Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • మరో 3రోజుల్లో ‘కుబేర’

    నాగార్జున, ధనుష్‌ ప్రధాన పాత్రల్లో శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన ‘కుబేర’ ఈనెల 20న విడుదలకానుంది. మరో 3రోజుల్లో మూవీ రిలీజ్ కానుందంటూ మేకర్స్ పోస్టర్ వదిలారు.

  • బ్యూటీఫుల్ లుక్‌లో మీనాక్షి చౌదరి!

    హీరోయిన్ మీనాక్షి చౌదరి లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో తన గ్లామర్ ఫొటోను పోస్టు చేసింది. ఆమె చీరలో అందాలు ఆరబోస్తున్న ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది.

  • సడెన్‌గా ఓటీటీలోకి ‘ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్‌లైన్స్’

    హాలీవుడ్‌లో ‘ఫైనల్ డెస్టినేషన్’ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన సినిమాలకు తెలుగులో భారీ క్రేజ్‌ ఉంది. తాజాగా ఈ సీక్వెల్‌ చిత్రాల నుంచి విడుదలైన ‘ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్‌లైన్స్’ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులో కూడా స్ట్రీమింగ్‌ అవుతుంది. సడెన్‌గా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ వచ్చిన ఈ మూవీ.. ప్రస్తుతం భారత్‌ నెట్‌వర్క్‌లో అందుబాటులో లేదు. మరో వారంలోనే భారత్‌లో కూడా స్ట్రీమింగ్‌కు రావచ్చని తెలుస్తోంది.

     

  • Video: ‘వింగ్‌ చున్‌’తో ఆకట్టుకున్న ఫైట్‌ మాస్టర్‌

    అనంతిక, హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఫణీంద్ర తెరకెక్కించిన సినిమా ‘8 వసంతాలు’. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫైట్‌ మాస్టర్‌ అంజి చైనా యుద్ధకళ వింగ్‌ చున్‌ ఎలా చేస్తారో చూపించారు. సినిమాలో.. హీరోయిన్‌ అనంతిక తనకంటే బాగా చేసిందని కొనియాడారు. ఈ చిత్రం ఈనెల 20న విడుదలకానుంది. వీడియో కోసం ClickHere.

  • ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌పై బిగ్ అప్‌డేట్!

    పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్-నిధి అగర్వాల్ జంటగా జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్న భారీ హిస్టారికల్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. రేపు ఈమూవీ రిలీజ్‌ డేట్, ట్రైలర్‌పై అప్‌డేట్ ఇవ్వనున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సివుంది.

  • భాగ్యశ్రీ అందానికి ఫిదా అవ్వాల్సిందే!

    హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తాజాగా ఇన్‌స్టాలో తన అందమైన ఫోటోను షేర్ చేసి నెటిజన్స్‌ను ఫిదా చేసింది. ఇందులో ఆమె వైట్ కలర్ ఔట్‌ఫిట్‌లో ఎంతో హాట్‌గా కనిపిస్తోంది.

  • ఓటీటీలో ‘అనగనగా..’ మరో రికార్డు

    సుమంత్‌ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అనగనగా’. ఈటీవీ విన్‌లో మే 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ మూవీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ‘అనగనగా..’ మరో రికార్డు సృష్టించినట్లు ఈటీవీ విన్‌ తెలిపింది. విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ 150+ మిలియన్‌ స్ట్రీమింగ్‌ మినిట్స్‌ పూర్తయినట్లు తెలిపింది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది.

  • ప్రముఖ నటి రమ్యశ్రీపై కత్తితో దాడి

    HYD: ప్రముఖ నటి రమ్యశ్రీపై దాడి జరిగింది. గచ్చిబౌలి పీఎస్ దగ్గరలోని FCI కాలనీ లేఅవుట్‌లో ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేశారు. దానిని నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్ వీడియో తీస్తున్నారని సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్‌రావు అనుచరులు దాడికి పాల్పడ్డారు. కత్తి, క్రికెట్ బ్యాట్‌తో దాడిచేశారు. పీఎస్‌ ఎదురుగానే పట్టపగలు తమపై హత్యాయత్నం చేశారని నటి వాపోయారు.

  • ఓటీటీలోకి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

    హీరోయిన్ శ్రద్ధాశ్రీనాథ్ ప్రధానపాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కలియుగం 2064’. మే 9న థియేటర్లలో విడుదలై ఈ చిత్రం ఊహించినంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రమోద్ సుందర్ తెరకెక్కించిన ఈ మూవీ తమిళ వెర్షన్ సంస్థ సింప్లీసౌత్ యాప్‌లో జూన్ 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటన విడుదలైంది. అయితే తెలుగు వెర్షన్‌పై మాత్రం క్లారిటీ రావాల్సివుంది.

  • బ్లాక్ డ్రెస్‌లో మెరిసిన మృణాల్!

    హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా సోషల్ మీడియాలో తన బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఆకట్టుకుంటోంది. ఈ ఫొటో వైరల్ అవుతోంది.