‘#90s బయోపిక్’, ‘దిల్ సే’ వంటి వెబ్‌సిరీస్‌లను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్’ (ETV Win) మరో సిరీస్‌ని విడుదలకు చేసేందుకు సిద్ధమైంది. అదే ‘ఏఐఆర్’ (ఆల్ ఇండియా ర్యాంకర్స్). ‘ఇక యుద్ధం మొదలుపెడదామా? ఇది ఇంటర్ స్టూడెంట్స్ స్టోరీ’ అంటూ స్ట్రీమింగ్ డేట్ వివరాలు వెల్లడించింది సదరు సంస్థ. జులై 3నుంచి సిరీస్ స్ట్రీమింగ్ కానుందని తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేసింది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
సరస్వతీ దేవి తల ఎత్తుకుని చూసే సినిమా: శేఖర్ కమ్ముల
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘కుబేర’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ‘‘నా దృష్టిలో ‘కుబేర’ సినిమా నాకు తల్లిలాంటిది. సరస్వతీ దేవి తలవంచుకోకుండా ఉంటే చాలు అని నా గత సినిమాల విషయంలో చెప్పేవాడిని. కానీ, ఈ సినిమాని సరస్వతి తల ఎత్తుకుని చూస్తుంది. ఇది గర్వంతో చెబుతున్న మాట కాదు’’ అని తెలిపారు.
-
నాగార్జునతో కలిసి నటించడం ఆనందంగా ఉంది: ధనుష్
దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘కుబేర’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ధనుష్ మాట్లాడారు. ‘‘ఈ సినిమా కోసం శేఖర్ సర్ చాలా కష్టపడ్డారు. ‘కుబేర’ తెలుగులో రెండో చిత్రం. ‘సార్’ మూవీ కంటే ముందే నాకు శేఖర్ ఈ కథ చెప్పారు. నాగార్జున సర్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది’’ అని ధనుష్ పేర్కొన్నారు.
-
మేం పాత్రధారులం మాత్రమే: నాగార్జున
దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘కుబేర’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. ‘‘ధనుష్‌తో కలిసి నటించినందుకు హ్యాపీగా ఉంది. ఇది కేవలం శేఖర్ కమ్ముల ఫిల్మ్. మేం పాత్రధారులం మాత్రమే. శేఖర్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా ఇది. మమ్మల్ని కూడా మా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాడని’’ ప్రశంసించారు.
-
‘కుబేర’ ట్రైలర్ విడుదల
నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘కుబేర’. ఈ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ఈ నెల 20న బాక్సాఫీసు ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా ట్రైలర్‌ని చిత్ర బృందం ఆదివారం రిలీజ్ చేసింది.
-
విజయ్ దేవరకొండవి అన్నీ తీసుకుంటా: రష్మిక
కుబేర ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతోంది. ఏ యాక్టర్ నుంచి ఏ క్వాలిటీ తీసుకుంటారని యాంకర్ సుమ అడిగిన కొన్ని ప్రశ్నలకు హీరోయిన్ రష్మిక ఇచ్చిన సమాధానాలు వైరలవుతున్నాయి. నాగార్జున-అందం, ధనుష్-ఎండలో పనిచేయడం, అల్లు అర్జున్-స్వాగ్ అని చెప్పింది. మరి, విజయ్ దేవరకొండ గురించి అడగగా.. అన్నీ తీసుకుంటాను అని చెప్పడంతో ఫ్యాన్స్ గొల చేశారు.
-
పుష్ప-2 రికార్డును బ్రేక్ చేసిన అఖండ-2!
బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబినేషన్లో రూపొందుతోన్న అఖండ-2. ఈ మధ్యే రిలీజైన టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. యూట్యూబ్లో అత్యధిక గంటలపాటు ట్రెండ్ అయిన తెలుగు టీజర్‌గా నిలిచినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో పుష్ప-2 138+ గంటలు ట్రెండవగా అఖండ-2 140+ గంటలతో రికార్డు బ్రేక్ చేసినట్లు పేర్కొంటున్నాయి.
-
‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ మైండ్ బ్లోయింగ్: SS రాజమౌళి
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘కుబేర’. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు రాజమౌళి మాట్లాడారు. శేఖర్ కమ్ముల.. నాగార్జున.. ‘కుబేర’ అనే టైటిల్ ప్రకటించగానే, అద్భుతం అనిపించింది. ధనుష్ వచ్చాక వావ్ సూపర్ కాంబినేషన్ అనుకున్నా. ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చూసి మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అటు ధనవంతుల ప్రపంచంలో నాగార్జున.. ఇటు పేదల ప్రపంచంలో ధనుష్ చూపిస్తూ కథ ఆసక్తిగాఉందని’’ తెలిపాడు.
-
స్టేజిపై డ్యాన్స్ చేసి అదరగొట్టిన ధనుష్
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక, నాగార్జున కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డ్యాన్సర్స్‌తో కలిసి ధనుష్ స్టేజిపై డ్యాన్స్ చేసి అలరించారు.
-
సీఎం మాటలకు రాహుల్ సిప్లిగంజ్ ఎమోషనల్
TG: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకల్లో CM రేవంత్ రెడ్డి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తావించడంపై రాహుల్ ఎమోషనల్ అయ్యారు. ‘HYD గల్లీల్లో పెరిగిన ఒక ఆర్టిస్టును గుర్తించి మరోసారి CM రేవంత్ ఆయన గొప్పతనాన్ని చాటుకున్నారు. అంత గొప్ప స్టేజ్ మీద రేవంత్ అన్న నా గురించి మాట్లాడటంతో భావోద్వేగానికి లోనయ్యాను. మీ మాటలకు భట్టి విక్రమార్క గారు స్పందించిన తీరు మరెంతో ఆనందాన్ని ఇచ్చింది’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.