Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న నిహారిక!

    సోషల్‌మీడియా స్టార్ నిహారిక తన లేటెస్ట్ ఫొటోలను నెట్టింట పేర్ చేసుకుంది. ఇందులో ఆమె బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిపోతోంది. ఈ బ్యూటీ ‘మిత్రమండలి’ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది.

  • మేము విడిపోలేదు: నిర్మాత SKN

    టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన గీతా ఆర్ట్స్-2 బ్యానర్ బాధ్యతలు ప్రొడ్యూసర్ బన్నీ వాస్ చూసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన బీవీ వర్క్స్ బ్యానర్ స్టార్ట్ చేసి ‘మిత్రమండలి’ మూవీ నిర్మిస్తున్నారు. అయితే బన్నీవాస్ కొత్త బ్యానర్ స్టార్ట్ చేయడంతో వీళ్లు విడిపోయారంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడీ విషయంపై నిర్మాత SKN.. ‘మిత్రమండలి’ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో క్లారిటీ ఇచ్చాడు.

  • డైరెక్టర్‌ సుకుమార్‌ భార్య ఆసక్తికర పోస్ట్!

    డైరెక్టర్‌ సుకుమార్‌-తబిత జంట తమ పెళ్లిరోజును జరుపుకున్నారు. ఈ 16 ఏళ్లలో లెక్కలేనన్ని జ్ఞాపకాలు, ప్రేమ మరింత బలపడుతూనే ఉందంటూ తబిత ఫ్యామిలీ ఫొటోను సోషల్‌మీడియాలో పంచుకున్నారు.

  • ప్రముఖ నటుడి బంధువు మృతి

    అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రముఖనటుడు విక్రాంత్ మాస్సే దిగ్భ్రాంతిని తెలియజేశారు. ‘‘ఈ రోజు ఊహించని విషాదకర ఘటన జరిగింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు వారి ప్రియమైన వారి కోసం విలపిస్తున్నారు. మరణించిన వారిలో నా మామ క్లిఫోర్డ్ కుందర్ కొడుకు ఫ్లైట్ ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్‌ కూడా ఉన్నారు.అది నన్ను మరింత బాధకు గురి చేసింది’’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

     

  • విమాన ప్రమాదంపై బాలీవుడ్‌ తారల సంతాపం

    అహ్మదాబాద్‌ విమానాశ్రయం సమీపంలో ఎయిర్‌ ఇండియా విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్‌ దేశాన్ని షాక్‌కు గురి చేసింది. దీనిపై పలువురు బాలీవుడ్ తారలు విచారం వ్యక్తం చేశారు. పరిణీతి చోప్రా, జాన్వీకపూర్‌, సల్మాన్‌ ఖాన్‌, సన్నీ డియోల్, సారా అలీఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, సోనూసూద్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌లతో పాటు మరికొందరు ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు.

  • ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన థ్రిల్లర్‌ మూవీస్‌!

    ఈ వీకెండ్‌లో ఓటీటీ ప్రేక్షకులను థ్రిల్‌ చేసేందుకు ఇప్పటికే కొన్ని సినిమాలు సిద్ధం కాగా.. తాజాగా మరో రెండు చిత్రాల స్ట్రీమింగ్‌ వివరాలు వెల్లడయ్యాయి. ‘బ్లైండ్‌ స్పాట్‌’ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో, ‘కార్తీక:మిస్సింగ్‌ కేస్‌’ సినిమా ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ రెండూ ఈ నెల 13న విడుదల కాబోతున్నాయి.

  • గ్లోబల్ వైడ్‌గా అదరగొడుతున్న ‘జాట్’.. వీడియో!

    సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన యాక్షన్ చిత్రం ‘జాట్’. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ అదరగొడుతుంది. గ్లోబల్ లెవెల్‌లో ట్రెండింగ్‌లో నిలిచి దూసుకెళ్తోందని నెట్‌ఫ్లిక్స్ సంస్థ వెల్లడించింది. నాన్ ఇంగ్లీష్ సినిమాల జాబితాలో వరల్డ్ వైడ్‌గా టాప్ 4లో ట్రెండింగ్‌లో ఉందట. ఈ విషయాన్ని తెలుపుతూ ఓటీటీ సంస్థ వీడియో పంచుకుంది.

  • వెకేషన్‌లో ఎంజయ్ చేస్తున్న టిల్లు బ్యూటీ!

    టిల్లు బ్యూటీ నేహాశెట్టి వెకేషన్‌లో ఎంజయ్ చేస్తోంది. తాజాగా తన ఫొటోను సోషల్‌మీడియాలో పంచుకుంది. ఇందులో ఆమె బోటులో కెమెరాకు స్టిల్ ఇస్తూ కనిపించింది.

  • ‘కుబేర’ ట్రైలర్‌పై అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్!

    ‘కుబేర’ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌పై మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. జూన్ 13న జరగనున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.

  • గద్దర్ అవార్డ్స్ వేడుక.. దిల్ రాజు ఏమన్నారంటే?

    హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో గురువారం తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. 14 ఏళ్ళ తరువాత గద్దర్ అవార్డ్స్ జరుగుతున్నాయి. ఈనెల 14న సా.6గంటలకు అవార్డ్స్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అవార్డు గ్రహీతలకు ఇన్విటేషన్స్ పంపించాము. అందరూ తప్పకుండా గదర అవార్డ్స్ ఫంక్షన్‌కు వచ్చి విజయవంతం చేయండి’’ అని దిల్ రాజు వెల్లడించారు.