Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • పూరి జగన్నాథ్‌ చిత్రంలో మరో నటి.. ఫొటో షేర్‌ చేసిన టీమ్‌

    విజయ్‌ సేతుపతి హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో నటి సంయుక్త జాయిన్‌ అయినట్లు తెలుపుతూ టీమ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టింది. ఇప్పటికే ఈ సినిమాలో సీనియర్‌ నటి టబు భాగమైన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రానికి ‘బెగ్గర్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు మొన్నటివరకూ వార్తలు వచ్చాయి. తాజాగా ‘భిక్షాందేహి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

  • హర్భజన్‌, సోనూసూద్‌ను ప్రశ్నించిన ఈడీ

    సినీ, క్రికెట్ ప్రముఖులను కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ విచారించినట్లు తెలుస్తోంది. నిషేధిత బెట్టింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల ప్రమోషన్లకు సంబంధించిన కేసులో నటులు సోనుసూద్, ఊర్వశీ రౌతెలాతో పాటు మాజీ క్రికెటర్లు హర్భజన్‌ సింగ్, యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనాలను ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. ఈ ప్లాట్‌ఫామ్‌లకు పలువురు క్రికెటర్లు, బాలీవుడ్‌ తారలు ప్రచార ఒప్పందాలు చేసుకున్నట్లు కథనాలు వచ్చాయి.

  • కష్టమే.. కానీ అసాధ్యం కాదు: వర్కింగ్‌ అవర్స్‌పై జెనీలియా స్పందన

    ఇటీవల కాలంలో పని గంటలపై విపరీతంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అది చిత్ర పరిశ్రమకూ వ్యాపించింది. పని గంటల కారణంగానే ‘స్పిరిట్’ నుంచి దీపిక పదుకొణె వైదొలగారని వార్తలు వచ్చాయి. తాజాగా సినీ నటి జెనీలియా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రోజుకు 10 గంటలు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కొందరు దర్శకులు 12 గంటలు చేయమని తనను అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయని జెనీలియా తెలిపారు.

     

     

  • హాలీవుడ్‌ సినిమాలో నటిస్తానంటే నవ్వేవారు:ధనుష్‌

    ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు నటుడు ధనుష్‌ . సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హాలీవుడ్‌ హీరోల ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన ప్రధానపాత్రలో నటించిన ‘కుబేర’ జూన్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ధనుష్‌ మ్యాష్అప్‌ వీడియోను ప్రదర్శించారు. తాను హాలీవుడ్‌ సినిమాలో నటిస్తానని చెబితే ప్రజలు నవ్వేవారని ధనుష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

     

  • వింటేజ్‌ ప్రభాస్‌ను చూస్తున్నామంటున్న ఫ్యాన్స్‌!

    “రాజాసాబ్‌” మూవీ టీజర్‌ చూస్తే వింటేజ్‌ ప్రభాస్‌ గుర్తుకు వస్తున్నాడని ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో  పోస్టులు పెడుతున్నారు. “బాహుబలి” సినిమా తర్వాత ప్రభాస్‌ చేసిన సినిమాల్లో కొత్తదనం ఉన్నా వింటేజ్‌ ప్రభాస్‌ను మిస్‌ అయ్యామని, ఆ వెలితిని “రాజాసాబ్‌” టీజర్‌ పూరించినట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ హారర్‌-కామెడీ ఎంటర్‌టైనర్‌లో ఆయన చెప్పిన డైలాగ్స్‌ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి.

  • సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రేమకథపై సినిమా

    బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, రియాల ప్రేమకథను తెరకెక్కించనున్నట్లు దర్శకుడు రూమి జాఫరీ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్నట్లు వెల్లడించారు.

  • రష్మిక మ్యాష్‌అప్‌ వీడియో చూశారా!

    నేషనల్‌ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలతో అలరిస్తున్నారు రష్మిక. ‘కుబేర’తో జూన్‌ 20 నుంచి సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆమె మ్యాష్‌అప్‌ వీడియో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఆమెపై ఇండస్ట్రీలో అగ్ర హీరోలు ప్రశంసలు కురిపించడం చూపించారు. అలాగే తాను కెరీర్‌ ప్రారంభంలో ఓ ఆడిషన్‌ ఇస్తే రిజెక్ట్‌ చేశారంటూ రష్మిక ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న వీడియోను ప్లే చేశారు.

  • ‘హనుమాన్ జంక్షన్’ రీరిలీజ్.. ఎప్పుడంటే?

    అర్జున్, జగపతి బాబు, వేణు ప్రధాన పాత్రల్లో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘హనుమాన్ జంక్షన్’. ఈ సినిమా జూన్ 28న రీరిలీజ్ కానున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది.

  • టాలీవుడ్ నటి ఇంట్లో తీవ్ర విషాదం

    టాలీవుడ్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్‌ మన్నారా చోప్రా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి రమణ్ రాయ్ హండా తుదిశ్వాస విడిచారు. ఆయన 72 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషాద వార్తను నటి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆయన ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు.

  • కన్నప్ప చిత్రానికి కొత్త చిక్కులు?

    మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన కన్నప్ప చిత్రానికి కొత్త చిక్కులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్లపై ఇటీవల బ్రాహ్మణ చైతన్య వేదిక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో మూవీ చూసిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని సెన్సార్ బోర్డు తెలిపింది. తాజాగా చిత్రాన్ని చూసిన బోర్డు సభ్యులు 13 సన్నివేశాలపై అభ్యంతరాలు చెప్పినట్లు తెలుస్తోంది.కాగా ఈ మూవీ ఈనెల 27న రిలీజ్ కానుంది.