Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘ది రాజాసాబ్‌’ స్టోరీ.. మారుతి ఏమన్నారంటే

    ప్రభాస్‌ హీరోగా దర్శకుడు మారుతి రూపొందిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్‌’. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఈ సినిమా స్టోరీ గురించి మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాతయ్య, నానమ్మ, మనవడి కథే ‘ది రాజాసాబ్’ అని చెప్పారు.

     

  • హీరో ఆర్య నివాసంలో ఐటీ సోదాలు

    ప్రముఖ హీరో ఆర్య నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహిస్తున్నారు. అన్నానగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఆయన చెందిన సీ షెల్‌ రెస్టారెంట్లపై కూడా అధికారులు దాడులు చేస్తున్నారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలోనే అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, ఈ దాడులను ఉద్దేశించి ఆర్య స్పందించారు. సీ షెల్‌ రెస్టారెంట్లతో తనకు సంబంధం లేదని చెప్పారు.

     

  • ఆమెకోసం షూటింగ్ లోకేష‌న్‌ షిఫ్ట్: యష్

    కన్నడ స్టార్ హీరో యష్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్​’. ఈ సినిమాకు గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. కేవీన్‌ఎన్‌ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈమూవీలో న‌య‌న‌తార, కియార అద్వానీ నటిస్తున్నారు. కియార గ‌ర్భ‌వ‌తి కావ‌డంతో య‌ష్ త‌న లోకేష‌న్‌ని బెంగ‌ళూరు నుంచి ముంబైకి షిఫ్ట్ చేశాడు. నటికోసం షూటింగ్ లోకేష‌న్‌నే మార్చిన య‌ష్‌పై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.

  • ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’ మూవీ షూటింగ్‌ వాయిదాపై క్లారిటీ!

    అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’. కామెడీ డ్రామా నేపథ్యంలో అహ్మద్‌ ఖాన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జ్యోతిదేశ్‌ పాండే, ఫిరోజ్‌ ఎ.నడియాడ్‌ వాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారన్ని మేకర్స్ ఖండించారు. పహల్గాం ఘటన కారణంగా ఆగిపోయిందని వెల్లడించారు.

  • పీఆర్‌ చెప్పిందే దీపిక చేసి ఉంటారు: వివేక్

    దీపిక చాలా తెలివైన నటి అని వివేక్ అగ్నిహోత్రి అన్నారు. గతంలో ఆమె జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయాన్ని సందర్శించడంపై ఆయన తాజాగా స్పందించారు. ‘‘దీపికా పదుకొణెకు అక్కడి పరిస్థితుల గురించి ఏం తెలియదని నేను హామీ ఇవ్వగలను. పీఆర్‌ చెప్పిన సలహాలను ఆమె పాటించి ఉంటుంది. ఆమె కెరీర్‌పై ప్రభావం చూపుతుందని ఆమెకు తెలిసి ఉంటే అక్కడికి వెళ్లేది కాదు’’ అని చెప్పారు.

  • “ఓజీ’ క్రేజ్‌!.. రిలీజ్‌‌కు ముందే కాసుల వర్షం

    పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘ఓజీ’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గేట్లే ఈ మూవీ రిలీజ్‌‌కు ముందే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 200 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరుపుకుందని ట్రేడ్‌ పండితులు
    చెబుతున్నారు. సీక్వెల్‌ క్రేజ్‌ తో “పుష్ప 2′ రూ.220 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరుపుకుంటే.. కేవలం పవర్‌ స్టార్‌ క్రేజ్‌తో ‘ఓజీ ఈ ఘనత సాధించిన రెండో తెలుగు చిత్రంగా నిలిచిందంటున్నారు.

  • నాకు యాక్టింగ్‌ కంటే డైరెక్షన్‌ అంటేనే ఎక్కువ ఇష్టం: ధనుష్

    ధనుష్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘కుబేర’.ఈ మూవీ జూన్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, మూవీ ప్రమోషన్స్‌లో ధనుష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు యాక్టింగ్‌ కంటే డైరెక్షన్‌ అంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పారు. అభిమానుల కోసమే తాను సినిమాలు చేస్తున్నానని వెల్లడించారు.

  • భారీ ట్రైన్‌ సెట్‌లో ‘పెద్ది’ షూటింగ్‌!

    రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ‘పెద్ద’ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ ట్రైన్‌ సెట్‌లో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సినీవర్లాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి వైరలవుతోంది. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకూ ఎవరూ చేయని హైఆక్టేన్‌, హైరిస్క్‌ యాక్షన్‌ సన్నివేశాలు షూట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

  • నాగచైతన్యతో కలిసి ప్రమోషన్స్‌.. సమంత క్లారిటీ

    నటుడు నాగచైతన్య, సమంత కలిసి వర్క్‌ చేసిన చిత్రం ‘ఏ మాయ చేసావె. సుమారు 15 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం వచ్చే నెల 18న రీ రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే ‘ఏ మాయ చేసావె’ రీ రిలీజ్‌ ప్రమోషన్స్‌లో సామ్‌-చై కలిసి పాల్గొననున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆయా వార్తలపై సమంత స్పందించారు. అందులో ఎలాంటి నిజం లేదని ఆమె చెప్పారు.

  • ఒకే కారులో విజయ్‌ దేవరకొండ, రష్మిక.. (VIDEO)

    నటుడు విజయ్‌ దేవరకొండ, రష్మిక మరోసారి వార్తల్లో నిలిచారు. ముంబయి విమానాశ్రయంలో వీరిద్దరూ కలిసి కనిపించారు. రష్మిక ఉన్న కారులోనే విజయ్‌ ముందు సీట్‌లో కూర్చున్నారు. దీనికి సంబధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. దీంతో వీళ్లు రిలేషన్‌లోనే ఉన్నారనే వార్తలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.