Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • కారవాన్‌లో ఏడ్చేదాన్ని.. హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్!

    టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల తన బ్రేకప్ స్టోరీపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘‘ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతకాలానికి బ్రేకప్‌ అయింది. రెండేళ్ల పాటు ఆ బాధను అనుభవించాను. అయితే.. చేసే పనిపై ఆ ప్రభావాన్ని పడనీయలేదు. కారవాన్‌లో ఏడ్చేసి.. ఆ తర్వాత ఏం జరగనట్లు బయటకు వచ్చేదాన్ని. దీని గురించి నా స్నేహితులకు మాత్రమే తెలుసు’’ అని అనన్య తెలిపారు.

  • ‘సితారే జ‌మీన్ ప‌ర్’ ప్రీమియ‌ర్‌లో బాలీవుడ్ స్టార్స్ సందడి!

    ఆమిర్‌ఖాన్-జెనీలియా జంటగా న‌టించిన‌ చిత్రం ‘సితారే జమీన్ పర్‌’. ఆర్‌ఎస్‌ ప్రసన్న దర్శకత్వం వహించిన‌ ఈ సినిమా నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే బాలీవుడ్ ప్ర‌ముఖుల కోసం గురువారం సాయంత్రం ఈ మూవీ ప్రీమియర్ షోను ముంబైలో ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించారు. ఈ షోకి బాలీవుడ్ అగ్రన‌టులు వ‌చ్చి సంద‌డి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

  • క్యూట్ వీడియో పోస్ట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ!

    బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ తాజాగా నెట్టింట ఓ క్యూట్ వీడియో పంచుకుంది. ‘90s baby for life’ అని ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. సల్మాన్ ఖాన్ 90ల నాటి పాటలకు డ్యాన్స్ చేస్తూ.. తరచుగా 90ల నాటి పాటలను గుర్తుచేసుకుంటుంది. అ పాటలకు డ్యాన్స్ చేస్తూ తన అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

  • ‘కుబేర’ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో!

    ‘శేఖర్ కమ్ముల తెరకెక్కించి ‘కుబేర’ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇందులో ధనుష్ పాత్రకు మొదట టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను తీసుకోవాలని అనుకున్నారట. శేఖర్ కమ్ములతో ఉన్న అనుబంధంతో ఆయనకు ఛాన్స్ ఇచ్చాడని సమాచారం. కానీ బిచ్చగాడి పాత్రలో నటించడం నా వల్ల కాదు.. నేను చేయనంటూ విజయ్ రిజెక్ట్ చేశాడని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతనిజముందో తెలియాల్సింది.

  • Video: ‘కుబేర’ మూవీపై డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూతురు రివ్యూ!

    హీరో ధనుష్-శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘కుబేర’. ఇందులో రష్మిక, నాగార్జున కీలక పాత్రలో కనిపించారు. నేడు విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో సినిమా చూసిన శేఖర్ కమ్ముల కుతూరు తన స్పందన తెలిపింది. ‘‘మేము చాలా చాలా చెప్పాం.. దానికి మించి ఉంది సినిమా’’ అని చెప్పింది. ఈ వీడియో కోసం ClickHere.

  • అది నాకు ఇష్టమైంది.. మెహ్రీన్ పోస్ట్!

    టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ తాజాగా ఓ హోటల్‌కెళ్లిన అనుభవాన్ని పంచుకుంది. ‘‘ఎస్ప్లానేడ్ హోటల్ జాగ్రెబ్ నిజంగా నాకు ఇష్టమైన హోటళ్లలో ఒకటిగా మారింది’’ అంటూ ఫొటో పోస్ట్ చేసింది.

  • ఖరీదైన కారు కొన్న డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా!

    ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగా కొత్త కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. త‌న గ్యారేజ్‌లోకి గ్రీన్ కలర్ మినీ కూపర్ కారును తీసుకొచ్చాడు. ఈ కారు మోడల్ ‘కూపర్ S’.. ‘JCW’ అయి ఉంటుందని స‌మాచారం. ఈ మోడల్ ధర సుమారుగా రూ.50 లక్షలకు పైగానే ఉంటుందట. ఈ కారుకు పూజలు చేయించి.. బయటకు తీస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

  • డిప్యూటీ సీఎంకు స్టార్ హీరో స్ట్రాంగ్ రిప్లై

    కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌‌కు కన్నడ స్టార్ సుదీప్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. చిత్ర పరిశ్రమపై శివ కుమార్ చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించారు. సినీ ఇండస్ట్రీలోని పరిస్థితులను తెలుసుకుని కామెంట్స్‌ చేస్తే బాగుండేదని అన్నారు. నటుల తీరు మారకపోతే సరిచేయడం తెలుసన్న శివకుమార్‌ వ్యాఖ్యలపై సుదీప్‌ పైవిధంగా వ్యాఖ్యానించారు.

  • సినిమా ఛాన్స్‌ల కష్టాలు.. స్టార్ హీరో కూతురు ఆవేదన!

    సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్ని సినిమా ఛాన్సుల కష్టాల గురించి చెప్పుకొచ్చింది. ఇన్ స్టాలో ఫాలోవర్స్ లేరని తనని సినిమా నుంచి తీసేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం ఏ మేనేజర్, ఏజెంట్‌ను కలిసినా సరే ఇన్ స్టాలో ఫాలోవర్స్‌ను పెంచుకోమంటున్నారని తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ విషయం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది.

  • ‘8 వసంతాలు’ మూవీ రివ్యూ

    అగ్ర నిర్మాణ సంస్థ‌లు అప్పుడ‌ప్పుడూ కొత్త‌త‌రంతో.. ప‌రిమిత వ్య‌యంతో కూడిన సినిమాలు కూడా నిర్మిస్తుంటాయి. అలా మైత్రీ మూవీ మేక‌ర్స్ నుంచి వ‌చ్చిన చిత్ర‌మే ‘8 వ‌సంతాలు’. అనంతిక ప్రధానపాత్రలో ఫణీంద్ర నరిశెట్టి తెరకెక్కించిన ఈ మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.