Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • నేరుగా ఓటీటీలోకి కీర్తిసురేశ్‌ కొత్త మూవీ.. ఫన్నీ ట్రైలర్‌!

    హీరోయిన్ కీర్తిసురేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఉప్పు కప్పురంబు’. నటుడు సుహాస్‌ కీలక పాత్ర పోషించారు. సెటైరికల్‌ కామెడీ డ్రామాగా ఐవీ శశి రూపొందిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌ ఒరిజినల్‌ మూవీగా ఇది సిద్ధమైంది. జులై 4 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈనేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

  • ‘థగ్‌ లైఫ్‌’కు రక్షణ కల్పిస్తాం: కర్ణాటక ప్రభుత్వం

    ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ నటించిన ‘థగ్‌ లైఫ్‌’ సినిమా స్క్రీనింగ్‌కు ఎట్టకేలకు రక్షణ కల్పిస్తామని కర్ణాటక ప్రభుత్వం నుంచి హామీ లభించింది. ఈమేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నేడు సుప్రీంకోర్టుకు వెల్లడించింది. దీంతో కన్నడనాట ఈ చిత్రంపై అనధికారిక బ్యాన్‌కు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్‌) విచారణను జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ మన్మోహన్‌ బెంచ్‌ ముగించింది.

  • ‘SSMB29’ కోసం ఓ నగరాన్నే నిర్మించారట!

    సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు-దర్శకుడు రాజమౌళి కాంబోలో ‘SSMB29’ అనే వర్కింగ్ టైటిల్‌‌తో ఓ భారీ అడ్వెంచర్ మూవీ తెరకెక్కుతోంది. దీని కోసం జక్కన్న భారీ ప్లానింగ్స్‌ చేస్తున్నారు. ఈ సినిమా కోసం తాజాగా రామోజీ ఫిల్మ్‌ సిటీలో అతిపెద్ద సెట్‌ను నిర్మిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. దాదాపు రూ.50 కోట్లతో వారణాసి లాంటి నగరాన్ని రూపుదిద్దుతున్నట్లు తెలుస్తోంది.

  • డైరెక్ట్‌గా ఓటీటీలోకి అభిషేక్‌ బచ్చన్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

    బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ తన తర్వాత సినిమా విడుదల తేదీని ప్రకటించారు. మధుమిత దర్శకత్వంలో రానున్న ‘కాళిధర్‌ లాపత’ను డైరెక్ట్‌గా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ ఆసక్తికర పోస్టర్‌ను పంచుకున్నారు. అభిషేక్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం జీ5 వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

  • ఏపీలో ‘కుబేర’ టికెట్‌ ధరలు పెంపు

    ఏపీలో ‘కుబేర’ సినిమా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ధనుష్‌, నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కుబేర’. జూన్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సింగిల్‌ స్క్రీన్స్‌, మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ ధరను రూ.75 (జీఎస్టీతో) పెంచుకునేలా వీలు కల్పించారు.

  • వేటూరి గురించి శేఖర్ కమ్ముల ఏమన్నారంటే

    నాగార్జున, ధనుష్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘కుబేర’ జూన్‌ 20న విడుదల కానుంది. అయితే, తాజాగా శేఖర్ కమ్ముల ఓ ఇంటర్వ్యూలో దివగంత సినీ గేయరచయిత వేటూరి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ సినీ ప్రపంచంలో వేటూరి రచనలు మధురాతి మధురం.  వేటూరిని తలచుకుని ఒంటరిగా కూర్చుని ఏడ్చిన సందర్భాలు ఎన్నో.. వందల బ్లాక్ బస్టర్ సినిమాలకంటే ఆయనే ఎక్కువ’’ అని చెప్పారు.

  • మమ్ముట్టి ఆరోగ్యంపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ

    మలయాళ హీరో మమ్ముట్టి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలను రాజ్యసభ ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ ఖండించారు. మమ్ముట్టికి చిన్న ఆరోగ్య సమస్య ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారని ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ తెలిపారు.

  • కియారా కోసం యశ్​ స్పెషల్​ కేరింగ్

    బాలీవుడ్​ నటి​ కియారా అద్వానీ ప్రస్తుతం ప్రెగ్నెన్సీ టైమ్​ను ఎంజాయ్​ చేస్తున్నారు. యశ్‌హీరోగా  డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కిస్తున్న ‘టాక్సిక్‌’ మూవీలో కియారా నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్​ లోకేషన్​ను ముంబయికి మార్చితే కియారా​కు అనుకూలంగా ఉంటుందని యశ్ భావిస్తున్నారట. ఈ మేరకు ఈ ప్రతిపాదనను హీరో యశ్​ స్వయంగా మేకర్స్​ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

     

  • మునీర్‌కి ట్రంప్ విందు ఇవ్వడానికి కారణం ఇదేనా?

    అమెరికా నేడో, రేపో ఇరాన్‌పై యుద్ధానికి సన్నద్ధమైపోయింది.  ఇరాన్‌తో అత్యధికంగా 909 కిలోమీటర్ల సరిహద్దును పంచుకొంటున్న పాక్‌తో అమెరికాకి అవసరం పడింది. యుద్ధ సమయంలో టెహ్రాన్‌లో ఇంటెలిజెన్స్‌ సేకరణ, లాజిస్టిక్స్‌ అవసరాలు తీర్చడం, ఆ దేశంపై దాడికి వాయుసేన స్థావరాలు అమెరికాకు చాలా అవసరం. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ ఫీల్డ్‌మార్షల్‌ అసీం మునీర్‌కు విందు ఇచ్చినట్లు తెలుస్తోంది.

     

  • ఈనెల 21న ‘కన్నప్ప’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

    మంచు విష్ణు హీరోగా ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కిస్తోన్న “కన్నప్ప” సినిమా ఈనెల 27న విడుదల కానుంది. అయితే, మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్‌ హైదరాబాద్‌లో గ్రాండ్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 21న సాయంత్రం 6 గంటలకు ఈవెంట్‌ జరగనున్నట్లు సినీవర్లాలు వెల్లడించాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో ప్రభాస్, అక్షయ్ కూమార్ నటించారు.