Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘పుష్ప’తో సరస్వతి.. నివేదా పోస్ట్ వైరల్!

    నటి నివేదా థామస్.. అల్లు అర్జున్‌తో కలిసి ఓ పిక్ షేర్ చేసుకుంది. ‘సరస్వతి అండ్ పుష్ప’ అంటూ క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేయగా ఇది వైరల్‌గా మారింది.

  • భీమ్స్‌తో ‘విశ్వంభ‌ర’ స్పెషల్ సాంగ్!

    మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం ‘విశ్వంభ‌ర’. త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. వ‌శిష్ఠ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌కు సంబంధించి ఒక వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ సాంగ్ ఇంకా ఒకే కాలేద‌ని.. కీర‌వాణి సంగీతం అందించిన సాంగ్ చిరుకి న‌చ్చ‌లేద‌ట. అందుకే సంగీత ద‌ర్శ‌కుడు భీమ్స్‌తో చిత్ర‌యూనిట్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం.

     

  • అక్కడ కూడా ‘పుష్ప-2’ రికార్డుల మోత!

    అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ రికార్డులు సృష్టించింది. ఈ మూవీ తాజాగా టెలివిజన్​‌లో ప్రసారమైంది. అయితే ఇక్కడ కూడా ‘పుష్ప’ ప్రభంజనం సృష్టించింది. హిందీలో రికార్డ్ స్థాయి టీఆర్​పీ రేటింగ్స్ నమోదు చేసింది. ఈ సినిమాకు 5.1 టెలివిజన్​ రేటింగ్స్ రాగా.. మొత్తం 5.4 కోట్ల మంది వీక్షించారు. ఈ క్రమంలో బాలీవుడ్​ చిత్రాలు​ ‘పటాన్’, ‘యానిమల్​’ కంటే కూడా ‘పుష్ప-2’కే అత్యధిక టీఆర్​పీ నమోదవ్వడం విశేషం.

     

  • ర‘కూల్’గా మురిపిస్తోంది!

    బాలీవుడ్ బ్యూటీ రకుల్ పీత్ తాజాగా SMలో బ్యూటీఫుట్ పిక్ పంచుకుంది. ఇందులో ఆమె పింక్ కలర్ డ్రెస్‌లో మెస్మరైజింగ్‌ లుక్‌లో కూల్‌గా కనిపిస్తోంది.

  • రామోజీ ఫిల్మ్ సిటీలో భయపడ్డాను: బాలీవుడ్ నటి

    బాలీవుడ్ నటి కాజోల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ అని తెలిపింది. ‘‘ఎందుకో అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు నెగెటివ్ వైబ్స్ వచ్చాయి. కొన్ని ప్రదేశాలు చాలా భయపెడతాయి. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని.. మరోసారి అక్కడికి రాకూడదు అనిపిస్తుంది. రామోజీ ఫిల్మ్స్ సిటీ కూడా అలాంటిదే’’ అని చెప్పుకొచ్చింది.

  • పెళ్లి చేసుకోబోతున్న జాన్వీ.. ఫొటోలు వైరల్?

    బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ తాజాగా మంగళ స్నానాలు చేస్తున్న ఫొటోలు షేర్ చేసింది. దీంతో అవి చూసిన నెటిజన్లు ఆమె పెళ్లి చేసుకోబోతుందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి బిగ్ షాకిచ్చిందని అంటున్నారు. కానీ ఆమె అభిమానులు మాత్రం అవి ఏదైనా సినిమాకు సంబంధించిన స్టిల్స్ కావొచ్చని కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  • ‘కుబేర’ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే?

    ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘కుబేర’. ఈనెల 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక మూవీ రన్ టైం 3గంటల 15 నిమిషాలు అని తెలుస్తోంది.

  • ఈ సారి పక్కాగా ప్లాన్‌‌తో వస్తోన్న డైరెక్టర్ పూరి?

    టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తన నెక్ట్స్ ప్రాజెక్టును పక్కాగా ప్లాన్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం విజయ్‌ సేతుపతి, టబు, దునియా విజయ్‌ వంటి నటులను తీసుకోగా తాజాగా హీరోయిన్‌ సంయుక్త మేనన్‌ కూడా భాగమైనట్లు పూరీ ప్రకటించాడు. దీంతో ఆయన సారి గట్టిగా ప్లాన్‌ చేస్తున్నాడని ఫ్యాన్స్‌ చర్చించుకుంటున్నారు.

  • ఓటీటీలోకి మరో క్రైమ్‌ థ్రిల్లర్‌.. ఆసక్తిగా ట్రైలర్

    ఇద్దరు మహిళలు.. ఒక బ్యూటీపార్లర్‌, ఎన్నో ట్విస్ట్‌లు.. ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో రూపొందిన చిత్రమే ‘‘కొల్లా’’. ఈటీవీ విన్‌ వేదికగా జూన్‌ 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ఆసక్తికరమైన ట్రైలర్‌ను సంస్థ పంచుకుంది. రజిషా విజయన్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ ట్రైలర్‌ను మీరూ చూసేయండి.

  • ‘ది రాజాసాబ్‌’ స్టోరీ.. మారుతి ఏమన్నారంటే

    ప్రభాస్‌ హీరోగా దర్శకుడు మారుతి రూపొందిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్‌’. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఈ సినిమా స్టోరీ గురించి మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాతయ్య, నానమ్మ, మనవడి కథే ‘ది రాజాసాబ్’ అని చెప్పారు.