మహేశ్‌బాబు హీరోగా.. దర్శకుడు రాజమౌళి కలయికలో రూపొందుతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’(వర్కింగ్ టైటిల్) చిత్రం చకచకా చిత్రీకరణ పూర్తి చేసుకుంటోంది. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇప్పుడీ సినిమాలో ప్రముఖ నటుడు ఆర్.మాధవన్ భాగం కానున్నట్లు సమాచారం. దీంట్లోని ఓ కీలకపాత్రకోసం చిత్రబృందం ఆయన్ని సంప్రదించినట్లు తెలిసింది. త్వరలోనే ఆయన సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నట్లు ప్రచారం సాగుతోంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
ప్రముఖ నటి కన్నుమూత
ప్రముఖ నాట్య కారిణి, నటి విజయభాను (68) కన్నుమూశారు. చెన్నైలో వడదెబ్బతో మరణించినట్లు సోదరి సింధూరి వెల్లడించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఈమె పలుభాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించింది. రాజబాబు-విజయభాను కాంబినేషన్ అప్పట్లో బాగా ఫేమస్. ‘ఇది కథ కాదు’ సినిమాలో నటనకు నంది అవార్డు దక్కింది. 1980ల్లో ఆమె ఓ అమెరికను ప్రేమ వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు.
-
సెప్టెంబర్ 25న పవన్ కల్యాణ్ ‘OG’ విడుదల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమా షూటింగ్ పూర్తయిందని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలిపింది. సినిమా సెప్టెంబర్ 25, 2025న గ్రాండ్‌గా విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
-
‘రూ.2కోట్లు కూడా కలెక్ట్ చేయని హీరోకి రూ.13కోట్ల రెమ్యునరేషన్’
ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సునీల్ నారంగ్, కార్యదర్శి శ్రీధర్ హీరోలపై కీలకవ్యాఖ్యలు చేశారు. ‘హీరోలు ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేవారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రూ.2కోట్లు కూడా కలెక్ట్ చేయని సినిమాకి ఓ హీరోకి రూ.13కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు. వారుమాత్రం సంవత్సరానికి ఒక సినిమా కూడా తీయరు. దీంతో సింగిల్‌స్క్రీన్స్ యజమానులు ఎలా బతుకుతారని వాపోయారు.
-
సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న పాయల్ పిక్స్!
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తాజాగా న్యూ లుక్‌లో దర్శనమిచ్చింది. బుల్లి డ్రెస్ వేసుకొని.. తన అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
-
మిస్ యూ.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్!
బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి తను ఎంతో ప్రేమగా చూసుకునే పెంపుడు కుక్క బ్రోడీ కన్నుమూసింది. దీంతో భావోద్వేగానికి లోనైన అతియా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘మై బ్రోడీ.. నువ్వు లేకుండా ఇంటిని, ఈ జీవితాన్ని ఊహించలేకపోతున్నాను. నా చిన్నతనంలో నాకు తోడుగా ఉన్నందుకు థాంక్యూ’’.. అని రాసుకొచ్చింది.
-
VIDEO: ఆసక్తికర పద్యం చెప్పిన మోహన్ బాబు!
మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు మోహన్ బాబు ఆసక్తికర పద్యం చెప్పారు. ‘‘వజ్రాయుధం పుష్పంగా మారిపోతుంది. అగ్ని మంచుగా మారిపోతుంది. సముద్రం భూమిగా మారిపోతుంది. శత్రువు మిత్రుడుగా మారిపోతాడు. విషము దివ్యాహారం అవుతుంది ’’ అంటూ మోహన్ బాబు పద్యానికి అర్ధం వివరంగా చెప్పారు.
-
‘పవన్ సినిమాను ఆపే అధికారం ఎవరికి లేదు’
150 కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రేక్షకులను అలరించేందుకు 30 నుంచి 40 మంది హీరోలు మాత్రమే ఉన్నారని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడు సునీల్ నారంగ్ అన్నారు. హీరోలు దేవుళ్లు లాంటివారని, వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాతలు చేయరని వ్యాఖ్యానించారు. హీరో పవన్ కల్యాణ్ తుపానులాంటి వారని, ఆయన సినిమాను ఆపే అధికారం ఎవరికి లేదన్నారు.
-
VIDEO: జోకులొద్దు.. మోహన్ బాబుకు బ్రహ్మానందం స్వీట్ వార్నింగ్!
గుంటూర్లో నిర్వహించిన ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు మోహన్ బాబు బ్రహ్మానందంతో 40 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హీరో-ఆర్టిస్ట్‌గా సినిమాలు, సిల్వర్-గోల్డెన్ జూబ్లీలు సాధించిన జ్ఞాపకాలను పంచుకున్నారు. బ్రహ్మనందం సభకు వచ్చాడా.. అని మోహన్ బాబు అనగా.. జోకులొద్దు అంటూ.. బ్రహ్మానందం స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. “ఆ పరమేశ్వరుడి సాక్షిగా, ఐ లవ్ యూ బ్రహ్మానందం” అని భావోద్వేగంతో అన్నారు.
-
ఆకట్టుకునే అందం రాశీ సొంతం!
హీరోయిన్ రాశీఖన్నా తన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో ఆమె బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఎంతో బ్యూటీఫుల్‌గా కనిపిస్తోంది. ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.