విజయ్ సేతుపతి, త్రిష కాంబోలో వచ్చిన ’96’. ఈ చిత్రం డీసెంట్ లవ్ హిట్‌గా నిలిచింది. చాలా మంది ఫ్యాన్స్ ఈ మూవీ సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తాజాగా స్క్రిప్ట్ వర్క్ పూర్తైందని ఓ ఇంటర్వ్యూలో సింగర్ చిన్మయి కాల్ చేయగా డైరెక్టర్ ఈ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఓ థ్రిల్లర్ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నట్లు తెలిపాడు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
The RajaSaab: ఆకట్టుకుంటున్న ప్రభాస్ పోస్టర్
రేపు ఉదయం 10.52 గంటలకు మారుతి, ప్రభాస్ కాంబో మూవీ ‘రాజాసాబ్’ టీజర్ విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం వదిలిన పోస్టర్‌లోని ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది.
-
త్వరలో APలోనూ సినీ అవార్డులు: దిల్ రాజు
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డ్స్ కార్య క్రమం విజయవంతమైందని ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు. అవార్డులను ప్రదానం చేసినందుకు సీఎం రేవంత్, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలోనూ త్వరలో సినిమా అవార్డులు ఇవ్వడం ప్రారంభం అవుతుందన్నారు. ఇకపై ప్రభుత్వం తరఫున అవార్డుల వేడుక ప్రకటన వచ్చినప్పుడు.. మీ డైరీల్లో నోట్ చేసుకుని, అవార్డు తప్పకుండా స్వీకరించండి అని తెలిపారు.
-
‘కుబేర’ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా రాజమౌళి
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున నటించిన చిత్రం ‘కుబేర’. ఈ రోజు జరగనున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు.
-
‘థగ్ లైఫ్’ హిట్ సాంగ్ వీడియో సాంగ్ వచ్చేసింది.
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ సినిమా ‘థగ్ లైఫ్’.. జూన్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా అలరించలేదు. ఎ. ఆర్. రెహమాన్ అందించిన సంగీతం బాగుందన్నప్పటికీ సినిమా స్టోరీ పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. కాగా ఈ చిత్రం నుంచి సింగర్ చిన్మయి పాడిన ‘ముత్తా ముజై’ తమిళ్ వర్షన్ పాటని తెలుగులో కూడా రిలీజ్ చేశారు.
-
మహేశ్ బాబు పాత్రపై క్రేజీ గాసిప్
మహేశ్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో మహేశ్ క్యారెక్టర్‌పై ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఫస్ట్ హాఫ్‌లో నెగటివ్‌గా ఉన్న హీరో రోల్ సెకండ్ హాఫ్‌కు వచ్చేసరికి పాజిటివ్‌గా మారుతుందనేది దాని సారాంశం. అంతేకాదు ఈ చిత్రానికి హైలెట్ మహేశ్ క్యారెక్టరైజేషన్ అని టాక్ నడుస్తోంది. ఈ మూవీ ఒక భారీ జంగిల్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోంది.
-
మహారాష్ట్ర గాయని బయోపిక్‌లో శ్రద్ధ?
మహారాష్ట్ర గాయని, నృత్యకారిణి విఠాబాయి నారాయణ్ గావ్‌కర్ జీవితం ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది.
-
ఆకట్టుకునేలా ‘8 వసంతాలు’ మూవీ ట్రైలర్
అనంతిక ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘8 వసంతాలు’. ఈ చిత్రానికి ఫణింద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ట్రైలర్ విడుదల చేసింది. ఈ ట్రైలర్‌లో ‘మగాడి ప్రేమకు సాక్ష్యాలుగా పాలరాతి సౌధాలు, భాగ్యనగరాలు ఉన్నాయి. ఆడదాని ప్రేమకు ఏముంది. మనసులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప’ వంటి సంభాషణలు మనసుని హత్తుకునేలా ఉన్నాయి.
-
‘రాజాసాబ్’ టీజర్‌పై అప్టేట్.. స్పెషల్ వీడియో
ప్రభాస్, మారుతీ కాంబోలో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ మూవీ టీజర్ రేపు ఉదయం 10.52గం.లకు రిలీజ్ కానుంది. తాజాగా టీజర్‌పై హైప్ పెంచుతూ ‘ది వెయిట్ ఈజ్ ఓవర్.. లోడింగ్ అంటూ ఓ స్పెషల్ వీడియోను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. దీంతో పాటు హీరోయిన్లు మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధీ కుమార్‌ల పోస్టర్‌ను పంచుకుంది.