ఏపీలో ‘కుబేర’ సినిమాకు టికెట్ రేట్ల పెంపుపై నిర్మాత సునీల్ నారంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ సినిమాకు రూ.75 పెంచలేదని చెప్పారు. ‘‘కొన్ని చోట్ల టికెట్ రేట్లు మరీ తక్కువగా ఉన్నాయి. అందుకే రూ.25, రూ.50 మేర పెంచాం. రూ.75 వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నాం కానీ అంత మొత్తంలో పెంచలేదు. తెలంగాణలోనూ టికెట్ రేట్లు రీజనబుల్‌గానే పెట్టాం’’ అని స్పష్టం చేశారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
మోహన్‌లాల్ సినిమాకు డైరెక్షన్ చేస్తా: విష్ణు
‘కన్నప్ప’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మీరు ఎదైనా మూవీకి డైరెక్షన్ చేస్తారా?’ అని యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. తాను డైరెక్షన్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదని, ఒకవేళ చేయాల్సి వస్తే మోహన్‌లాల్ సినిమాకు డైరెక్షన్ చేస్తానని పేర్కొన్నారు. కాగా విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమా ఈనెల 27న విడుదల కానుంది.
-
ఒక మంచి చిత్రాన్ని తీశాం : మోహన్ బాబు
‘‘ఇది భగవంతుని ఆశీస్సులు. ప్రతి కదలిక ఆ భగవంతుడి నిర్ణయం. ఒక మంచి చిత్రాన్ని తీశాం. మీ అందరి ఆశీస్సులు నా బిడ్డ విష్ణుకు ఉండాలని కోరుకుంటున్నా. ‘కన్నప్ప’ సినిమాలో నటించిన వారికి హృదయపూర్వక ఆశీస్సులు అందజేస్తున్నా. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి నటుడు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. ఈ సినిమా విజయం సాధించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’’ అని మోహన్‌బాబు అన్నారు.
-
ప్రభాస్ కృష్ణుడు.. నేను కర్ణుడు : మంచు విష్ణు
కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్‌పై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం నిర్వహించిన ‘కన్నప్ప’ ప్రీ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. తన జీవితంలో ప్రభాస్ కృష్ణుడిలాంటి వాడని మంచు విష్ణు అన్నారు. ముకేశ్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తిన్నడుగా విష్ణు, రుద్రగా ప్రభాస్ నటించామన్నారు.
-
కుబేర తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?
నటుడు నాగార్జున, ధనుష్ కాంబినేషన్‌లో వచ్చిన కుబేర మూవీ బాక్సాఫీసు వద్ద కాసులు కురిపిస్తోంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ఏకంగా రూ.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్‌లో కలెక్షన్లు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.
-
ప్రముఖ నటుడు కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ నటుడు జాక్ బెట్ట్స్(96) కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని లాస్ ఓసోస్‌లోని తన ఇంట్లో నిద్రలోనే బెట్ట్స్ మరణించారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మరణానికి గుండె సంబంధిత వ్యాధి కారణం కావొచ్చని భావిస్తున్నారు. థియేటర్, టెలివిజన్, సినిమాల్లో నటన ద్వారా బెట్ట్స్ మంచి గుర్తింపు పొందారు. స్పైడర్ మ్యాన్, గాడ్స్ అండ్ మాన్‌స్టర్స్ వంటి పలు చిత్రాలు ఆయనకు గుర్తింపును సాధించిపెట్టాయి.
-
రుద్రగా ప్రభాస్.. ఇంట్రడక్షన్ సాంగ్ అదిరింది
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’లో ప్రభాస్ రుద్రగా నటించారు. ఆ పాత్రకు సంబంధించిన పాటను సంగీత దర్శకుడు స్టీఫెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పెర్ఫామ్ చేశారు. ఇది బిట్ సాంగ్ అని, ఇతర పాటలకు ఎన్నో ట్యూన్స్ మార్చగా.. దీనికి ఫస్ట్ ట్యూనే సెలెక్ట్ అయిందని స్టీఫెన్ తెలిపారు.
-
సెట్స్‌లోనే డైరెక్టర్‌కు ట్రీట్ ఇచ్చిన సూపర్ స్టార్!
సూపర్ స్టార్ రజనీకాంత్- నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో రాబోతున్న క్రేజీ సీక్వెల్ చిత్రం ‘జైలర్ 2’. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. అయితే నేడు నెల్సన్ పుట్టినరోజు కావడంతో సినిమా సెట్స్‌లో సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా తలైవర్.. నెల్సన్‌కు కేక్ కట్ చేయించి తినిపించారు. దీనితో ఈ పిక్‌ను మేకర్స్ షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
-
బ్యూటిఫుల్ లుక్‌లో మాళవిక మోహనన్
మలయాళి బ్యూటీ మాళవిక మోహనన్ తాజాగా బ్యూటిఫుల్ లుక్‌లో కుర్రాళ్లను ఆకట్టుకుంది. ఆమె లేటెస్ట్‌గా నెట్టింట షేర్ చేసిన ట్రెండీ స్టిల్స్‌తో మంత్రముగ్దులను చేసింది.
-
అనుష్క ‘ఘాటి’.. ఫస్ట్ సాంగ్ చూశారా?
అనుష్క శెట్టి , విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన సినిమా ‘ఘాటి’. జులై 11న బాక్సాఫీసు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీలోని ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. క్రిష్ సాహిత్యం అందించిన ఈ పాటను లిప్సిక, సాగర్ నాగవెల్లి, సోనీ ఆలపించారు. సాగర్ నాగవెల్లి సంగీతం అందించారు.