ధనుష్ , నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘కుబేర’. జూన్ 20న విడుదలైన ఈ చిత్రాన్ని హిట్ టాక్ రావడంతో రష్మిక సంతోషం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఈ మూవీలోని తన పాత్రకు ఎంతో ఆదణ లభిస్తోందని పేర్కొంది. దర్శకుడు శేఖర్ కమ్ముల వల్లే ఇదంతా సాధ్యమైందని తెలిపింది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
మలయాళ సినీ ఇండస్ట్రీ సంచలన నిర్ణయం
మలయాళ చిత్ర పరిశ్రమ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ సినిమాల షూటింగ్ సమయంలో మాదకద్రవ్యాలను ఉపయోగించబోమని అఫిడవిట్‌లో సంతకం చేయాలని ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రతిపాదించింది. జూన్ 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమరవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దీనిని అమలు చేయనున్నారు. షూటింగ్ సమయంలో వారు నివసించే ప్రదేశాలు, పోస్ట్-ప్రొడక్షన్ కార్యకలాపాలు జరిగేటప్పుడు కూడా అమలువుతుంది.
-
‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ వచ్చేసింది
పవన్ కల్యాణ్ నటించిన తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. జూలై 24న మూవీని విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.
-
శేఖర్ కమ్ముల గురించి ఈ విషయం తెలుసా?
సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నా ప్రజాశీర్వాదం పొందడం అందరికి చాలా కష్టం. అందుకు నిదర్శనమే “కుబేర’ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆయన తెరకెక్కించిన “ఆనంద్’ మూవీ రిలీజ్ సమయంలో థియేటర్లకు ఆడియన్సే రాలేదట. దీంతో ఆయనే థియేటర్లలో సినిమాను నడిపించారు. 2 వారాల తర్వాత సినిమాపై వస్తోన్న ఆదరణ చూసి డిస్టిబ్యూటర్లు ముందుకొచ్చారు. ఆ తర్వాత భారీ విజయం అందుకొని 7 నంది అవార్డులు సాధించింది.
-
నితిన్ ‘తమ్ముడు’పై బిగ్ అప్‌డేట్!
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న మూవీ ‘తమ్ముడు’. జూలై 4న రిలీజ్‌కానుంది. ఈనేపథ్యంలో సినిమా ట్రైలర్‌ను ‘కుబేర’ మూవీ థియేటర్స్‌లో ప్లే చేస్తున్నట్లు ప్రకటించారు.
-
రొమాంటిక్ లుక్‌లో ప్రియాంక మోహన్
హీరోయిన్ ప్రియాంక మోహన్ తన లేటెస్ట్ ఫొటోను సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. శారీలో ఈ అమ్మడు రొమాంటిక్ లుక్‌తో ఆకట్టుకుంటోంది.
-
మరోసారి తల్లైన నటి సమీరా.. పోస్ట్ వైరల్!
యాంకర్, బుల్లితెర నటి సమీరా షెరిఫ్ గుడ్‌న్యూస్ చెప్పింది. రెండోసారి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు సమీరా-సయ్యద్ అన్వర్ దంపతులు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘బుడ్డోడు మా జీవితాల్లోకి ప్రవేశించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ప్రార్థనలు, ఆశీర్వాదాలు ఎప్పటికీ మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము’’ అని రాసుకొచ్చారు. దీంతో బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు.. సమీరాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
-
‘ఘాటి’ నుంచి ఫస్ట్ సాంగ్.. ప్రోమో రిలీజ్
అనుష్క శెట్టి-విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లముడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఘాటి’. ఈ మూవీలోని ‘సయిలోరే’ అనే ఫస్ట్ సాంగ్‌ను ఈనెల 21న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఆ పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇక ఫుల్ సాంగ్ రేపు మ.3:33గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు సాగర్ నాగవెల్లి సంగీతం అందిస్తున్నారు.
-
‘NTRNeel’ మూవీపై క్రేజీ అప్‌డేట్.. పోస్టర్ రిలీజ్!
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో ‘NTRNeel’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రుక్మిణి వసంత్, శ్రద్ధాకపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో తారక్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. రుక్కిణి వసంత్ తాజాగా షూటింగ్ సెట్‌లో జాయిన్ అయినట్లు పోస్టర్ ద్వారా తెలిపారు.
-
Video: వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్న మెగా కపుల్
మెగా కపుల్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రస్తుతం లావణ్య గర్భవతిగా ఉంది. ఈ జంట ఐస్‌లాండ్ వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ వెకేషన్ ఫొటోలను తాజాగా మెగా ప్రిన్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.