Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • రానా, అల్లు అర్జున్ వాట్సప్‌ గ్రూప్‌.. అందుకే బయటకు వచ్చేశా: మంచు విష్ణు

    మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’జూన్‌ 27న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ‘‘రానా, అల్లు అర్జున్‌తో సహా పలువురు హీరోలు, హీరోయిన్స్‌కు ఓ వాట్సప్‌ గ్రూప్‌ ఉంటుంది.  నాకు బిడియం ఎక్కువ .. అందుకే ఆ వాట్సప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌ అయ్యా’’అని తెలిపారు.

     

  • బిలియనీర్‌ వర్సెస్‌ బెగ్గర్‌ కథే ‘కుబేర’: శేఖర్‌ కమ్ముల

    ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘కుబేర’మూవీ ఈ నెల 20న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ‘బిలియనీర్‌ వర్సెస్‌ బెగ్గర్‌ కథే ‘కుబేర’. ఇలాంటి చిత్రాన్ని..ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు ఆనందంతో పాటు చాలా గర్వంగానూ ఉంది. ఇది చూశాక అందరిలో ఓ మార్పు వస్తుంది’’అని అన్నారు.

     

  • హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూజ్‌కు ఆస్కార్‌ అవార్డు

    హాలీవుడ్ సూపర్‌స్టార్ టామ్ క్రూజ్‌కు 2025లో గవర్నర్స్ అవార్డ్స్‌లో గౌరవ ఆస్కార్ అవార్డు లభించింది. ఈ ఏడాది నవంబర్ 16న లాస్ ఏంజిల్స్‌లో జరిగే వేడుకలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. సినీ రంగంలో ఆయన అసాధారణ కృషి, థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌కు చేసిన కృషికి అకాడమీ ఈ గౌరవం ప్రకటించింది.

  • సౌత్‌ సినిమా హీరోయిన్‌ రోల్స్‌పై జెనీలియా కామెంట్స్

    ‘సితారే జమీన్‌ పర్‌’ సినిమాతో జెనీలియా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ ఇంటర్వ్యూలో ‘సౌత్‌ మూవీస్‌లో హీరోయిన్లకు బలమైన పాత్రలు లభిస్తాయా?’ అని‌ అడగ్గా ఆమె స్పందించారు. ‘‘ఒకసారి నేను నటించిన దక్షిణాది చిత్రాలు చూడండి. నాకు మంచి రోల్స్‌ దక్కాయి. నటనలో నేను ఎక్కువ విషయాలు నేర్చుకుంది అక్కడే. మంచి అవకాశాలు అందించిన సౌత్‌ ఇండస్ట్రీకి రుణపడి ఉంటా’’ అని తెలిపారు.

  • జులై 4న ‘ది హంట్’ వెబ్ సిరీస్ విడుదల

    మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసుపై రూపొందించిన వెబ్సరీస్ ‘ది హంట్. ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్’ జులై 4 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. రాజీవ్ గాంధీ హత్య, తర్వాత చేపట్టిన కేసు ఇన్వెస్టిగేషన్‌పై తెరకెక్కిన ఈ సీరీసు నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించారు. అమిత్ సియాల్, సాహిల్ వైద్, భగవతీ పెరుమాళ్ కీలక పాత్రలో నటించారు.

     

  • దాన్ని కాపాడుకోండి.. శ్రీలీల ఇంట్రెస్టింగ్ పోస్ట్!

    టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల సోషల్ మీడియాలో యాక్టివ్గ్‌గా ఉంటూ తన వ్యక్తిగత, సినిమా విషయాల్ని పంచుకుంటోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సెన్సేషనల్ బ్యూటీ నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. ‘‘మీ శాంతిని కాపాడుకోండి’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన క్యూట్ వీడియో పంచుకుంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.

  • విజయ్ ‘కింగ్‌డమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘కింగ్‌డమ్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌. ఈ సినిమా రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో అనేక వార్తలు షికార్లు చేస్తున్నాయి. తాజాగా రిలీజ్ డేట్‌పై మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీని జూలై 25 రిలీజ్ చేసేందుకు సిద్ధపడుతున్నారట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

  • ‘సూర్య-45’పై బిగ్ అప్‌డేట్!

    హీరో సూర్య నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘సూర్య-45’ ఒకటి. ఈ మూవీకి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాపై క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీ టైటిల్, టీజర్‌ జూన్ 20న రాబోతున్నట్లు ఓ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

  • భవిష్యత్తు ఊహించలేము.. రష్మిక ఆసక్తికర పోస్ట్!

    నేషనల్ క్రష్ రష్మిక తాజాగా నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. ‘‘మీ చుట్టూ ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. మనం భవిష్యత్తు ఊహించలేము.. కాబట్టి దయచేసి ఒకరికొకరు దయగా ఉండండి, మీ పట్ల దయగా ఉండండి. మీకు అత్యంత ముఖ్యమైన పనులు చేయండి’ అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చింది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ బ్యూటిఫుల్ పిక్స్ పంచుకుంది.

  • ‘రానా నాయుడు 2’.. ఫస్ట్‌ ఎపిసోడ్‌ స్నీక్‌పీక్‌ చూశారా!

    వెంకటేశ్‌, రానా ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌కు మంచి ఆదరణ దక్కిన సంగతి తెలిసిందే. సీజన్‌ 2 ఇటీవల ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో విడుదలైంది. సదరు సంస్థ తాజాగా యూట్యూబ్‌ వేదికగా ఆ సిరీస్‌ ఫస్ట్‌ ఎపిసోడ్‌ స్నీక్‌పీక్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. కొన్ని కీలక సన్నివేశాలను ఇందులో చూడొచ్చు.