హీరో నితిన్-డైరెక్టర్ శ్రీరామ్ వేణు కాంబినేషన్‌లో రూపొందిన మూవీ ‘తమ్ముడు’. జులై 4న బాక్సాఫీసు ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్ అనౌన్స్‌మెంట్ వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ విడుదలవుతుందని ఇందులో తెలిపారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
కమెడియన్ అలీ క్లాప్.. ‘చండీ దుర్గమా’ షురూ!
మైను ఖాన్ ఎండీ దర్శకత్వంలో నూతన నటీనటులను పరిచయం చేస్తూ హెచ్ బి జె క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా ‘చండీ దుర్గమా’. ఈ సినిమాకు జయశ్రీ వెల్ది నిర్మాత. ఈమూవీ పూజా కార్యక్రమాలతో ఈ రోజు హైదరాబాద్‌లో లాంచనంగా ప్రారంభమైంది. ప్రముఖ కమెడియన్ అలీ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు.
-
‘అఖండ-2’ టీజర్ టైమ్ ఫిక్స్!
బోయపాటి-బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ-2’. ఈమూవీ టీజర్ ఈ రోజు సా.6.03 గంటలకు విడుదలకానుందని మేకర్స్ తాజాగా పోస్టర్ ద్వారా ప్రకటించారు.
-
కోర్టు రూమ్‌లో జ్యోతిక, సోనాక్షి!
జ్యోతిక, సోనాక్షి ప్రధాన పాత్రల్లో అశ్విని అయ్యర్ తివారీ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో జ్యోతిక, సోనాక్షి మధ్య కోర్టులో ముఖాముఖి సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తాయని తెలుస్తోంది. భావోద్వేగాలతో కూడిన ఈ కోర్టు రూమ్ థ్రిల్లర్ చిత్రీకరణను ఇప్పటికే మొదలైంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా రాబోతున్న ఈ సినిమా గురించి పూర్తి వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారని సినీ వర్గాలు తెలిపాయి.
-
SSMB29కు నో చెప్పిన స్టార్ హీరో!
రాజమౌళి, మహేశ్‌బాబు కాంబోలో రానున్న సినిమా SSMB29లో ఓ పాత్రను హీరో విక్రమ్ రిజెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అది విలన్ పాత్ర కావడంతో ఆయన ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పారని సమాచారం. దీంతో ఈ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నట్లు తెలుస్తోంది.
-
ప్యూర్ తెలుగమ్మాయిలా.. ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి నభా నటేష్ అచ్చం తెలుగమ్మాయిలా ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. స్వయంభు చిత్రంలో నిఖిల్ సరసన నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఆ మధ్య వరుస సినిమాలో పాపులర్ అయింది. ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతుకే సో బెటర్, డార్లింగ్, డిస్కో రాజా వంటి సినిమాలతో కొంత క్రేజ్ తెచ్చుకుంది. నభా నటేష్ ఇన్‌స్టా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
-
బీచ్ ఒడ్డులో… యంగ్ బ్యూటీ
ప్రముఖ నటి ప్రయా ప్రకాశ్ వార్రియార్ తాజా ఇన్‌స్టా పోస్ట్ ట్రెండింగ్ అవుతోంది. బీచ్ ఒడ్డులో బికినీ లాంటి పొట్టి నెక్కరు వేసుకుని సరదాగా సేద తీరుతున్న ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ‘ఒరు అదార్ లవ్’(Oru Adaar Love) చిత్రంలోని ఒక పాటలో కన్ను గీటుతూ కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ప్రియా వర్రియార్ ఇన్‌స్టా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
-
‘దలాల్’ దర్శకుడు పార్థో ఘోష్ మృతి
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు పార్థో ఘోష్ మృతి చెందారు. 75ఏళ్ల వయసున్న ఆయన హార్ట్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ పరిస్థితి విషమించి మృతిచెందినట్లు తెలుస్తోంది. 100 Days, దలాల్, అగ్ని సాక్షి, గీత్ వంటి హిటక చిత్రాలు ఆయన దర్శకత్వంలో వచ్చాయి. మొత్తం 15 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన చివరగా 2018లో “Mausam Ikrar Ke Do Pal Pyaar Ke” అనే చిత్రం వచ్చింది.
-
Film Updates: మేమిద్దరం.. మాకిద్దరంటున్న ‘నయన’
ప్రముఖ నటి, సినీ నిర్మాతలైన నయనతార-విఘ్నేష్ దంపతులు తమ దాంపత్య జీవితంలో మూడో ఏడులోకి అడుగిడారు. థర్డ్ మ్యారేజ్ యానివర్సరీతో హ్యాపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నయనతార ‘ఇదరి నుంచి నలుగురం’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. సరోగసీ ద్వరా 2022లో నయనతారకు ఇద్దరు కవలలు జన్మించిన విషయం తెలిసిందే. నయనతార ఇన్‌స్టా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
-
కన్నప్ప మూవీపై మంచు లక్ష్మీ ఎవరూ ఊహించని కామెంట్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న కన్నప్పలో నటించకపోవడంపై మంచు లక్ష్మీ ఆసక్తికర కామెంట్ చేశారు. తాను ఈ మూవీలో నటిస్తే మిగతా ఎవరూ కనిపించరంటూ సెటైర్ వేశారు. మూవీలో తనకు సరిపోయే పాత్ర లేదని భావిస్తున్నానని, అందుకే విష్ణు తనకు అవకాశం ఇవ్వలేదని అనుకుంటున్నానని చెప్పారు. ఒకవేళ తాను చేయగలిగే పాత్ర ఉంటే విష్ణు అవకాశం ఇచ్చేవాడేమోనని తెలిపారు.