Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలివే!

    ఇటీవల విడుదలైన చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్‌ అవుతుందో చూసేయండి.

    • ఈటీవీ విన్‌: ‘కొల్లా’ (తెలుగు)
    • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో: ‘ఘటికాచలం’
    • జియో హాట్‌స్టార్‌: ‘కేరళ క్రైమ్ ఫైల్స్‌’ (తెలుగు)
    • నెట్‌ఫ్లిక్స్‌: ‘సెమి సియోటర్‌’ (ఇంగ్లీష్‌)
    • ఆహా:‘జింఖానా’ (తెలుగు)
    • జీ5: ‘డిటెక్టివ్‌ షెర్డిల్‌’ (హిందీ)

  • రోడ్డు ప్రమాదం.. రియాలిటీ షో స్టార్ మృతి

    ప్రముఖ రియాలిటీ షో ‘మిలియన్ డాలర్ బీచ్ హౌస్‌’తో పాపులారిటీ సాధించిన సారా బురాక్ (40) ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ హాంప్టన్ బేస్‌లో హిట్-అండ్-రన్ ప్రమాదంలో మరణించారు. ఆమె రోడ్డుపై అపస్మారక స్థితిలో కనిపించారు. ఆమెను ఢీకొట్టిన వాహనం డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె లగ్జరీ లిస్టింగ్‌లు, దాతృత్వానికి పేరుగాంచిన బురాక్ నెస్ట్ సీకర్స్ ఇంటర్నేషనల్‌తో కలిసి పనిచేశారు.

  • నా శరీరం నా ఇష్టం: శ్రుతిహాసన్‌

    హీరోయిన్ శ్రుతిహాసన్‌ ప్లాస్టిక్‌ సర్జరీపై మరోసారి స్పందించింది. ‘‘టీనేజ్‌లో ఉన్నప్పుడు నా ముక్కు నాకు నచ్చేది కాదు. అందుకే సర్జరీ చేయించుకున్నా. అలాగే ముఖం మరింత అందంగా కనిపించేందుకు ఫిల్లర్స్‌ కూడా వాడా. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. నా శరీరం నా ఇష్టం. ఇతరులకు ఇబ్బంది లేనప్పుడు దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది’’ అని శ్రుతి తన అభిప్రాయాన్ని పంచుకుంది.

  • పోకిరి లిఫ్ట్ సీన్‌లో చిన్నారులు.. వీడియో వైరల్!

    పూరీ జగన్నాద్ దర్శకత్వంలో మహేష్ బాబు, ఇలియానా జంటగా నటించిన చిత్రం పోకిరి. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్, ఇలియానాల మధ్య లిఫ్ట్ సీన్‌ చాలా మందికి నచ్చే ఉంటుంది. తాజాగా ఈ సీన్‌లో ఇద్దరు చిన్నారులు నటించినట్లు ఉండే ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

     

  • అందువల్లే గోవిందా కెరీర్‌ నాశనమైంది: నిర్మాత

    బాలీవుడ్‌ నటుడు గోవిందా సినీకెరీర్‌పై నిర్మాత పహ్లాజ్ నిహలానీ కీలకవ్యాఖ్యలు చేశారు. ‘‘గోవిందా ఆల్‌ రౌండర్‌. కెరీర్‌ ఆరంభంలో ఎన్నో విజయాలు అందుకున్నారు. వరుస ప్రాజెక్ట్‌లు చేశారు. ఎదుటి వ్యక్తులను ఆయన సులభంగా నమ్మేస్తుంటారు. అందువల్లే కెరీర్‌ పరంగా ఆయనకు ఈ పరిస్థితి ఎదురైంది. జ్యోతిష్యులు, పండితుల మాటలను ఆయన ఎక్కువగా నమ్ముతుండేవారు. అలాంటివే ఆయన కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి’’ అని వెల్లడించారు.

  • Video: అప్పుడు అల్లరి నరేశ్‌.. ఇప్పుడు ధనుష్‌!

    ‘కుబేర’ మూవీలో ధనుష్‌ యాక్టింగ్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో నెట్టింట అల్లరి నరేశ్‌ పేరు కూడా వైరలవుతోంది. ‘పెళ్ళయింది కానీ!’ చిత్రంలో అల్లరి నరేశ్‌ బిచ్చగాడిలా మారిపోయినట్లు ఓ సీన్‌ ఉంటుంది. అందులో అతని యాక్టింగ్‌ను నెటిజన్లు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ధనుష్‌, అప్పుడు అల్లరి నరేశ్‌ తమ నటనతో ప్రేక్షకులను ఏడిపించేశారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. వీడియో కోసం ClickHere.

  • ప్రముఖ నటుడు సూసైడ్.. కారణమిదే!

    సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. మరాఠీ సినిమా, టెలివిజన్ నటుడు తుషార్ ఘడిగావ్‌కర్(32) ఆత్మహత్యకు పాల్పడ్డారు. పని సంబంధిత ఒత్తిడి, సినిమా అవకాశాలు లేకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తుషార్ అకాల మరణం ఇండస్ట్రీలో దిగ్భ్రాంతిని కలిగించింది. కాగా మరాఠీ సినిమా, టెలివిజన్, నాటక రంగంతో సహా వివిధ మాధ్యమాలలో తుషార్ పని చేశారు.

     

  • ‘స‌తీ లీలావ‌తి’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

    లావణ్య త్రిపాఠి  ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం స‌తీ లీలావ‌తి . తాజాగా ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఈ మూవీలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు.

     

  • ‘కుబేర’ రన్‌టైమ్‌పై కామెంట్స్‌.. శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే..?

    ‘కుబేర’  సినిమా రన్‌టైమ్‌పై వస్తోన్న కామెంట్స్‌ను ఉద్దేశించి దర్శకుడు శేఖర్‌ కమ్ముల తాజాగా స్పందించారు. ‘‘అవసరమైనప్పుడు సినిమాకు కత్తెర వేయాలనేది దర్శకుడు లేదా టీమ్‌కు తెలియని విషయం కాదు. కానీ, ఆయా సన్నివేశాలు ఉండాలి, చెప్పాలనుకున్నప్పుడు దానిని ఆవిధంగా రూపొందించడమే ధర్మం. ఈ సినిమాకు ఇది అవసరం. ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు సాగదీతగా ఉందని అనుకోరనుకుంటున్నా’’అని శేఖర్‌ కమ్ముల చెప్పారు.

  • “ఫిట్‌ ఇండియా కపుల్‌’గా రకుల్‌ దంపతులు

    అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తాము ‘ఫిట్‌ ఇండియా కపుల్‌’ అవార్డు అందుకున్నట్లు హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ వెల్లడించారు. ప్రపంచ యోగా దినోత్సవం రోజు ఈ అవార్డు దక్కించుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రజలను యోగావైపు ఆకర్షితులు చేయడంలో భాగం కావడం ఆనందంగా ఉందని చెప్పారు. మీరు మీ ఇంట్లోనే యోగాతో ఫిట్‌ గా మారొచ్చు అని వ్యాఖ్యానించారు. వీడియో కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి.