Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • నా సోదరుడి మృతికి కారణమిదే: రాహుల్‌ దేవ్‌

    సినీ నటుడు ముకుల్‌ దేవ్‌ మృతి వెనుక అసలు కారణాన్ని అతడి సోదరుడు రాహుల్‌ దేవ్‌ వెల్లడించారు. అందరూ అనుకుంటున్నట్లు ముకుల్‌ డిప్రెషన్‌తో చనిపోలేదని, గత కొన్నేళ్లుగా సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడమే మరణానికి దారితీసిందన్నారు. 2019లో తన తండ్రి మరణం, ఆ తర్వాత తల్లి మరణం, భార్యతో విడాకులు అతడిని మరింత కుంగదీసినట్లు రాహుల్‌ తెలిపారు.

  • VIDEO: ‘రాజా సాబ్’ భారీ హారర్ సెట్

    ప్రభాస్ కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’. ఇవాళ టీజర్‌ను విడుదల చేయగా, డిసెంబర్ 5న సినిమా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా రాజాసాబ్ సెట్‌ వీడియోను మేకర్స్ షేర్ చేశారు. 41,256 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ ఈ రికార్డ్ స్థాయి హవేలీ సెట్‌ను రూపొందించారు.

  • VIDEO: రానా నాయుడులోకి కట్టప్ప వస్తే.. !

    రానా నాయుడు సీజన్ 2లో రానా దగ్గుబాటి, సత్యరాజ్ (కట్టప్ప) అనూహ్య క్రాస్‌ఓవర్‌తో ఆకట్టుకుంటున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌లో రానా కొత్త ప్రత్యర్థి రౌఫ్ (అర్జున్ రాంపాల్)తో పోరాడుతాడు. ఈ హిలేరియస్ కలయిక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • ‘కుబేర’ నిర్మాణంలో పింగళి వెంకయ్య వారసురాలు

    శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. ఈ మూవీ కథానిర్మాణంలో కీలక పాత్రధారిగా చైతన్య పింగళి వ్యవహరించారు. ఆమె మన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మునిమనవరాలు. తెలుగు కథా రచనలో ప్రస్తుత తరంలో ఆమె ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

  • కన్నప్ప వీక్షించిన రజనీకాంత్‌.. విష్ణు పోస్ట్‌

    అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌‌తో కలిసి కన్నప్ప చిత్రాన్ని వీక్షించామని విష్ణు పోస్ట్ చేశారు. రజనీకాంత్‌తో దిగిన ఫొటోలు పంచుకున్నారు.

  • GenZకి నాగార్జున సలహా ఇదే!

    కుబేర సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నటుడు నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాంకర్ సుమ GenZకి ఏమైన సలహా ఇవ్వాలని కోరారు. నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ఫోన్ ని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దాన్నే చూస్తా ఉంటే ఎక్కడ డబ్బు సంపాదించడానికి టైం ఎక్కడ ఉంది’’ అని అన్నారు. ‘‘కరెక్ట్.. పనికవచ్చేటువంటి పనులు చేయండి అని చెప్పకనే చెప్పేశారు’’ అని సుమ అన్నారు.

  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా, మీనా

    AP: తిరుమల శ్రీవారిని రోజా, మీనా, ఇంద్రజ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం తెల్లవారు జామున వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

     

  • స్పెషల్‌ OPS 2 స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

    కేకే మేనన్‌, కరణ్‌ థాకర్‌, వినయ్‌ పాఠక్‌, విపుల్‌ గుప్త కీలక పాత్రల్లో నటించిన సిరీస్‌ ‘స్పెషల్‌ ఓపీఎస్‌2’. ఈ స్పైయాక్షన్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. జియో హాట్‌స్టార్‌ వేదికగా జులై 11 నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఓటీటీ వేదిక ప్రకటించింది. కాగా, ఈ సిరీస్ మొదటి సీజన్‌ భారీ హిట్ అయింది.

  • నిర్మాతలు వదిలేసినా.. ప్రభాస్‌ నాతో నిలబడ్డారు: మారుతి

    ‘రాజాసాబ్‌’ సినిమాపై డైరెక్టర్‌ మారుతి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేశారు. “గోపీచంద్‌తో సినిమా తీసే సమయంలో రాజాసాబ్‌కు ప్రభాస్‌ ఓకే చెప్పారు. ‘పక్కా కమర్షియల్‌’ సినిమా ఫ్లాప్‌ అవడంతో నిర్మాతలు వెనకాడినా… ప్రభాస్‌ మాత్రం నాతో నిలబడ్డారు’’ అని మారుతి చెప్పుకొచ్చారు. కాగా, ‘రాజాసాబ్‌’ మూవీ Dec 5 న రిలీజ్ కానుంది.

  • రాజాసాబ్‌ పార్ట్‌ 2పై మారుతి క్లారిటీ

    ప్రభాస్‌ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ది రాజాసాబ్‌’. ఈ మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో మారుతి ‘రాజాసాబ్‌ పార్ట్‌ 2’పై క్లారిటీ ఇచ్చారు. ‘‘పార్ట్‌ 2 కోసం బలవంతంగా కథను సాగదీసి రుద్దను. కంగారుపడొద్దు. ఆ క్లారిటీ మాకు ఉంది’’ అని అన్నారు. కాగా, ‘ది రాజాసాబ్‌’ మూవీ డిసెంబర్‌ 5న రిలీజ్ కానుంది.