ప్రముఖ తమిళ నటుడు జయం రవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రో కోడ్’. ఈ సినిమా తెలుగు ప్రోమోను గురువారం చిత్ర బృందం విడుదల చేసింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. వివేక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
అందుకే టాలీవుడ్‌లో నటించట్లేదు: హీరోయిన్
‘ఆనంద్’ చిత్రంతో పరిచయమై, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటి కమలినీ ముఖర్జీ. ఈ బ్యూటీ టాలీవుడ్‌కు దూరమై దశాబ్దం దాటింది. దానికి గల కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఓ సినిమాలో పోషించిన పాత్ర తాను ఊహించినంత స్థాయిలో తెరకెక్కలేదని.. ఆ క్యారెక్టర్‌పై అసంతృప్తి కలిగిందని తెలిపింది. ఆ విషయంలో ఫీలయ్యానని, అందుకే తెలుగు సినిమాల్లో నటించలేదని వెల్లడించింది.
-
‘ఘాటి’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
అనుష్క శెట్టి-విక్రమ్ ప్రభు ప్రధానపాత్రల్లో నటిస్తుత్న సినిమా ‘ఘాటి’. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈమూవీ సెప్టెంబరు 5న రిలీజ్‌కానుంది. తాజాగా ఈచిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. దీనికి సెన్సార్‌బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేయగా.. రన్ టైమ్‌ను 2గంటల 35 నిమిషాలకు మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా క్రిష్, అనుష్కలకు బెస్ట్ కమ్ బ్యాక్ అవుతుందని సినీ వర్గాల టాక్.
-
అఫీషియల్: ‘అఖండ 2’ వాయిదా
బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ సినిమా విడుదల వాయిదా వేసినట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు. సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సివుండగా.. పోస్ట్ ప్రొడక్షన్స్ కారణంగా పోస్ట్‌పోన్ చేసినట్లు వెల్లడించారు.
-
ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా.. ‘వేదవ్యాస్’ షురూ
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తన 43వ సినిమా ‘వేదవ్యాస్’ను ప్రకటించారు. ఈరోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మాత దిల్‌రాజు, డైరెక్టర్స్ వీవీ వినాయక్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు వీవీ వినాయక్ క్లాప్ ఇవ్వగా.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాతో సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం కాబోతుంది.
-
‘మిరాయ్’ కథ లీక్ చేసిన హీరో తేజ!
‘మిరాయ్’ ట్రైలర్‌తో అంచనాలు పెరిగాయి. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్ర బృందం ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘మిరాయ్’ టీమ్ పంచుకున్న విశేషాలు ఈ మీడియోలో మీరు చూడొచ్చు.
-
ఖరీదైన ఇల్లు అమ్ముకున్న స్టార్ నటుడు
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తాజాగా తన ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను అమ్మేసినట్లు తెలుస్తోంది. ముంబయిలోని లోఖండ్‌వాలా మినర్వా ప్రాంతంలో ఉన్న మహాలక్ష్మీ అపార్ట్‌మెంట్‌ను దాదాపు రూ.8.10 కోట్లకు అమ్మేసినట్లు సమాచారం. కాగా.. సోనూ సూద్ 2012లో ఈ భవనాన్ని రూ.5.16 కోట్లకు కొనుగోలు చేశాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత రూ.2.94 కోట్ల లాభానికి అమ్మేశాడు.
-
విలన్‌గా సూపర్‌స్టార్ మహేష్ మరదలు.. ఆసక్తిగా పోస్టర్!
సుధీర్ బాబు-సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జటాధర’. ఈ సినిమాలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు మరదలు శిల్పా శిరోద్కర్ నటిస్తున్నట్లు తాజాగా ప్రకటిస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఆమె ‘శోభా’గా విలన్ పాత్రలో నటిస్తోంది. ఈ పోస్టర్‌లో శిల్పా హోమం ముందు కూర్చొని పవర్ ఫుల్ లుక్‌లో కనపిస్తోంది.
-
గ్లామర్ లుక్‌లో నివేదా థామస్
హీరోయిన్ నివేదా థామస్ తన లేటెస్ట్ ఫొటోను నెట్టింట షేర్ చేసుకుంది. ఇందులో ఆమె బ్లాక్ కలర్ చుడీదార్ వేసుకుని చాలా క్యూట్, అందంగా కనిపించింది.
-
వినాయక చవితి వేడుకల్లో సల్మాన్ ఫ్యామిలీ.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. తన సోదరి అర్పిత ఖాన్ శర్మ ముంబైలోని నివాసంలో జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన ఒక వీడియోను ఆయన బుధవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సల్మాన్ తల్లిదండ్రులు మొదటగా గణపతికి హారతి ఇస్తూ కనిపించారు.