Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘Mega157’ షూటింగ్‌పై బిగ్ అప్‌డేట్!

    అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘మెగా-157’. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి తాజాగా క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో జరుగుతుందని తెలుస్తుండగా.. ఈ షెడ్యూల్ షూటింగ్‌లో నయనతార జాయిన్ అయిందట. చిరు, నయన్‌పై ఓ సాంగ్ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

  • ‘ఓ భామ అయ్యో రామ’ రిలీజ్ డేట్ ఫిక్స్

    సుహాస్-మాళవిక మనోజ్‌ జంటగా రామ్‌ గోదల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. ఈ సినిమాను జులై 11న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.

  • ఫొటోగ్రాఫర్లపై హీరోయిన్ సమంత ఆగ్రహం

    హీరోయిన్‌ సమంత తాజాగా ఫొటోగ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేశారు. ముంబైలోని ఓ జిమ్‌ నుంచి ఆమె బయటకు రాగానే వారంతా ఫొటోలు, వీడియోలు తీస్తూ కనిపించారు. దీంతో సామ్‌ ‘స్టాప్‌ ఇట్‌ గాయ్స్‌’ అని ఆగ్రహిస్తూ కారు ఎక్కి వెళ్లిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

  • నెక్ట్స్ మూవీ గురించి చెప్పిన మంచు విష్ణు!

    మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు . జూన్‌ 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు తన మనసులో ఉన్న మరో కథను కూడా బయటపెట్టారు. 1947 నేపథ్యంలో సాగే పీరియాడిక్‌ సినిమా చేయాలని తనకు ఎప్పటినుంచో ఆలోచన ఉందన్నారు. ఆ ఆలోచనను నిజం చేయడం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

  • వాట్స‌ప్ కూడా వాడ‌ని స్టార్ డైరెక్ట‌ర్

    ఈ జనరేషన్‌లో ప్రతీ ఒక్కరు  తెల్లారింది మొద‌లు రాత్రి ప‌డుకునే వ‌ర‌కు వాట్స‌ప్‌లో మునిగి తేలుతూనే ఉంటారు. కాని టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ వాట్స‌ప్ అనేదే వాడ‌రట‌. మ‌రి ఈ రోజుల్లో వాట్స‌ప్ వాడ‌కుండా ఉన్న ఆ డైరెక్ట‌ర్ మ‌రెవ‌రో కాదు సెన్సిబుల్ చిత్రాల ద‌ర్శకుడు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఈ జనరేషన్‌లో వాట్సాప్ వినియోగించకుండా ఉండడం అన్నది నిజంగా చాలాగ్రేట్ అంటూ కొనియాడుతున్నారు.

  • ట్రెడిషనల్ లుక్‌లో పూజా హెగ్డే

    హీరోయిన్ పూజా హెగ్డే తాజా తన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ పిక్‌లో ఆమె మెరున్ కలర్ చీరలో ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తోంది.

  • దూసుకుపోతున్న ‘కుబేర’ ట్రైలర్

    నాగార్జున, ధనుష్‌, రష్మిక ప్రధాన పాత్రల్లో దర్శకుడు శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన పాన్‌ ఇండియా మూవీ ‘కుబేర’. ఈ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ఈ నెల 20న విడుదల కానుంది. కాగా ఆదివారం రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌కు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకూ ఈ ట్రైలర్‌కు 20 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు.

  • ‘ఢీ’ సీక్వెల్‌.. మంచు విష్ణు ఏమన్నారంటే!

    హీరో మంచు విష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన హిట్‌ సినిమా ‘ఢీ’ సీక్వెల్‌ గురించి మాట్లాడారు. ‘‘శ్రీను వైట్ల, నేను కలిసి సీక్వెల్‌ కోసం ప్రయత్నిస్తున్నాం. ఏదో ఒకరోజు దర్శకుడు దాని సీక్వెల్‌ స్క్రిప్ట్‌తో నన్ను కలవాలని కోరుకుంటున్నాను. అదంతా రచయిత చేతుల్లోనే ఉంటుంది. స్క్రిప్ట్‌ సిద్ధమైన మరుసటి రోజే దాని షూటింగ్‌ను ప్రారంభిస్తాను’’ అని విష్ణు తెలిపారు.

     

  • ‘ఫిదా’, ‘ఉప్పెన’ ఆ హీరోలతో చేయాలనుకున్నారట.. కానీ!

    టాలీవుడ్‌లో ‘ఫిదా’, ‘ఉప్పెన’ చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో వరుణ్ తేజ్, వైష్ణవ్‌ తేజ్‌ హీరోలుగా నటించారు. అయితే ఈ కథలకు ముందుగా వేరే హీరోల అనుకున్నారట. ‘ఫిదా’ మహేశ్‌ బాబు, ‘ఉప్పెన’ విజయ్‌ దేవరకొండతో తీయాలనుకున్నారట. అయితే ఆ సమయంలో ఈ ఇద్దరు హీరోలు వేరే మూవీస్‌తో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టులు చేయలేకపోయారు.

  • ‘పుష్ప’లో మహేశ్‌బాబు.. వీడియో వైరల్‌

    ఏఐ సాయంతో సృష్టించిన పలు వీడియోలు తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో ‘పుష్ప’ సినిమాలో మహేశ్‌బాబు నటిస్తే ఇలా ఉండేది.. అంటూ ఓ వీడియోను క్రియేట్ చేశారు. ‘పుష్ప’ మూవీలోని పలు సన్నివేశాలను మహేశ్‌బాబు రూపంతో ఏఐ వీడియోను క్రియేట్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. పుష్పరాజ్‌గా మహేశ్‌ను చూస్తూ అభిమానులు తెగ సంబర పడుతున్నారు.