ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీకి టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ టీజర్‌లో డార్లింగ్ లుక్ అదిరిపోయిందని ప్రభాస్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. చాలా రోజుల తర్వాత ఆయనలోని
కామెడీ యాంగిల్‌ను చూపించే సినిమా ఇదని, విజయం పక్కా అంటూ సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. టీజర్ తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయంటున్నారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘రాజాసాబ్’ టీజర్‌పై ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
-
ప్రభాస్ పక్కన అందుకే ముగ్గురు హీరోయిన్స్‌ని పెట్టా : మారుతి
‘ది రాజా సాబ్’ మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో దర్శకుడు మారుతి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ‘‘ హీరోయిన్స్ లేక డ్రైగా ఉన్న ప్రభాస్ లైఫ్‌లో ముగ్గురు హీరోయిన్స్‌ని తీసుకువచ్చాం ’’అని చెప్పారు. కాగా, ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ రిద్ధికుమార్ నటించారు. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
-
‘ది రాజాసాబ్’ టీజర్.. SKN కీలక వ్యాఖ్యలు
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో నిర్మాత SKN కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ సినిమా మొదలైనప్పుడు ఒక నిర్మాత నెగెటివ్ క్యాంపెయిన్ చేశారు. రేపటి రోజున ఆయనే పాజిటివ్ ట్రెండ్ చేస్తారు’’ అని వ్యాఖ్యానించారు.
-
డబ్బు ఎంత సంపాదిస్తే అన్ని సమస్యలు: ధనుష్
‘కుబేర’ మూవీ ట్రైలర్ ఈవెంట్‌లో హీరో ధనుష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘హోదాకు అడ్డు లేదు. అందరూ డబ్బుతో ఇబ్బంది పడుతున్నారు. మీరు రూ.150 సంపాదిస్తే… మీకు రూ.200ల విలువైన
సమస్యలుంటాయి. రూ.కోటి సంపాదిస్తే… రూ.2 కోట్ల సమస్యలుంటాయి. ఇది ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్’ అని తెలిపారు. -
డైరెక్ట్‌గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ న్యూ మూవీ
కీర్తి సురేశ్, సుహాస్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘ఉప్పు కప్పురంబు’. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా జులై 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
-
ప్రభాస్ ‘రాజాసాబ్’ టీజర్ అదిరిపోయింది
ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపించి ఆకట్టుకుంటున్నారు. హారర్ ఎలివేషన్స్, ఫన్నీ డైలాగులతో టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్, సంజయ్‌దత్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
-
నాగ చైతన్య మూవీ కొత్త షెడ్యూల్.. ఎప్పుడంటే?
కార్తీక్ వర్మ డైరెక్షన్‌లో నాగ చైతన్య-మీనాక్షి చౌదరి జంటగా నటిస్తోన్న మైథలాజికల్ థ్రిల్లర్ సినిమా(NC24) షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల HYDలో భారీ షెడ్యూల్ పూర్తవగా ఈ నెలాఖరున మూవీ టీమ్ గుజరాత్‌కు వెళ్లనుందని సమాచారం. కొత్త షెడ్యూల్‌లో హీరోతోపాటు ప్రధాన నటీనటులతో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి “వృష కర్మ’ టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
-
‘రాజాసాబ్’ డైరెక్టర్ మారుతీ ఎమోషనల్
‘రాజాసాబ్’ మూవీ టీజర్ రిలీజ్ కానున్ననేపథ్యంలో దర్శకుడు మారుతి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘‘ ఒకప్పుడు మా నాన్నకు మచిలీపట్నం సిరి కాంప్లెక్స్ వద్ద చిన్న అరటిపండ్ల స్టాల్ ఉండేది. అక్కడే నేను ఆ థియేటర్లో రిలీజయ్యే సినిమాలకు బ్యానర్లు రాసేవాడిని. ఒక్కసారైనా నా పేరు ఇక్కడ చూడాలి అనుకునే వాడిని. ఇప్పుడు ప్రభాస్ పక్కన నా కటౌట్‌పెట్టారు. నాన్న ఉంటే గర్వపడేవారు’’అని ట్వీట్ చేశారు.
-
పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని ఉంది: ధనుష్
కుబేర సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తమిళ స్టార్ హీరో ధనుష్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తెలుగులో నాకు డైరెక్షన్ చేసే అవకాశం వస్తే, పవన్ కళ్యాణ్ సార్‌ను డైరెక్ట్ చేయాలనుంది అని చెప్పాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర సినిమాలో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది.
-
‘క్రిష్ 4’లో నటించడంపై క్లారిటీ ఇచ్చిన కొరియన్ సింగర్
హృతిక్ రోషన్ ‘క్రిష్’ సిరీస్ చిత్రాలన్నీ మంచి విజయం సాధించాయి. ఈ ఫ్రాంచైజీలోనే ‘క్రిష్ 4’ రానుంది. దీనికి హృతిక్ రోషన్ దర్శకత్వం వహించనున్నారు. అయితే, కొరియన్ ర్యాప్ సింగర్ జాక్సన్ వాంగ్… క్రిష్ 4లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై దీనిపై జాక్సన్ క్లారిటీ ఇచ్చాడు. క్రిష్ 4లో తాను నటించడం లేదని.. అవి కేవలం రూమర్స్ అని వెల్లడించారు.