Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘కన్నప్ప’ ప్రీ-రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

    మంచు విష్ణు ప్రధానపాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం ఈనెల 27న విడుదలకానుంది. ఈనేపథ్యంలో మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఈనెల 21న సా.5గంటలకు హైదరాబాద్‌లోని JRC కన్వెషన్‌లో నిర్వహించనున్నారు.

  • శేఖర్‌ కమ్ములకు కర్లీ హెయిర్‌పై నాగ చైతన్య కామెంట్స్!

    దర్శకుడు శేఖర్‌ కమ్ములకు ఉంగరాల జుట్టు ఎందుకొచ్చిందో హీరో నాగ చై తన్య తెలిపారు. నాగార్జునతో కలిసి పాల్గొన్న ‘కుబేర’ ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని పంచుకున్నారు. సినిమా చిత్రీకరణను మానిటర్‌లో చూస్తూ.. వేళ్లతో జుట్టును ఎప్పుడూ తిప్పుతూనే ఉంటారని.. అందుకే అది ఉంగరాలు తిరిగిందని సరదాగా చెప్పారు. దానిపై డైరెక్టర్‌ స్పందిస్తూ.. చదువుకునే రోజుల నుంచి తనకు ఆ అలవాటు ఉందన్నారు.

  • యాంకర్‌కు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన జెనీలియా!

    నటి జెనీలియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో యంకర్‌కు దిమ్మతిరిగే అన్సర్ ఇచ్చింది. దక్షిణాదిలో మంచి పాత్రలు దక్కలేదు కదా? అని యాంకర్ ప్రశ్నించగా.. వెంటనే కాదంటూ ఆమె మధ్యలోనే అడ్డుకుంది. ‘‘సౌత్‌లో నాకెప్పుడూ మంచి పాత్రలే దక్కాయి. అక్కడ ఎంతో నేర్చుకున్నాను. నాకు మంచి సినిమాలు ఇచ్చారు. అందుకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈవీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

  • ‘Suriya45’ టైటిల్‌కు ముహుర్తం ఫిక్స్

    సూర్య హీరోగా ఆర్‌.జే. బాలాజీ డైరెక్షన్‌లో ఓ మూవీ (Suriya45) తెరకెక్కనుంది. ఈ సినిమా టైటిల్‌ను రేపు ఉ.10 గంటలకు ప్రకటించబోతున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.

  • అనుష్క ‘ఘాటి’.. ఫస్ట్ సాంగ్‌ వచ్చేది అప్పుడే!

    అనుష్క శెట్టి-విక్రమ్‌ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఘాటి’. ఈమూవీలోని ఫస్ట్ సాంగ్‌ను ఈనెల 21న రిలీజ్‌ చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించింది.

  • ‘Mega157’పై అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్.. పోస్టర్ రిలీజ్!

    మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రం ‘Mega157’. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ముస్సోరీ షెడ్యూల్ పూర్తి అయిందని మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, నయన్‌పై కీలక సన్నివేశాలు షూట్ చేశారు. ముస్సోరీ షెడ్యూల్ పూర్తయినట్లు తెలుపుతూ అనిల్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదలకానుంది.

  • విజయ్‌ దేవరకొండతో సినిమా?: కీర్తి సురేశ్‌ ఏమన్నారంటే?

    ‘ఉప్పు కప్పురంబు’ ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని హీరోయిన్ కీర్తిసురేశ్‌ అన్నారు. ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రమిది. సెటైరికల్‌ కామెడీ డ్రామాగా ఐవీ శశి రూపొందిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌ వీడియో వేదికగా జులై 4నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా కీర్తి మీడియాతో మాట్లాడారు. విజయ్‌ దేవరకొండ సినిమాలో నటిస్తున్నారా?.. అని అడగ్గా స్పందించారు. ఆ విషయం నిర్మాత దిల్‌ రాజు చెబుతారని సమాధానమిచ్చారు.

  • కోర్టుకు హాజరైన హీరో సుమంత్, నిర్మాత సుప్రియ

    AP: ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో చెక్ బౌన్స్ కేసు కోసం హీరో సుమంత్, నిర్మాత సుప్రియ కోర్టుకు హాజరయ్యారు. 2015లో ‘నరుడా డోనరుడా’ సినిమా తీసిన సమయంలో మార్కాపురం పట్టణానికి చెందిన ఒక పారిశ్రామికవేత్తకు వీరు రూ.70 లక్షల చెక్ ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ కావడంతో సుమంత్, సుప్రియపై కేసు నమోదైంది.

  • వెకేషన్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో జాన్వీకపూర్.. వీడియో వైరల్

    బాలీవుడ్‌ హీరోయిన్ జాన్వీకపూర్‌ తన బాయ్‌ ఫ్రెండ్‌ శిఖర్‌ పహారియాతో కలిసి లండన్‌కు వెళ్లారు. సినిమా షూటింగ్స్‌కు కాస్త బ్రేక్‌ ఇచ్చి వెకేషన్‌లో చిల్‌ అవుతున్నారు. తాజాగా ఆమె లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్న వీడియో వైరలవుతోంది.

  • ‘కుబేర’.. ఓవర్సీస్‌లో సాలిడ్ ఓపెనింగ్స్!

    నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘కుబేర’. మరికొన్ని గంటల్లో థియేటర్స్ లోకి రానుండగా.. ఇండియాతో సహా యూఎస్ మార్కెట్‌లో కూడా మంచి బుకింగ్స్‌ను కనబరుస్తుంది. యూఎస్ మార్కెట్‌లో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకునేలా ఈ సినిమా ఉందని చెప్పవచ్చు. కేవలం ప్రీమియర్స్ గ్రాస్‌గా మాత్రమే ఆల్రెడీ సినిమా 250K డాలర్స్ మార్క్‌ను దాటేసింది.