత్‌ దొసాంజే హీరోగా నటిస్తున్న ‘సర్దార్‌జీ 3’ చిక్కుల్లో పడింది. దిల్జిత్‌ సరసన పాక్‌ నటి హనియా ఆమిర్‌ నటించడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై నిర్మాత గన్బిర్‌ సింగ్‌ సిద్ధు స్పందించారు. భారత్‌-పాకిస్థాన్‌ ఉద్రిక్తపరిస్థితులు తలెత్తకముందే ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది.  భారతీయుల మనోభావాలను దృష్టిపెట్టుకుని ఈ సినిమాను భారత్‌లో విడుదల చేయటం లేదని తెలిపారు. దీంతో ట్రైలర్‌ని యూట్యూబ్ నుంచి తొలగించారు.

  • కాశీలో రేప్ సీన్ తీస్తారా?.. మీ డైరెక్టర్ మైండ్ సెట్ అలాంటిదేనా?

    అనంతిక  ప్రధానపాత్రలో నటించిన  ‘8 వసంతాలు’మూవీ పాజిటివ్ టాక్‌తో నడుస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భగా ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్‌‌రెడ్డిని ‘‘కాశీ లాంటి పవిత్రమైన ప్రదేశం లో రేప్ సీన్ అలా తీస్తారా?’’ మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.  ఈ చిత్ర దర్శకుడు ఫణీంద్ర నరిశెట్టి మైండ్ సెట్ అలాంటిదేనన్నారు. అయితే, దీనికి విశ్వనాథ్ రెడ్డి సమాధానం చెప్పలేకపోయారు.

     

  • శ్రీవారి సేవలో విక్రమ్ ప్రభు

    తిరుమల శ్రీవారిని తమిళ సినీ నటుడు విక్రమ్ ప్రభు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో విక్రమ్ ప్రభు తన సతీమణితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన వారు స్వామివారిని దర్శించుకొని రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

  • క్షమాపణలు చెప్పిన మణిరత్నం

    మణిరత్నం – కమల్‌ హాసన్‌ కాంబోలో వచ్చిన చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో దర్శకుడు మణిరత్నం ఆడియన్స్‌ను క్షమాపణలు కోరారు.

  • నటి ప్రశ్నకు విజయ్‌ ఏం చెప్పారంటే!

    నటుడు విజయ్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘జన నాయగన్‌’. ఇది ఆయన చివరి సినిమా అని.. ఈ చిత్రం తర్వాత పూర్తిగా రాజకీయాల్లో బిజీగా మారతారని ప్రచారం జరుగుతోంది. ‘‘జన నాయగన్‌’ షూటింగ్‌ సమయంలో ఇదే మీ చివరి సినిమానా అని విజయ్‌ను అడిగినట్లు నటి మమితా బైజు వెల్లడించింది. దీనికి విజయ్ స్పందిస్తూ.. ‘అది 2026 ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది’ అని ఆయన నాతో చెప్పినట్లు పేర్కొంది.

  • జూన్‌ 27న రానున్న‘మార్గన్‌: ది డెవిల్‌ ’

    నటుడు  విజయ్‌ ఆంటోనీ హీరోగా నటించిన చిత్రం ‘మార్గన్‌: ది డెవిల్‌ ’. లియో జాన్‌ పాల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో విజయ్‌ మేనల్లుడు అజయ్‌ ధీషన్‌ విలన్‌గా పరిచయమవుతున్నారు. మర్డర్‌ మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సముద్రఖని, దీప్షిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళ, తెలుగు భాషల్లో జూన్‌ 27న ఈ చిత్రం విడుదల కానుంది.