హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన ఇన్‌స్టాలో గ్లామరస్ ఫొటో షేర్ చేసింది. అందులో ఆమె గ్రీన్ కలర్ శారీలో ఫొటోకు స్టిల్స్ ఇచ్చింది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘కుబేర’ మూవీ రివ్యూ
ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘కుబేర’. ఈ మూవీ నేడు ప్రపంచవ్యప్తంగా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ ‘కుబేర’ కథేంటి? అది ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించింది?.. ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. రివ్యూ కోసం ClickHere.
-
ఆ స్టార్ డైరెక్టర్ నన్ను న్యూడ్‌గా చూశాడు: హీరోయిన్
హీరోయిన్ షాలిని పాండే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్‌లో ఎదురైన ఓ షాకింగ్ అనుభవాన్ని వెల్లడించింది. ‘‘నేను వ్యానిటీ వ్యాన్‌లో బట్టలు మార్చుకుంటున్న సమయంలో ఓ స్టార్ డైరెక్టర్ నా అనుమతి లేకుండా లోపలికి వచ్చాడు. అప్పుడు నన్ను అతను న్యూడ్‌గా చూసేశాడు. కానీ ఇదంతా ఇండస్ట్రీలో కామన్’’ అని చెప్పుకొచ్చింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం వెల్లడించలేదు.
-
Video: అభిమానులతో ‘కుబేర’ను చూసిన శేఖర్ కమ్ముల, ధనుష్
దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘కుబేర’. ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ నేడు విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా టాక్ తెలుసుకోవడానికి శేఖర్ కమ్ముల, ధనుష్ అభిమానులతో కలిసి చెన్నైలోని ఓ థియేటర్‌లో ‘కుబేర’ సినిమాను వీక్షించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
-
‘రాజాసాబ్’ టీజర్ లీకేజీ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మూవీ టీమ్
HYD: ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ టీజర్ లీకేజీపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మూవీ టీమ్ ఫిర్యాదు చేసింది. ఈనెల 16న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. అంతకంటే మూడు రోజుల ముందే సోషల్ మీడియాలో టీజర్‌కు సంబంధించిన క్లిప్స్ వైరల్ అయ్యాయి. దీంతో బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ సినిమా డబ్బింగ్ ఇంఛార్జ్ వసంత్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
-
VIDEO: నటుడు ధనుష్ ఎమోషనల్
ధనుష్, రష్మిక, నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘కుబేర’. ఇవాళ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో చెన్నైలోని ఓ థియేటర్‌లో ‘కుబేర’ సినిమాను శేఖర్ కమ్ముల, ధనుష్ వీక్షించారు. థియేటర్‌లోని ప్రేక్షకుల స్పందనను చూసి.. ధనుష్ ఎమోషనల్ అయ్యారు. ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. దీనికి సంబంధించిన వీడియో కోసం CLICK HERE.
-
చెరిగిపోని పచ్చ బొట్టు.. సమంత ఎందుకిలా చేసింది? (VIDEO)
నటి సమంత తన మెడపై ఉన్న ‘వైఎంసీ’ టాటూ తొలగించుకుందని ఇటీవల వార్తలొచ్చాయి. ఓ వీడియోలో ఆ టాటూ కనిపించలేదు. కానీ సమంత ఇటీవల ముంబయిలోని జిమ్ నుంచి బయటకు వస్తూన్న ఫొటోల్లో తన మెడపై‘వైఎంసీ’ టాటూ కనిపించింది. దీంతో ఓ యాడ్ వీడియో కోసం సమంత టాటూను కవర్ చేసిందని, ఆ పచ్చబొట్టు చెరిగిపోలేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
-
‘వార్ 2’పై దర్శకుడు కీలక వ్యాఖ్యలు
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం‘వార్ 2’. దీనిపై చిత్ర దర్శకుడు ఆయాన్ ముఖర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వార్’కు కొనసాగింపుగా వస్తోన్న చిత్రం కావడంతో తనపై ఎంతో బాధ్యత ఉందన్నారు.
-
విమాన ప్రమాద బాధితుడికి నటి క్షమాపణలు.. కారణమిదే!
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్‌కు నటి సుచిత్ర కృష్ణమూర్తి క్షమాపణలు చెప్పారు. తొలుత ‘‘విమానం ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తిగా రమేశ్ అబద్ధం చెప్పాడు’’ అని సుచిత్ర పోస్ట్ పెట్టారు. దీనిపై విమర్శలు రావడంతో.. ‘‘రమేశ్‌పై నేను చేసిన ట్వీట్‌ను తొలగిస్తున్నాను. నిజం ఏంటో దేవుడికి తెలుసు. నా క్షమాపణలు’’అని పేర్కొన్నారు.
-
ఆమిర్‌పై సల్మాన్ ఖాన్ జోకులు (VIDEO)
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ న్యూ మూవీ ‘సితారే జమీన్ పర్’. ఈ సినిమా ప్రీమియర్ షో లో పాల్గొన్న సల్మాన్‌ఖాన్.. ఆమిర్ ఖాన్ – కిరణ్‌రావు విడాకులపైనా సరదాగా వ్యాఖ్యలు చేశారు. ‘‘నిజం చెప్పాలంటే ఆమిర్ ఈ కథ నాకెప్పుడో చెప్పారు. ఆయన అప్పుడే ఈ సినిమాపై వర్క్ చేయాల్సింది కాకపోతే ఆ సమయంలో వేరే పేపర్ వర్క్‌లో బిజీగా ఉన్నారు’’ అని అన్నారు.