Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • మురళీనాయక్ గొప్ప మనసు.. తల్లిదండ్రులకు కూడా తెలియకుండా..

    ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో వీరమరణం పొందిన అగ్నిమీర్ మురళీనాయక్.. తాను చేసిన  సాయాన్ని కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదు. గౌతమ్‌ కృష్ణ ‘సోలోబాయ్‌’ మూవీ ఈవెంట్‌లో ఈ విషయాన్ని తండ్రి శ్రీరామ్‌‌నాయక్‌ వెల్లడించారు. ‘‘నా కొడుకు సత్యసాయి జిల్లాలోని అనాథల కోసం జీతం నుంచి నెలకు రూ.10వేలు పంపేవాడంట. అతను చనిపోయాకే మాకు ఆ విషయం తెలిసింది. మాకెంతో గర్వంగా ఉంది’’అని పేర్కొన్నారు.

  • ప్రముఖ నటుడు కన్నుమూత

    ప్రముఖ రంగస్థల నటుడు, దివంగత బాలీవుడ్ నటి రీమా లగూ మాజీ భర్త వివేక్ లగూ (74) కన్నుమూశారు. ఆయన మరణానికి కారణాలు తెలియరాలేదు. ఇవాళ ముంబైలోని ఓషివారా శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వివేక్ లాగూ మరాఠీ నాటక రంగం,టెలివిజన్, సినిమా రంగంలో గణనీయమైన కృషి చేశారు. ఆయన గతంలో నటి రీమాను పెళ్లి చేసుకుని, ఆమె నుంచి విడిపోయారు.

  • ‘కుబేర’ మూవీ.. ఆడియన్స్ ఏమంటున్నారంటే?

    ధనుష్‌, రష్మిక జంటగా నాగార్జున ప్రధానపాత్రలో శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన సినిమా ‘కుబేర’. ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. ధనుష్‌, నాగార్జున నటన, డీఎస్పీ మ్యూజిక్‌ బాగున్నాయని సినిమా చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక మరో గుర్తుండిపోయే పాత్రలో నటించారని చెబుతున్నారు. సినిమా కొన్ని చోట్ల స్లోగా ఉందని మరికొందరు అంటున్నారు.

  • ఏపీ రాజకీయాల్లో అల్లు అర్జున్ దుమారం

    ‘పుష్ప-2’లో అల్లు అర్జున్‌ చెప్పిన ‘రప్పా రప్పా నరుకుతా’ డైలాగ్‌ ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. జగన్ పల్నాడు పర్యటనలో ఓ కార్యకర్త ఆ డైలాగ్‌ రాసిన ప్లకార్డు ప్రదర్శించడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సినిమా డైలాగ్‌లు చెప్పడమూ తప్పేనా అంటూ జగన్ ప్రశ్నించారు. దీనిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని నరుకుతారు? ప్రజలనా? అంటూ ఆయన మండిపడ్డారు.

  • అభిమానుల ముందే ఏడ్చేసిన హీరోయిన్

    అభిమానుల ముందే నటి అనంతిక కంటతడి పెట్టుకున్నారు. అనంతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘8 వసంతాలు’ సినిమాను పలు చోట్ల ప్రీమియర్‌ షోలు వేశారు. ఈ క్రమంలో సినిమా చూసేందుకు హైదరాబాద్‌ బాలానగర్‌లోని విమల్‌ థియేటర్‌కు మూవీ యూనిట్‌ వెళ్లింది. సినిమాకు అభిమానుల నుంచి వస్తున్న స్పందన చూసి హీరోయిన్‌ అనంతిక కన్నీరు పెట్టుకున్నారు. ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

  • ఎస్పీఎన్‌ఐ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా ముకుంద్‌ ఆచార్య నియామకం

    సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా (ఎస్పీఎన్‌ఐ) తన కొత్త చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా ముకుంద్‌ ఆచార్యను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ముకుంద్‌ ఆచార్య..తన కొత్త ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా, ఎంటర్‌పైజ్‌ టెక్నాలజీ
    గ్రూప్‌, ఎల్‌ఐవీ టెక్నాలజీ, బ్రాడ్‌కాస్ట్‌ ఆపరేషన్స్‌ అండ్‌ నెట్‌వర్క్‌ ఇంజనీరింగ్‌తో సహా ఎస్పీఎన్‌ఐకు సంబంధించిన ఏకీకృత టెక్నాలజీ పోర్ట్‌ఫోలియోను పర్యవేక్షిస్తారు.

     

     

  • లతా మంగేష్కర్‌ 4,359 ఫొటోలతో.. కాన్వాస్‌పై ఒకే చిత్రం!

    భారత రత్న, ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌పై తనకున్న అభిమానాన్ని ఓ చిత్రకారుడు వైవిధ్యంగా చాటుకున్నారు. జబల్‌పుర్‌కు చెందిన రామ్‌కృపాల్‌ నమ్‌దేవ్‌ అనే చిత్రకారుడు ఏకంగా 4,359 లతా మంగేష్కర్‌ ఫొటోలతో కాన్వాస్‌పై ఓ చిత్రాన్ని రూపొందించారు. మధ్యప్రదేశ్‌లోని ఆర్ట్‌ గ్యాలరీలో ప్రదర్శనలో ఈ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ కోసం ఇప్పటికే ఈచిత్రాన్ని రిజిస్టర్‌ చేశారు.

  • ‘ఆ ఫీలింగ్‌ను ఎవరితో చెప్పలేకపోయాను’

    పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన వెబ్‌సిరీస్‌ ‘విరాటపాలెం’. ఇందులో అభిజ్ఞ, చరణ్‌ లక్కరాజు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 27 నుంచి ‘జీ 5’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సిరీస్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నటి అభిజ్ఞ మాట్లాడారు. ఈ సిరీస్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

  • ‘కుబేర’ టీమ్‌కు సూపర్ స్టార్ విషెస్‌.. ఇంట్రెస్టింగ్ పోస్ట్!

    నాగార్జున, ధనుష్‌, రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘కుబేర’. ఈ మూవీ రేపు విడుదలకానుంది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీ టీమ్‌కు విషెస్ తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

  • ఈ దశాబ్దంలో నాకు నచ్చిన చిత్రం ఇదే: హీరో నాని

    నేచురల్ స్టార్‌ నాని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓ చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. ఈ దశాబ్దంలో తనకు నచ్చిన సినిమాల్లో ‘మెయిజగన్‌’ తెలుగులో ‘సత్యం సుందరం’ ఒకటని తెలిపారు. భారీ బడ్జెట్ సినిమాల మధ్య వచ్చిన ఈ మూవీ భావోద్వేగం, వ్యక్తిగత జీవితంపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. ఇటీవల వ్యక్తిగతంగా తనకు మంచి అనుభవాన్ని ఇచ్చిన చిత్రమిదేనని వెల్లడించారు.