టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె డైరెక్టర్‌గా మారాలని అనుకుంటున్నట్లు టాక్. స్వీయ దర్శకత్వంలో హీరోయిన్‌గా సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఓ సినిమాను తెరకెక్కించడానికి కాజల్ సన్నాహాలు కూడా మొదలైనట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు మూవీస్ చేసుకోక రిస్క్ తీసుకోవడం అవసరమా అని ట్రోల్ చేస్తున్నారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘పెయిడ్ వ్యూస్’.. వైరల్ అవుతున్న దిల్ రాజు కామెంట్స్!
బుధవారం జరిగిన ‘‘తమ్ముడు’ మూవీ ట్రైలర్ ఈవెంట్‌లో నిర్మాత దిల్‌రాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినీఇండస్ట్రీలో పెయిడ్ వ్యూస్ కాన్సెప్ట్ ఉందని ప్రచారం ఉన్నా ఎవరూ ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. తాజాగా ఆయన వ్యాఖ్యలతో స్టార్ హీరోల సినిమాల ట్రైలర్, టీజర్లకు వచ్చే వ్యూస్ సైతం పెయిడ్ అనే చర్చ మొదలైంది. దీంతో సినిమా కలెక్షన్లూ ఫేకా అని సినీప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.
-
అల్లు అరవింద్‌పై హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్!
ప్రియదర్శి, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక జంటగా నటిస్తున్న చిత్రం ‘మిత్రమండలి’. ఈ సినిమా టీజర్ లాంచ్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నిహారిక పాల్గొని మాట్లాడింది. ఈ స్పీచ్ ఆమె నిర్మాత అల్లు అరవింద్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
-
విమాన ఘటనపై స్పందించిన మెగాస్టార్.. ఎమోషనల్ పోస్ట్!
అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఫైట్‌కు జరిగిన భయంకరమైన విషాదం గురించి విని చాలా బాధపడ్డాను. ఇది ఎంత హృదయ విదారకమో చెప్పడానికి మాటలు సరిపోవు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.. చనిపోయినవారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’’ అని చిరంజీవి విచారం వ్యక్తంచేశారు.
-
విమాన ప్రమాదంపై నటుడు బాలకృష్ణ ఎమోషనల్!
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై నటుడు నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన మాటలకందని విషాదాన్ని నింపింది అన్నారు. ప్రయాణికులతో పాటు సిబ్బంది.. అలాగే విమానం కూలిన ప్రదేశంలో ఉన్న మరికొంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం హృదయాన్ని తీవ్రంగా కలచివేస్తోందని బాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.
-
బాబాయ్‌ని తిట్టాను.. తప్పదని తెలుసు! : రానా
వెంకటేశ్-రానా ప్రధానపాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు-2’. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రానా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘పార్ట్-1 కోసం హిందీ డబ్బింగ్ చెబుతున్నప్పుడు వాటిని కేవలం డైలాగ్స్ మాదిరిగానే చూశా. బాబాయ్‌ని తిడుతున్నానని అనుకోలేదు. కానీ, తెలుగు డబ్బింగ్‌కు వచ్చేసరికి చాలా ఇబ్బందిపడ్డా. ఎలా ఈ డైలాగ్స్ చెప్పాలి’ అని ఆలోచించా. నటీనలో ఇలాంటివి చేయక తప్పదని అర్థమైంది’’ అని రానా తెలిపారు.
-
కీర్తి సురేష్ ‘రివాల్వర్ రీటా’ రిలీజ్ అప్పుడే..ఆసక్తిగా పోస్టర్!
హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘రివాల్వర్ రీటా’. జేకే చండూరు దర్శకుడు. ఈ సినిమా ఆగస్టు 27న రాబోతున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.
-
విమాన ప్రమాదం.. టాలీవుడ్ నటుల ప్రగాఢ సానుభూతి
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దేశవ్యాప్తంగా ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ విషాదంపై టాలీవుడ్ స్టార్లు వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఆ ఘటన తమను కలిచి వేసినట్లు తెలియజేస్తున్నారు. బాధితుల కుటుంబాలకు అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
-
మనసుని హత్తుకునేలా ‘ప్రేమంటే ఇది కదా..’ ట్రైలర్
ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ‘కథా సుధ’ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈక్రమంలో వచ్చేవారం ‘ప్రేమంటే ఇది కదా’ కథ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా దీని ట్రైలర్ విడుదలైంది. విజయ్-కవిత ప్రేమలో పడటం పెళ్లి చేసుకోవాలనుకోవడం వంటి సన్నివేశాలతో ప్రారంభమైన ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. కవిత తండ్రి నిర్ణయం వల్ల వారి జీవితం ఎలా మారిందనే కథతో ఇది రూపొందినట్లు తెలుస్తోంది.
-
విమాన ప్రమాదం.. ‘కన్నప్ప’ టీమ్ కీలక నిర్ణయం!
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘కన్నప్ప’ చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమూవీ ట్రైలర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే రేపు ఇండోర్‌లో జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంచు విష్ణు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తనను తీవ్రంగా కలిచి వేసిందని వెల్లడించారు.