చిరంజీవి అంటే దర్శకుడు శేఖర్ కమ్ములకు ఎంతో అభిమానం. అయితే, తాజాగా ‘కుబేర’సక్సెస్ మీట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ శంకర్ దాదా ఎంబీబీఎస్ అంటూ సాంగ్ పాడగా ఉ.. హా.. ఉ. హా.. అంటూ శేఖర్ కమ్ముల ఎగ్జైట్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియో చూసి శేఖర్ కమ్ములలో ఈ యాంగిల్ చూసి ఆశ్చర్యపోతున్నామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.