Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ప్రభాస్ ‘రాజాసాబ్’ వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే?

    పాన్ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘ది రాజాసాబ్’. దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈమూవీ డిసెంబర్ 5న సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు. నిజానికి ఏప్రిల్‌లో రావాల్సిన ఈ సినిమా అలా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ‘రాజా సాబ్’ న్యూ రిలీజ్ డేట్ ప్రకటించారు. 2026 జనవరి 9న ఈచిత్రం విడుదల కానున్నట్లు తెలిపారు.

  • వైర‌ల్‌ అవుతున్న నాగ్-చై వీడియో

    తన తండ్రి నాగార్జునను కారులో కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేశాడు హీరో అక్కినేని నాగ‌చైత‌న్య. హైదారాబాద్‌లో ఈ దృశ్యం కనిపించగా.. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. BMW M2 అనే కొత్త సిరీస్ కారును చైతూ డ్రైవింగ్ చేస్తుండ‌గా.. నాగార్జున పక్కన కూర్చున్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను మీరు చూసేయండి. (వీడియో)

     

  • మ‌ణిర‌త్నం సోద‌రుడి కేసు.. మరణించిన 22ఏళ్లకు కోర్టు తీర్పు

    దర్శకుడు మణిరత్నం సోదరుడు, తమిళ సినీ నిర్మాత జి. వెంకటేశ్వరన్ తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకు లోన్ తీసుకున్న కేసులో చెన్నై ప్రత్యేక కోర్టు తుది తీర్పు వెల్లడించింది. సుమారు 30 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ తీర్పులో వెంకటేశ్వరన్‌తో సహా తొమ్మిది మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. అయితే, 22 ఏళ్ల క్రితమే వెంకటేశ్వరన్ మరణించడంతో ఆయనపై ఉన్న అభియోగాలను కొట్టివేసింది.

  • నాకు సినిమా గురించి ఏం తెలియదు: మంచు మనోజ్

    కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా నటిస్తున్న సూపర్ యోధుడి మూవీ ‘మిరాయ్’. మంచు మనోజ్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. మనోజ్ మాట్లాడుతూ.. ‘‘అవకాశం ఇచ్చినందుకు టీమ్‌కు థాంక్స్‌. ఇందులో అవకాశం దేవుడిచ్చిన వరంగా భావిస్తా. ఎందుకంటే ఇలాంటి పాత్ర ఇప్పటివరకూ చేయలేదు. నాకు సినిమా గురించి కొంచెం తెలుసు అనుకున్నా. కార్తిక్‌‌ను కలిశాక ఏమీ తెలియదని అర్థమైంది’’ అని చెప్పుకొచ్చారు.

  • ‘మిరాయ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది

    యువ నటుడు తేజ సజ్జా న్యూ మూవీ ‘మిరాయ్‌’. కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మంచు మనోజ్‌ విలన్‌గా కనిపించనున్నారు. కతాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్‌లు ఏ స్థాయిలో ఉండనున్నాయో ట్రైలర్‌లో చూపారు. డ్రాగన్‌తో హీరో పోరాటం, ‘దునియాలో ఏదీ నీది కాదు..’ అంటూ వచ్చే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. సెప్టెంబర్‌ 12న ఈ సినిమా విడుదల కానుంది.

     

  • సింగర్‌తో దుబాయ్‌ యువరాణి రెండో పెళ్లి

    దుబాయ్‌ యువరాణి షేక్‌ మహ్రా మొహమ్మద్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌(31) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. సరిగ్గా ఏడాది క్రితం మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె ఇప్పుడు అమెరికన్ రాపర్ ‘ఫ్రెంచ్ మోంటానా’(41)తో నిశ్చితార్థం చేసుకుని వార్తల్లో నిలిచారు. ఈ సంవత్సరం జూన్‌లో పారిస్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా ఎంగేజ్‌మెంట్ జరిగిందని క్లారిటీ ఇచ్చారు.

  • మరో ఓటీటీలోకి నితిన్ రిసెంట్ మూవీ

    యువనటుడు నితిన్ నటించిన ‘రాబిన్ హుడ్’. ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. జీ5లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ సినిమా, ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో హిందీ వెర్షన్‌లో విడుదలైంది. నితిన్ డబ్బింగ్ సినిమాలకు ఉన్న ఆదరణ కారణంగా, ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో ఇండియా వైడ్‌గా టాప్ 4లో ట్రెండ్ అవుతోంది. ఈ ఏడాది నితిన్ నటించిన ‘తమ్ముడు’ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

  • దాడి కేసులో హీరోయిన్‌కు ముందస్తు బెయిల్‌

    మలయాళ నటి లక్ష్మీ మేనన్‌కు కోర్టులో ఊరట లభించింది. ఆమెను అరెస్ట్‌ను తాత్కాలికంగా ఆపేయాలంటూ కేరళ కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరుచేసింది. SMలో లక్ష్మీ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. కొచ్చిలోని ఐటీ ఉద్యోగిని తన స్నేహితులతో కలిసి కిడ్నాప్‌ చేయడమే కాకుండా అతడిపై దాడిచేశారని ఆరోపణలు వచ్చాయి. దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేయగా నటి  పరారీలో ఉన్నారని వార్తలు వచ్చాయి.

  • చిరంజీవి హిట్‌ సాంగ్‌ వెనుక కథ ఇదీ

    తెలుగు సినీ సాహిత్యాన్ని కొత్త పంథాలో నడిపించిన వారిలో వేటూరి సుందర రామ్మూర్తి  ఒకరు.  ‘చ్చా’ శబ్దం వచ్చేలా ఓ పాటను రాయాలని దర్శకుడు కోదండరామిరెడ్డి కోరగా.. ‘రాక్షసుడు’   సినిమాలోని ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాశారు. ఈ పాటలో దాదాపు 50 ‘చ’కారాలు ఉండటం గమనార్హం.   ఇక ఈ పాటలో  చిరంజీవి- రాధ జోడీ  డ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

     

  • బాలకృష్ణ ‘అఖండ 2’ వాయిదా!

    బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ‘అఖండ 2’. ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదల కావాల్సింది. తాజాగా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. వినాయక చవితికి సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ ఆలస్యానికి నందమూరి కుటుంబంలో చోటుచేసుకున్న విషాదం కూడా ఒక కారణమని తెలుస్తోంది. ‘అఖండ 2’ డిసెంబర్ 4 లేదా ఆ తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది.