ముంబైలోని లాల్ బాగ్చా రాజా గణేశుడిని నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. వారు ఆలయాన్ని సందర్శించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఒక ప్రత్యేక క్లిప్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వీడియోలో జాన్వీకపూర్ జనసమూహంలో అసౌకర్యంగా కనిపిస్తోంది. ఆమె ముఖంలో భయం కనిపించింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
యాంకర్ లోబోకు జైలు శిక్ష
యాంకర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్‌కు జైలు శిక్ష పడింది. 2018లో లోబో కారు నడుపుతూ హైదరాబాద్ వస్తుండగా జనగామ జిల్లా నిడిగొండ వద్ద ఆటోను ఢీకొట్టాడు. దీంతో ఆటోలో ఉన్న మేడె కుమార్, పెంబర్తి మణెమ్మ మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా లోబోకు జనగామ కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది.
-
బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న మంచు మనోజ్
HYD: బాలాపూర్ గణేశ్‌ను నటుడు మంచు మనోజ్ దర్శించుకుని పూజలు చేశారు. దాదాపు రూ.2 కోట్లతో వేసిన ఆలయ సెట్ అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. గణపతి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు చెప్పారు. తాను నటించిన ‘మిరాయ్’ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు మనోజ్ తెలిపారు.
-
లేడీ డాన్‌గా మారిన హీరోయిన్!
హీరోయిన్ అదాశర్మ ‘హాతక్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ వదిలారు. ఇందులో ఆదా పవర్ ఫుల్ లుక్‌తో కనిపించింది. ఈమూవీలో ఆమె లేడీ డాన్ శివరంజని ఆచార్య పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి అజయ్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. (Video)
-
స్టేజీపైనే నటిని అసభ్యంగా తాకిన హీరో
భోజ్‌పురి సినిమా సూపర్ స్టార్‌గా పేరొందిన పవన్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. యూపీ లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో స్టేజీపైనే నటితో అసభ్యంగా ప్రవర్తించాడు. నటి అంజలి మైక్‌లో మాట్లాడుతుండగా ఆమె నడుమును తాకి ఏదో చెప్పారు. అంజలి అసౌకర్యంగా ఫీలైనా పవన్ వదల్లేదు. మరోసారి నడుమును తాకి ఇబ్బంది పెట్టారు. దీంతో అతడు క్షమాపణ చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
-
ప్రగ్యా హాట్‌నెస్‌కు కుర్రకారు ఫిదా!
హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన తన హాట్ లుక్ యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో అమ్మడి బ్యూటీఫుల్ స్మైల్‌కు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
-
ప్రదీప్ ‘డ్యూడ్’ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డ్యూడ్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్. కీర్తిస్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దీపావళికి విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సానపాటి భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించిన ఈ పాటను స్వీయ సంగీత దర్శకత్వంలో సాయి అభ్యంకర్ పాడారు.
-
హీరోయిన్ నివేదా పెళ్లి.. వరుడు ఎవరంటే?
హీరోయిన్ నివేద పేతురాజ్ త్వరలో వ్యాపారవేత్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. మరి ఈ ఇబ్రాన్ ఎవరంటే.. అతడు దుబయ్‌కు చెందిన మోడలింగ్ రంగ వ్యాపారి. నివేదా కుటుంబం కూడా గత కొంతకాలంగా దుబయ్‌లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని సమాచారం.
-
గ్లామర్ డాల్‌గా బాలీవుడ్ బ్యూటీ!
బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ తాజాగా సోషల్ మీడియాలో గ్లామర్ పిక్ పోస్ట్ చేసింది. ఇందులో ఆమె ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో కుర్రకారును ఆకట్టుకుంటోంది.
-
చై మిథికల్ వరల్డ్‌లోకి ‘లాపతా లేడీస్’ స్టార్
‘లాపతా లేడీస్’ ఫేం స్పర్శ్ శ్రీవాత్సవ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అక్కినేని నాగచైతన్య-కార్తీక్ వర్మ దండు కాంబోలో ‘NC24’ మూవీ రాబోతుంది. ఈ చిత్రం మైథలాజికల్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతోంది. అయితే స్పర్శ్ శ్రీవాత్సవ ‘NC24’ మిథికల్ వరల్డ్‌లో జాయిన్ అయ్యాడంటూ తన లుక్‌ను మేకర్స్ షేర్ చేశారు. మరి ఈ టాలెంటెడ్ యాక్టర్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.