Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • బాలయ్య నోటా ‘జై తెలంగాణ’ నినాదం

    HYD: హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సం అంగరంగ వైభవంగా జరుగుతోంది. టాలీవుడ్ సీనియర్ నటుడు బాలకృష్ణ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. ఇంత అభిమానం దక్కడం జన్మజన్మల పుణ్యమని తెలిపారు. ప్రసంగాన్ని ముగించిన తర్వాత జై తెలంగాణ అని నినాదించారు. అది చూసి సీఎం రేవంత్ చిరునవ్వులు చిందించారు.

  • ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌

    తెలంగాణ గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌ హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. విజేతలకు సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అవార్డులు ప్రదానం చేశారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ నిలిచారు. పుష్ప-2 సినిమాలో ఆయన నటనకు గానూ ఈ అవార్డు దక్కింది. ఉత్తమ హిస్టారికల్‌ ఫిల్మ్‌గా- రజాకార్‌, ఉత్తమ తొలి చిత్రంగా కమిటీ కుర్రోళ్లు, ఉత్తమ దర్శకుడు (2024)- నాగ్‌ అశ్విన్‌ (కల్కి), ఉత్తమ నటిగా నివేదా థామస్‌ అవార్డులు అందుకున్నారు.

     

  • ‘కుబేర’ కోసం.. నాగార్జున-ధనుష్‌ భారీ కటౌట్లు!

    దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘కుబేర’ మూవీ ఈనెల 20న విడుదల కానుంది. ఈనేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద నాగార్జున, ధనుష్‌ల భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.

  • సీఎం చంద్రబాబుతో సినీ ప్రముఖుల భేటీ వాయిదా!

    AP: రేపు సీఎం చంద్రబాబుతో జరగాల్సిన సినీ ప్రముఖుల సమావేశం వాయిదా పడింది. రేపు సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరగాల్సి ఉంది. అయితే షూటింగ్‌ల కారణంగా పలువురు నటులు, ప్రముఖులు ఇతర ప్రాంతాల్లో ఉండటంతో భేటీని వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  • అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్

    TG: గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం రేవంత్‌‌రెడ్డి, నటుడు అల్లు అర్జున్‌ కలుసుకున్నారు. సినీప్రముఖులను కలుస్తూ వెళుతున్న సీఎంకు అర్జున్ కూడా కనిపించారు. వారిద్దరూ ఇద్దరూ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకుని హగ్‌ చేసుకున్నారు. ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్న బన్నీని రేవంత్ అభినందించారు. పుష్ప-2 తొక్కిసలాట కేసులో అర్జున్ అరెస్టు అయిన తర్వాత వారిద్దరు కలుసుకోవడం ఇదే మొదటిసారి.

  • జాన్వీ బ్లాక్ అండ్ వైట్ అందాలు.. పిక్ వైరల్!

    బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ బ్లాక్ అండ్ వైట్ అందాలతో ఆకట్టుకుంటోంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పిక్ వైరల్‌గా మారింది.

     

  • ప్రముఖ మలేషియన్ నటి కన్నుమూత

    ప్రముఖ మలేషియన్ నటి లిమ్ పిక్-సేన్ (80) కన్నుమూశారు. కౌలాలంపూర్‌లో వయసురీత్యా వచ్చే సమస్యలతో మరణించినట్లు తెలుస్తోంది. 1970లో వచ్చిన ప్రముఖ బ్రిటిష్ కామెడీ సిరీస్ ‘మైండ్ యువర్ లాంగ్వేజ్‌’లో చుంగ్ సు-లీ పాత్ర ద్వారా ఈమె అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ‘డాక్టర్ హూ’, ‘ది మైండ్ ఆఫ్ ఈవిల్ (1971)’, ‘స్పియర్‌హెడ్’ , ‘కోరోనేషన్ స్ట్రీట్’, ‘కాజువాలిటీ’, ‘హోల్బీ సిటీ’, ‘ది బిల్’ వంటి బ్రిటిష్ సిరీస్‌లలో నటించారు.

  • ఉపాసన ఏ హ్యాండ్‌తో రాస్తుందో చూడండి!

    మెగా కోడలు ఉపాసన కొణిదెలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉపాసన లెఫ్ట్ హ్యాండ్‌తో ఓ ఈవెంట్‌లో రాస్తున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ వీడియో వైరల్ అవ్వగా నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొణిదెల కోడలు కాదు.. కొణిదెల బంగారం అంటూ కొనియాడుతున్నారు.

  • ‘కుబేర’ ట్రైలర్ వచ్చేస్తోంది!

    ధనుష్‌, నాగార్జున, రష్మిక కీలక పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘కుబేర’. ఈమూవీ ట్రైలర్ రేపు విడుదల కానుందంటూ మేకర్స్ తాజాగా స్పెషల్ పోస్టర్ వదిలారు.

  • అభిమానుల అత్యుత్సాహం.. కమల్‌ ఆగ్రహం

    నటుడు, MNM పార్టీ అధినేత కమల్‌‌హాసన్‌ తమిళనాడు అల్వార్‌పేటలో పార్టీ క్యాడర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొందరు అత్యుత్సాహం ప్రదర్శించగా కమల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్‌ను కలవడానికి వచ్చిన కొందరు ఒక పెద్ద ఖడ్గాన్ని బహూకరించారు. దానిని పట్టుకోవాలని కోరగా.. అందుకు ఆయన నిరాకరించారు. ఖడ్గం చేతపట్టుకోవాలని ఒత్తిడి చేయగా దానిని టేబుల్‌ మీద పెట్టాలని ఆయన గట్టిగా మందలించారు.