‘రాజాసాబ్’ బ్యూటీ, హీరోయిన్ మాళవిక మోహనన్ మరో అవార్డ్ దక్కించుకుంది. ముంబైలో జరిగిన IWMBUZZ డిజిటల్ అవార్డ్స్‌లో పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ దక్కించుకుంది. ఓటీటీ, వెబ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన బిగ్గెస్ట్ అవార్డ్స్‌గా ఈ సంస్థకు పేరుంది. ఈ ఈవెంట్‌లో రెడ్ కార్పెట్‍పై నడిచిన మాళవిక.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
నిహారిక రెండో పెళ్లి.. నాగబాబు రియాక్షన్ ఇదే..
కూతురు నిహారిక పెళ్లి విషయంలో నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తాము పొరపాటు చేశామని నాగబాబు అన్నారు. వారిద్దరినీ సరిగ్గా అంచనా వేయలేకపోయాం.. పరస్పర అంగీకారంతోనే విడిపోయారని చెప్పుకొచ్చారు. ‘‘అందులోనుంచి ఇప్పుడిప్పుడే నిహారిక బయటపడుతోంది. ఒకరోజు తను మరో అబ్బాయిని కలుస్తుంది. పెళ్లి చేసుకుంటుంది. తన విషయాల్లో కలగజేసుకోవాలనుకోవట్లేదు. నా పిల్లలు వారికి నచ్చినట్లు జీవించాలని కోరుకుంటాను’ అని తెలిపారు.
-
ప్రముఖ నటుడు కన్నుమూత
ప్రముఖ నటుడు గైలార్డ్ సార్టైన్ (81) కన్నుమూశారు. ఒక్లహోమాలోని తుల్సాలో మరణించినట్లు సన్నిహితులు తెలిపారు. వయసురీత్యా వచ్చే అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచినట్లు సమాచారం. కాగా, ఈ నటుడు హీ హాలో, ఫ్రైడ్ గ్రీన్ టొమాటోస్, మిస్సిస్సిప్పి బర్నింగ్, ది బడ్డీ హోలీ స్టోరీ వంటి పలు చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు.
-
జూన్ 24న ‘తమ్ముడు’ నుంచి రెండో పాట
శ్రీరామ్ వేణు దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. ఈ మూవీ నుంచి రెండో పాట ‘జై బగళాముఖీ’ని జూన్ 24న విడుదల చేయనున్నారు.
-
‘శక్తిమాన్’లో అల్లు అర్జున్ హీరో కాదు: దర్శకుడు క్లారిటీ
అల్లు అర్జున్ హీరోగా మలయాళ దర్శకుడు, నటుడు బసిల్ జోసెఫ్ ఓ భారీసినిమా రూపొందించనున్నారంటూ గత కొన్నరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ‘శక్తిమాన్’ రానుందని టాక్. దీనిపై బసిల్ జోసెఫ్ స్పందించారు. ఆ కథనాల్లో వాస్తవం లేదని స్పష్టత నిచ్చారు. ‘శక్తిమాన్’ పూర్తిగా రణ్‌వీర్ చిత్రమన్నారు. ఆయనతోనే ఆసినిమా ఉంటుందని వెల్లడించారు. అల్లు అర్జున్‌కి ఇంకో కథ సిద్ధం చేస్తున్నానన్నారు.
-
‘కుబేర’ రెండో రోజు కలెక్షన్లు ఎంతంటే?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున నటించిన చిత్రం ‘కుబేర’. ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దేశంలో తొలిరోజు రూ.14 కోట్లు.. రెండో రోజు రూ.16 కోట్లమేర వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. మొత్తంగా రెండు రోజులకు రూ.31.25 నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. గ్రాస్ రూ.36 కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది. ఓవర్సీస్‌లో రూ.15 కోట్ల కలిపితే రూ.50 కోట్ల మార్క్ దాటేందని అంచనా.
-
‘వందకి 20 సినిమాల్లో మాత్రమే తెలుగమ్మాయిలకు ఛాన్స్’
టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలకు అవకాశాలు చాలా తక్కువ అనే కంప్లైంట్ ఎప్పటినుంచో ఉందని యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల తెలిపింది. టాలీవుడ్‌లో 100 సినిమాల్లో తెలుగమ్మాయిలకు 20 సినిమాలు మాత్రమే అవకాశాలు వస్తాయని మిగతా 80 సినిమాలకు పరభాష హీరోయిన్లనే తీసుకుంటారు. అదే వేరే ఇండస్ట్రీలో అక్కడ లోకల్ అమ్మాయిలకే 80% అవకాశం ఇస్తారు. ఇలా ఎక్కడైనా తెలుగు అమ్మాయిలకు 20% మాత్రమే చాన్స్ ఉంటుంది. ఇందులోనే తమ టాలెంట్‌ని నిరూపించుకోవాలని చెప్పుకొచ్చింది.
-
సినిమాల్లో అది సాధ్యపడకపోవచ్చు: పవన్ కల్యాణ్
సినిమాల్లో తాను ఇప్పటివరకూ పోషించిన పాత్రల్లో ఇష్టమైన క్యారెక్టర్ గురించి ఓ ఇంటర్వూలో పవన్ కల్యాణ్‌ని అడిగారు. దానికి పవన్ స్పందిస్తూ.. ‘‘ఇప్పటివరకూ పోషించిన పాత్రల్లో పూర్తిస్థాయిలో నా మనసుకు చేరువైంది ఏదీలేదు. ప్రతిపాత్రలో కొన్నిలక్షణాలు మాత్రమే నచ్చాయి. నిజ జీవితంలో ఎలాఉంటానో అదేవిధంగా వెండితెరపైనా కనిపించాలని ఉంది. కానీ అది సినిమాల్లో సాధ్యపడకపోవచ్చు. ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించకపోవచ్చు’’ అని తెలిపారు.
-
స్టార్ హీరోయిన్‌తో వివాదం.. కియారాపై సందీప్ వంగా పోస్ట్ వైరల్
తాను దర్శకత్వం వహించిన తొలి హిందీ చిత్రం ‘కబీర్ సింగ్’ విడుదలై ఆరేళ్లు అయిన సందర్భంగా సందీప్‌రెడ్డి వంగా ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పోస్ట్ పెట్టారు. హీరో షాహిద్ కపూర్ లేకుండా కేవలం కియారా అద్వానీ మాత్రమే ఉన్న పోస్టర్‌ను పంచుకుంటూ సినీ ప్రియులకు ధన్యవాదాలు చెప్పారు. ఓ స్టార్ హీరోయిన్‌తో వివాదం వేళ కియారాను ప్రశంసించేందుకే ఆయన ఈ విధంగా చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు.