Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌.. మెమోంటో ఇదే!

    తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ నెల 14న హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించబోతుంది. ఈ సందర్భంగా విజేతలకు ప్రదానం చేసే అవార్డు మెమోంటోను అధికారికంగా విడుదల చేసింది. ఫిల్మ్ రీల్ చేతిని చుట్టుకున్నట్లుగా…. పైకెత్తిన చేతిలో డప్పు నమూనాతో గద్దర్ అవార్డును తీర్చిదిద్దారు. డప్పుపై తెలంగాణ రాష్ట్ర చిహాన్ని ముద్రించి చుట్టూ టీజీఎఫ్ఏ అక్షరాలను పేర్కొన్నారు.

  • మహేశ్‌బాబు ‘అతడు’ రీ-రిలీజ్.. ఎప్పుడంటే?

    మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘అతడు’ మూవీ ఆగస్టు 9న థియేటర్‌లో రీ-రిలీజ్ కాబోతుంది. ఈమేరకు మేకర్స్ తాజాగా కౌంటు డౌన్ పోస్టర్ వదిలారు.

  • ‘హరిహర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్.. క్లారిటీ ఇచ్చిన టీం!

    పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించినట్లు, జూన్ 26న ఈ సినిమా థియేటర్లకు రాబోతుందంటూ ఓ పోస్టర్ వైరల్ అవుతోంది. అయితే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నవార్త వాస్తవం కాదని వీరమల్లు టీం స్పష్టం చేసింది. అధికారికంగా తామే సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తామని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటన చేసింది.

  • VIDEO: ‘అఖండ 2’ టీజర్‌ వచ్చేసింది!

    నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘అఖండ 2’ టీజర్‌ వచ్చేసింది. బాలకృష్ణ పుట్టినరోజు (జూన్‌ 10) సందర్భంగా చిత్ర బృందం ఆ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. బాలయ్య చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, తమన్‌ అందించిన నేపథ్య సంగీతం అదుర్స్‌ అనిపించేలా ఉన్నాయి. బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘అఖండ’కు సీక్వెల్‌ ఇది.

  • ‘కన్నప్ప’లో పాత్రల పేర్లపై వివాదం.. స్పందించిన మంచు విష్ణు!

    మంచు విష్ణు కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ మూవీలో సప్తగిరి, బ్రహ్మానందం పోషించిన పాత్ర పేర్లపై వివాదం చోటుచేసుకుంది. అందులో వారి పేర్లు పిలక-గిలక.. ఆ పేర్లను తొలగించాలంటూ బ్రాహ్మణ సంఘాల ఆందోళన దిగాయి. దీనిపై మంచు విష్ణు తాజాగా స్పందించాడు. తాము ఏ మత, కులపరమైన మనోభావాలు దెబ్బ తీసేలా మూవీ తీయలేదని ఆయన వెల్లడించాడు.

  • ఎన్టీఆర్-నీల్ మూవీ.. స్పెషల్ సాంగ్‌లో క్రేజీ బ్యూటీ!

    ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో ‘డ్రాగన్’ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రుక్మిణి వసంత్, శ్రద్ధా కపూర్ హీరోయిన్లు. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందని సమాచారం. ఈ స్పెషల్ సాంగ్‌లో క్రేజీ బ్యూటీ కేతిక శర్మ తారక్‌తో కలిసి స్టెప్పులేయనుందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నదాని పై త్వరలోనే క్లారిటీ రానుంది.

  • ‘కుబేర’ నుంచి ‘పిప్పీ పిప్పీ డుమ్ డుమ్’ వచ్చేస్తోంది!!

    ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జూన్‌ 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మూవీలోని మూడో సింగిల్ ‘పిప్పీ పిప్పీ డుమ్ డుమ్ డుమ్’ సాంగ్ రేపు విడుదల అవుతుందని మేకర్స్ తాజాగా ప్రకటించారు. టైం మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

  • ‘నన్ను త‌రిమి త‌రిమి కొట్టారు’.. మంచు మ‌నోజ్ కామెంట్స్.

    హీరో మంచు మ‌నోజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జూ.ఎన్టీఆర్‌పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. ‘‘మేము ఐదో, ఆరో తరగతి చదువుతున్నా టైంలో.. ఓ పెళ్ళికి వెళ్ళాం. అప్పుడు ఒక బెలూన్‌ను తీసుకొచ్చి.. దానికి మంటపెట్టాను.. ఆ మంట కాస్త ఎన్టీఆర్ చేతికి అంటుకుంది. దీంతో ఎన్టీఆర్ బోరున ఏడ్చేశాడు. అప్పుడు మా అమ్మమ్మ వచ్చి న‌న్ను తరిమి తరిమి కొట్టింది’’ అని మ‌నోజ్ చెప్పుకొచ్చాడు.

  • ‘సంబరాల ఏటిగట్టు’ నుంచి సుబ్బి పోస్టర్ రిలీజ్!

    రోహిత్ కేపీ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. నేడు నటుడు రవి క్రిష్ణ బర్త్‌డే స్పెషల్‌గా ఈ సినిమా నుంచి అతని ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను రిలీజ్ చేస్తూ మేకర్స్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ మూవీలో ఆయన సుబ్బి క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఇక పోస్టర్‌లో ఆయన వైల్డ్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

  • జెనీలియాతో ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్‌.. ఆమిర్‌ ఏమన్నారంటే?

    ఆమిర్‌‌ఖాన్‌-జెనీలియా జంటగా ‘సితారే జమీన్‌ పర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈక్రమంలో వీరి మధ్య ఏజ్‌గ్యాప్‌‌పై నెట్టింట చర్చించుకుంటున్నారు. తాజాగా దీనిపై ఆమిర్‌ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘‘నేను కూడా ఈ ఏజ్‌గ్యాప్‌ విషయంలో ఆందోళన చెందాను. కానీ ఈ సినిమాలో మేమిద్దరం 40ల వయసు ఉన్న పాత్రను పోషిస్తున్నాం. ఆమె ఇప్పుడు దాదాపు ఆ వయసులోనే ఉంది కదా!’’ అని అన్నారు.