ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషించారు. జూన్ 20న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈమూవీలోని 4వ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘నా కొడుక’ అంటూ సాంగే ఈ పాటను సిందూరి విశాల్ ఆలపించగా.. దేవీశ్రీ పసాద్ సంగీతం అందించారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
ఆసక్తిరేపుతున్న ‘రాజాసాబ్’ సెట్ వీడియో
ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్’. డిసెంబర్ 5న విడుదలకానుంది. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైంది. ప్రభాస్ వింటేజ్ లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ‘రాజాసాబ్’ కోసం నిర్మించిన హవేలి రాజ్‌మహల్ సెట్‌ను టీమ్ ఇప్పటికే మీడియాకు చూపించింది. తాజాగా దానికి సంబంధించిన వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
-
నన్ను పెళ్లి చేసుకుంటారా?: అభిమానికి హీరోయిన్ ఆన్సర్ ఇదే!
హీరోయిన్స్ మాళవికా మోహనన్ తాజాగా ఎక్స్ వేదికగా ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ అభిమాని పెళ్లి గురించి అడగ్గా ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. ‘నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని సదరు అభిమాని సరదాగా ప్రశ్నించగా.. తనకు దెయ్యాలంటే భయమని మాళవిక రిప్లై ఇచ్చారు. అతడి ఎక్స్ ఖాతా పేరు ‘ఘోస్ట్’ అని ఉండడంతో ఆమె అలా సమాధానమిచ్చారు.
-
మరోసారి ‘మాస్టర్’గా మెగాస్టార్
అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ‘Mega157’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముస్సోరీలో జరుగుతోంది. అయితే ఈ సినిమాలో చిరు స్కూల్‌లో పిల్లలకు ఆటలు నేర్పించే డ్రిల్ మాస్టర్ పాత్రలో కనిపించబోతున్నాడట. వింటేజ్ మెగాస్టార్ మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.
-
ఫ్యామిలీతో నటుడు నవీన్ చంద్ర
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర పెళ్లిబంధానికి ఇటీవలే ఐదేళ్లు పూర్తయ్యయి. ఈ సందర్భంగా తన భార్య, కుమారుడితో ఉన్న ఫోటోలను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు.
-
చీరలో కృతి అందాల జాతర!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతిశెట్టి చీరలో తన అందాలు ఆరబోస్తూ తాజాగా షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. బ్లాక్ కలర్ శారీలో క్యూట్ స్మైల్‌తో కనిపిస్తోంది.
-
సిద్ధు ‘తెలుసు కదా’ లేటెస్ట్ అప్‌డేట్!
స్టార్‌బాయ్ సిద్ధు నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’. నీరజా కోన దర్శకురాలు. ఇందులో రాశిఖన్నా, శ్రీనిధిశెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ మూవీ చివరి షూటింగ్ షెడ్యూల్ ఈ రోజు ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూట్ జరుగుతోంది. ఈ షెడ్యుల్‌తో సినిమా మొత్తం ప్రొడక్షన్ పూర్తవుతుంది. ఈ నెలలో ఫస్ట్ సాంగను విడుదల చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించాలని టీం ప్లాన్ చేస్తోంది.
-
ఆకట్టుకునేలా ‘సోలో బాయ్’ ట్రైలర్
గౌతమ్ కృష్ణ హీరోగా నటించిన సినిమా ‘సోలో బాయ్’. రమ్య పసుపులేటి, శ్వేతా అవస్తి హీరోయిన్లు. పి. నవీన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 4న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేసింది.
-
‘కుబేర’ నుంచి ఆసక్తికర పోస్టర్ రిలీజ్
హీరో ధనుష్ ప్రధానపాత్రలో నటిస్తున్న ‘కుబేర’ చిత్రం ఈనెల 20న విడుదలకానుంది. ఈనేపథ్యంలో మేకర్స్ కౌంట్ డౌన్ పోస్టర్ వదిలారు. అలాగే టికెట్ బుకింగ్స్ ప్రారంభమైనట్లు వెల్లడించారు.
-
రాజీవ్ గాంధీ హత్య కేసుపై సిరీస్.. ఉత్కంఠగా ట్రైలర్
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసు ఇతివృత్తంగా రూపొందిన వెబ్‌సిరీస్ ‘ది హంట్’. ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ అనేది ట్యాగ్ టైన్. ఈ సిరీస్ ఓటీటీ ‘సోనీలివ్’లో జులై 4 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు.ట్రైలర్ ఉత్కంఠగా సాగింది. నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో అమిత్ సియాల్, సాహిల్ వైద్ తదితరులు నటించారు.