Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • అందుకే స్పెషల్ సాంగ్‌లో చేస్తున్నా.. నటి కామెంట్స్

    రాజ్‌కుమార్ రావు హీరోగా నటిస్తున్న ‘మాలిక్’ మూవీలో నటి హుమా ఖురేషి ఓ స్పెషల్ సాంగ్‌ చేసింది. ఇందులో ఆమె మాస్ స్టెప్పులతో ఆకట్టుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ సాంగ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘డ్యాన్స్ అంటే నాకు ఇష్టం. కాబట్టి ఆ పాటను ఓకే చేశాను. సినిమాలో నన్ను సూపర్ మాసివ్ అవతార్‌లో చూడబోతున్నారు’’ అని చెప్పుకొచ్చింది.

  • నాకు మోహన్‌బాబు నచ్చడు: బ్రహ్మానందం

    తనకు మోహన్‌బాబు నచ్చడంటూ బ్రహ్మానందం నవ్వులు పూయించారు. ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో యాంకర్‌ సుమ ప్రశ్నలకు సమాధానాలిస్తూ ఆయన సందడి చేశారు. మోహన్‌బాబులో మీకు నచ్చే, నచ్చని విషయాలేంటి? అని సుమ అడగ్గా.. ‘‘నచ్చేది, నచ్చనిది.. రెండూ లేవు. అసలు నాకు మోహన్‌బాబే నచ్చడు’’ అంటూ బ్రహ్మానందం సరదా నవ్వులు పూయించారు.

  • ‘మిత్రమండలి’.. ఫుల్ ఫన్ సాంగ్‌ రిలీజ్‌

    ప్రియదర్శి, నిహారిక ఎన్‌.ఎం, రాగ్‌ మయూర్‌, ప్రసాద్‌ బెహర ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఎస్‌.విజయేందర్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘మిత్రమండలి’. తాజాగా ఇందులోని ‘కత్తందుకో జానకీ’ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. ఫుల్ ఫన్నీగా సాగే ఈ పాటకు ఆర్‌ఆర్‌ ధ్రువన్‌ సంగీతం అందించగా.. రాహుల్‌ సిప్లిగంజ్‌, ఆర్‌ఆర్‌ ధ్రువన్‌ అలపించారు.

  • ‘RRR’ మూవీలో మహేష్.. వీడియో అదిరిపోయిందిగా!

    ఏఐతో క్రియేట్ చేసిన వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవల హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ‘RRR’ సినిమాలో గ్రాఫిక్స్, విజువల్స్ చాలా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో హీరో మహేశ్ బాబును కూడా యాడ్ చేశారు. ‘RRR’, ‘ఖలేజా’ మూవీ సన్నివేశాలను మిక్స్ చేసి కామెడీ వీడియో చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

  • అమ్మకు బర్త్‌ డే విషెస్ చెప్పిన ఐకాన్‌స్టార్

    ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ తన తల్లి నిర్మల బర్త్‌డే సందర్భంగా విషెస్ తెలిపాడు. ‘‘అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అంటూ బన్ని తన అమ్మతో దిగిన ఫొటోను పంచుకున్నాడు.

  • నా కూతురి జోలికి వస్తే కారుతో తొక్కించేస్తా.. కాజోల్ వార్నింగ్!

    బాలీవుడ్ నటి కాజోల్ తన కూతురును ట్రోల్స్ చేసేవారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ‘‘నా కూతుర్ని విమర్శించే వాళ్ళు ఎవరూ కూడా నా కారు ముందుకు రావద్దు. ఒకవేళ వచ్చారే అనుకోండి.. నా కారుతో మిమ్మల్ని తొక్కించేస్తా. సోష‌ల్ మీడియాలో కొందరి కామెంట్స్ బ్యాడ్‌గా ఉంటాయి. అలా చెత్త వాగుడు వాగేవారు ఎందుకున్నారో అర్థం కాదు’’ అని కామెంట్స్ చేసింది.

  • ‘యుఫోరియా’ మూవీ నుంచి ‘రామ రామ’ సాంగ్ విడుదల

    దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న ‘యుఫోరియా’. ఈ చిత్రంలో భూమిక, సారా అర్జున్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘రామ రామ అంటూ రాగమందుకో’ అనే పాట లిరికల్‌ వీడియో మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం సమకూర్చగా, చైతన్య ప్రసాద్‌ సాహిత్యం అందించారు. ఈ పాట తల్లి-కొడుకు బంధాన్ని ఆకట్టుకుంటుంది.

  • బుకింగ్స్‌లో ‘కుబేర’ రికార్డు!

    నిన్న విడుదలైన ‘కుబేర’ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈక్రమంలో రెండో రోజు పూర్తి కాకుండానే బుక్ మై షోలో ఏకంగా 500K పైగా టికెట్లు అమ్ముడైయ్యాయి.

  • ఆసక్తిరేపుతున్న ‘కన్నప్ప’ మేకింగ్‌ వీడియో

    మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టు ‘కన్నప్ప’ ఈ నెల 27న బాక్సాఫీసు ముందుకు రానుంది. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన చిత్ర బృందం తాజాగా మేకింగ్‌ వీడియో రిలీజ్‌ చేసింది. దాదాపు మూడు నిమిషాల నిడివితో రూపొందిన ఈ వీడియో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ సినిమాలో ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

  • ‘ఇప్పుడే మొదలైంది’.. కీర్తి సురేష్ పోస్ట్ వైరల్!

    హీరోయిన్ కీర్తి సురేష్ త్వరలో ‘ఉప్పు కప్పురంబు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం జులై 4వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఒటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా కీర్తి సురేష్ తాజాగా సినిమా పోస్టర్స్ పోస్ట్ చేసింది.. ‘‘ఆగండి, గందరగోళం ఇప్పుడే మొదలైంది. ‘ఉప్పు కప్పురంబు’ సినిమా జులై 4వ తేదీన స్ట్రీమింగ్ అవ్వనుంది’’ అని రాసుకొచ్చింది.