పాన్‌ఇండియా స్టార్ ప్రభాస్-మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సినీవర్గాల్లో ఆసక్తిరేపుతోంది. తాజాగా ఈమూవీ ఆడియో రైట్స్ రూ.20 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. టీ సిరీస్ సంస్థ ఈ భారీ మొత్తానికి దక్కించుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక్క పాట కూడా రాలేదు. అయినా, అప్పుడే ఈ రేంజ్‌లో ఆడియో రైట్స్ అమ్ముడుకావడం విశేషం.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
మరోసారి తల్లైన హీరోయిన్ ఇలియానా?
బాలీవుడ్ బ్యూటీ ఇలియానా రెండోసారి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. రెండోసారి తల్లి అయినట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా హింట్ ఇచ్చింది. ఫాదర్స్ డే సందర్భంగా భర్త డోలన్, రోజుల బిడ్డతో ఉన్న ఫొటోను షేర్ చేయడంతో కొందరు షాక్ అవుతుంటే.. మరికొందరు కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే ఇలియానా స్పందిస్తే కానీ ఈ విషయంపై క్లారిటీ రాదు.
-
గర్ల్‌ఫ్రెండ్‌తో సాంగ్.. జయం రవి స్పెషల్ వీడియో!
నటుడు జయం రవి, సింగర్ కెన్నీషా రిలేషన్‌పై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా సింగర్ కెన్నీషా ఓ మ్యూజిక్ ఆల్బమ్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ పాటలో జయం రవి అతిథి పాత్రలో కనిపించాడు. అంతేకాకుండా రవి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కెనీషాకు అభినందనలు తెలిపారు. దీంతో వీరిద్దరి రిలేషన్ రూమర్స్ మరోసారి కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
-
నా మాటలు నమ్మి సినిమాకు వెళ్లకండి: హీరో సిద్ధార్థ్
హీరో సిద్ధార్థ్ జూలై 4న ‘3బిహెచ్‌కే’ మూవీతో రాబోతున్నాడు. ఈనేపథ్యంలో తాజాగా సిద్ధార్థ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘ప్రేక్షకులు ఇంటర్వ్యూలను చూసి భారీ అంచనాలో థియేటర్స్‌కు వెళ్తున్నారు. వారి అంచనాలకు అనుగుణంగా మూవీ ఉండకపోతే తిడుతున్నారు. అలా చేయడం తప్పు. మీకు నిజంగా 3BHK పోస్టర్, మ్యూజిక్, ట్రైలర్ నచ్చితేనే వెళ్లి సినిమా చూడండి. నా మాటలు నమ్మి వెళ్లకండి’’ అని చెప్పుకొచ్చాడు.
-
మరో పది రోజుల్లో ‘కన్నప్ప’ వస్తున్నాడు!
మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జూన్ 27న ఈ సినిమా విడుదలకానుంది. ఈనేపథ్యంలో మేకర్స్ కౌంటు డౌన్ పోస్టర్ వదిలారు.
-
ఓటీటీలోకి థ్రిల్లర్ వెబ్‌సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ‘విరాటపాలెం’. అభిజ్ఞ, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఓటీటీ ‘జీ 5’లో ఈ నెల 27 నుంచి కానుంది. పీరియాడికల్ వెబ్‌సిరీస్ ఇది. 1980ల నాటి విరాటపాలెం గ్రామం నేపథ్యంతో రూపొందింది.
-
ధనుష్ విషయంలో టెన్షన్ పడేవాడిని: శేఖర్ కమ్ముల
నటుడు ధనుష్ దర్శకుడు కూడా కావడంతో ఒకవేళ మరో టేక్ తీసుకోవాల్సి వచ్చినా, మరేదైనా సూచన చేసినా ఆయన ఏమంటారోనన్న టెన్షన్ షూటింగ్‌కు ముందు ఉండేదని డైరెక్టర్ శేఖర్ కమ్ముల అన్నారు. కానీ, సింగిల్ టేక్‌లోనే ధనుష్ పూర్తి చేశారని తెలిపారు. ధనుష్ మల్టీటాలెంటెడ్ అని కొనియాడారు. ‘కుబేర’ ప్రమోషన్స్‌లో నాగార్జునతో కలిసి పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో శేఖర్ ఈ విషయాలు పంచుకున్నారు.
-
నితిన్ ‘తమ్ముడు’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీలోని ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడీ’ అంటూ చిన్నారితో కలిసి నితిన్ సందడి చేశాడు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, అక్షిత ఆలపించగా.. అజనీష్ లోకనాథ్ స్వరాలు సమకూర్చారు.
-
‘RT76’.. టైటిల్, ఫస్ట్ లుక్‌పై అప్‌డేట్!
కిషోర్ తిరుమల-రవితేజ కాంబోలో ‘RT76’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కునుంది. తాజాగా ఈసినిమా షూటింగ్ అప్‌డేట్‌తో పాటు, టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌పై అప్‌డేట్ ఇచ్చారు. ఈ మేరకు ‘టాకీ పార్ట్ చిత్రీకరణతో RT76 సెట్స్ పైకి దూసుకుపోతోంది. టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తాము’ అని మేకర్స్ తెలిపారు.
-
‘Mega157’ షూటింగ్‌పై బిగ్ అప్‌డేట్!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘మెగా-157’. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి తాజాగా క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో జరుగుతుందని తెలుస్తుండగా.. ఈ షెడ్యూల్ షూటింగ్‌లో నయనతార జాయిన్ అయిందట. చిరు, నయన్‌పై ఓ సాంగ్ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.