Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • తెలుగు పద్యం తడబడకుండా చెప్పిన తమిళ బ్యూటీ!

    తమిళ బ్యూటీ కీర్తి సురేశ్‌ తెలుగు పద్యం చెప్పింది. ‘ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు’ పద్యాన్ని ఎలాంటి తప్పులు లేకుండా, తడబడకుండా ఆమె పలికిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆమె నటించిన ‘ఉప్పు కప్పురంబు’ మూవీ ప్రమోషన్లలో భాగంగా పద్యం చెప్పింది. ఈ సినిమా జులై 4న అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలకానుంది.

  • మాష్టారూ… మాష్టారూ.. అంటూ నెటిజన్ల మనసు గెలిచింది!

    పుస్తకం ముఖచిత్రాన్ని చూసి ఎప్పుడూ ఒక అంచనాకు రాకూడదు అనే నానుడిని నిరూపిస్తూ.. ఓ యువతి పాట పాడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ధనుష్ నటించిన ‘సార్’ సినిమాలోని ‘‘మాష్టారూ.. మాష్టారూ..’’ అనే పాటను అద్బుతంగా పాడింది. నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ను ట్యాగ్ చేసి.. ‘‘ఈ అమ్మాయికి ఒక్క అవకాశం ఇవ్వండి.. ప్లీజ్’’ అని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • కుబేరులతో హీరో నాగ చైతన్య స్పెషల్ చిట్ చాట్!

    శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కుబేర’. ఈనెల 20న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో గురువారం కింగ్ నాగ్, దర్శకుడు శేఖర్‌తో హీరో అక్కినేని నాగచైతన్య స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ వీడియో మీరూ చూసేయండి.

  • ‘కుబేర’.. తన పాత్ర రివీల్ చేసిన నాగ్

    శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ‘కుబేర‌’లో ధ‌నుష్‌, నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. రేపు సినిమా రిలీజ్ నేపథ్యంలో నాగ్ మీడియాతో మాట్లాడారు. తాను గ‌తంలో చేసిన ప‌లు మ‌ల్టీస్టారర్ సినిమాల‌కు ‘కుబేర’ సినిమా భిన్నంగా ఉంటుంద‌న్నారు. త‌న పాత్ర మిడిల్‌క్లాస్‌కు చెందిన సీబీఐ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్న‌ట్టు నాగ్ వెల్ల‌డించాడు.

  • ట్రెండీ లుక్‌లో ‘మహానటి’

    హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండీ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ ‘మహానటి’ మోడ్రన్‌గా కనిపిస్తోంది. నెట్టింట ఈ పిక్ వైరల్‌ అవుతోంది.

     

  • ఎన్టీఆర్‌ మూవీలో కన్నడ బ్యూటీ.. ఫొటో వైరల్‌!

    ప్రశాంత్‌ నీల్‌-ఎన్టీఆర్ కాంబోలో రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె షూట్‌లో జాయిన్‌ అయినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. టైగర్‌ బొమ్మలతో ఉన్న షర్ట్‌ ధరించిన ఫొటోలను రుక్మిణి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ‘టైగర్‌ టైగర్‌ బర్నింగ్‌ బ్రైట్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో తారక్ ఫ్యాన్స్‌ ఈ ఫొటోలను వైరల్‌ చేస్తున్నారు.

  • ఆమిర్‌ ‘సితారే జమీన్‌ పర్‌’ మూవీపై సచిన్‌ రివ్యూ

    ఆమిర్‌ఖాన్-జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించిన ‘సితారే జమీన్‌ పర్‌’ చిత్రం రేపు విడుదలకానుంది. ఈ సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన స్పెషల్ షోను క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ వీక్షించారు. అనంతరం సచిన్‌ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘సినిమా చాలా బాగుంది. కథలో సితారే టీమ్‌ ఎలాంటి అనుభూతినైతే పొందిందో సినిమా చూసే ప్రేక్షకుడు ఆసాంతం అలాంటి భావోద్వేగాన్నే పొందుతాడు’’ అని కితాబిచ్చారు.

  • ‘ఉస్తాద్’ సెట్స్‌లో శ్రీలీల బర్త్ డే!

    పవన్ కళ్యాణ్-శ్రీలీల జంటగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇటీవల హీరోయిన్ శ్రీలీల బర్త్ డేను చిత్రయూనిట్ షూటింగ్ సెట్స్‌లో జరిపారు. దానికి సంబంధించిన ఓ ఫొటో తాజాగా బయటకు వచ్చి వైరల్‌గా మారింది. ఇందులో శ్రీలీల సింపుల్ లుక్స్‌లో కనిపిస్తుండగా.. పవన్ మాత్రం పోలీస్ గెటప్‌లో కనిపిస్తున్నారు.

  • ‘సన్ ఆఫ్ సర్దార్-2’ ఫ‌స్ట్ లుక్‌ రిలీజ్

    ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ చిత్రాన్ని బాలీవుడ్‌లో ‘సన్ అఫ్ సర్దార్’ పేరుతో రీమేక్ చేశారు. అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా నటించిన ఈ మూవీ రూ.100 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘సన్ ఆఫ్ సర్దార్-2’ రాబోతోంది. విజ‌య్ కుమార్ అరోరా ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది.

  • నోరూరించే స్టార్ హీరోయిన్లు.. వీడియో వైరల్!

    ప్రస్తుతం AI సాయంతో చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎంతో మంది చాలా ఇష్టంగా తినే వంటకాలను దుస్తులుగా మార్చేసి.. డిజైనర్ వేర్‌గా చూపిస్తున్న స్టార్ హీరోయిన్స్‌ను ఏఐ ద్వారా సృష్టించారు. ఇక ఈ వీడియోలో కాజల్ పరోట, అనుష్క ఇడ్లీ, తమన్నా వడా, నయనతార దోస, త్రిష నూడిల్స్, సాయిపల్లవి ద్రాక్షతో చేసిన డ్రెస్సులను ధరించినట్లు కనిపిస్తున్నారు.