Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • హైదరాబాద్‌కు హాలీవుడ్, బాలీవుడ్ రావాలి: సీఎం రేవంత్

    సినీ పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో.. ‘‘హాలీవుడ్‌ అంటే అమెరికా, బాలీవుడ్‌ అంటే ముంబై అంటారు. ఆ రెండింటినీ హైదరాబాద్‌కు తీసుకురావాలనేది మా ప్రభుత్వ ఆకాంక్ష. అందుకు సినీ పరిశ్రమకు అన్ని విషయాల్లో అండగా ఉంటాం. రైజింగ్‌ తెలంగాణ-2047 విజన్‌ డాక్యుమెంట్‌లో చిత్ర పరిశ్రమకూ ఒక చాప్టర్‌ పెడతాం’’ అని తెలిపారు.

  • మోహన్ లాల్‌ను ఆటపట్టించిన మోహన్ బాబు

    ‘కన్నప్ప’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మోహన్‌ బాబు హీరోగా తాను విలన్‌గా సినిమా చేయాలని ఉందంటూ నటుడు మోహన్‌ లాల్‌ తన మనసులో మాట బయటపెట్టారు. అయితే, మోహన్‌ బాబు మాత్రం తానే విలన్‌గా చేస్తానని వారించారు. అలా అయితే మొదటి స్రీన్‌లోనే గన్‌తో కాల్చేస్తానంటూ మోహన్‌ లాల్‌ ఆట పట్టించారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

  • ‘మార్కో పార్ట్‌-2’పై హీరో రియాక్షన్‌ ఇదే

    మలయాళ హీరో ఉన్ని ముకుందన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మార్కో’. ఈ  మూవీ బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ టాక్‌ సౌంతం చేసుకుంది. తాజాగా ఓ అభిమాని పార్ట్‌-2 ఎప్పుడు వస్తుందని హీరోని ఇస్టాగ్రామ్‌లో ప్రశ్నించారు. దీనికి ఉన్ని స్పందిస్తూ మార్కో సిరీస్‌ను కొనసాగించే ఆలోచనలు వదులుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుపై వచ్చిన నెగిటివిటీ దానికి కారణమన్నారు. బెస్ట్‌ సినిమాను అందించేందుకు ప్రయత్నిస్తానన్నారు.

     

  • చిన్న గొడవలకే విడాకులు: సల్మాన్ ఖాన్

    బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ విడాకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఒకప్పుడు భార్యభర్తల మధ్య ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం ఉండేవి. ఒకరి కోసం మరొకరు త్యాగం చేయడానికి వెనుకాడేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఓ చిన్న అపార్థం కూడా విడాకుల వరకూ దారి తీస్తోంది’ అని ఒక ప్రైవేట్ షోలో సల్మాన్ వ్యాఖ్యానించారు.

  • నాకు చాలా సంతోషంగా ఉంది: సీఎం రేవంత్

    తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 వేడుకలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘ఈ రోజు సినీ పరిశ్రమలో రాణిస్తూ నన్ను ఇక్కడ కలుస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది. బన్నీ కావొచ్చు.. నిర్మాత అశ్వినీదత్ గారి అమ్మాయిలు, వాళ్ల అల్లుడు వీళ్లందరూ యంగ్ ఏజ్‌లో, కాలేజ్ డేస్ నుంచి నాకు తెలుసు. వారందరినీ వేదికపై అభినందించడం చాలా సంతోషంగా ఉంది’ అని సీఎం తెలిపారు.

     

     

  • ఇండస్ట్రీని ప్రభుత్వం గౌరవిస్తుంది: సీఎం రేవంత్

    TG: టాలీవుడ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తుందని, ఏం కావాలన్నా ఇస్తామని గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ తెలిపారు. నంది అవార్డులని ప్రవేశపెట్టింది.. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అవార్డులు ఇస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. పైకి కఠినంగా కనిపిస్తాం కానీ, సినీ పరిశ్రమను ప్రభుత్వం గౌరవిస్తుందని స్పష్టం చేశారు. విధానపరంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు.

     

  • న‌యా లుక్‌లో శ‌ర్వానంద్‌!

    తెలంగాణ గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌ హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. విజేతలకు సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అవార్డులు ప్రదానం చేస్తున్నారు. అయితే 2014లో ఉత్త‌మ చిత్రంగా ‘‘ర‌న్ రాజా ర‌న్’’ మూవీ ఎంపికైంది. ఈ అవార్డును అందుకునే క్ర‌మంలో స్టేజీ మీద‌కు వ‌చ్చిన హీరో శ‌ర్వానంద్ లుక్ చూసి అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. శ‌ర్వా ఏంటీ ఇలా అయ్యాడు? అని కామెంట్స్ చేస్తున్నారు.

  • నాగచైతన్య-సమంత హిట్ మూవీ.. రీ-రిలీజ్

    అక్కినేని నాగచైతన్య-సమంత జంటగా నటించిన హిట్ సినిమా ‘ఏమాయచేసావే’. ఈమూవీని జూలై 18న థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

  • Viral Video: బన్నీని ఆటపట్టించిన బాలయ్య

    తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వేడుకలో నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ఆయన పక్కనే నటుడు అల్లు అర్జున్ కూడా కూర్చున్నారు. దీంతో ఆయన బన్నీని కాసేపు ఆటపట్టించారు. ‘కుర్చీ మడతపెట్టి పాట వస్తున్న సమయంలో పదా స్టెప్పులేద్దాం’ అన్నట్లు అర్జున్‌ను బాలయ్య పిలిచారు. దానికి బన్నీ సిగ్గుపడుతూ ‘నేను రాలేను’ సర్ అంటూ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

  • సీఎం రేవంత్ ప‌ర్మిష‌న్‌తో డైలాగ్ చెప్పిన బ‌న్నీ

    TG: ‘పుష్ప2’ సినిమాకి గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ గద్దర్ అవార్డు అందుకున్నారు. CM రేవంత్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు అల్లు అర్జున్‌. అనంత‌రం సీఎం రేవంత్ ప‌ర్మిష‌న్‌తో మూవీలోని ఓ డైలాగ్ చెప్పారు. అంతేకాకుండా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. CM రేవంత్ రెడ్డి అన్నగారికి, ఉప‌ముఖ్య‌మంత్రి భట్టి గారికి థాంక్యూ అని పేర్కొన్నారు.