Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్

    హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ తాజాగా తన ఇన్‌స్టా వేదికగా లేటెస్ట్ ఫొటోలు పంచుకుంది. అందులో గ్రీన్ కలర్ డ్రెస్‌లో హాట్‌గా కనిపిస్తోంది. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

  • ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలివే!

    ఈ వారం పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యాయి. మరి ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్‌ అవుతుందో చూసేయండి. అమెజాన్‌ ప్రైమ్‌లో ‘#సింగిల్‌’,  నెట్‌ఫ్లిక్స్‌లో ‘జాట్‌’, ఈటీవీ విన్‌లో ‘పెళ్లికాని ప్రసాద్’, జియో హాట్‌స్టార్‌లో ‘దేవిక అండ్‌ డానీ’, ఆహాలో ‘ఒరు యమండన్ ప్రేమకథ’ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి.

  • ప్రముఖ సింగర్ కారు ధ్వంసం.. ఖరీదైన వస్తువులు చోరీ!

    లండన్‌లో ప్రముఖ పంజాబ్‌ సింగర్‌ సునందా శర్మకు షాకింగ్‌ అనుభవం ఎదురైంది. పార్కింగ్‌‌లో ఆమె కారుపై దుండగులు దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేసి అందులోని విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఈ విషయాన్ని ఆ గాయని స్వయంగా సోషల్‌‌మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘అవి నాకు ఎంతో ఇష్టమైనవి.. అన్నీ పోయాయి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

  • ‘గుండమ్మ కథ’కు 62 ఏళ్లు.. స్పెషల్‌ వీడియో రిలీజ్

    ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, సూర్యకాంతం లాంటి మేటి నటులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెండితెర తెలుగు క్లాసిక్‌ ‘గుండమ్మ కథ’. 1962 జూన్‌ 7న విడుదలైన ఈ సినిమా తాజాగా 62 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆనాటి చిత్ర విశేషాలను గుర్తు చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ఓ స్పెషల్‌ వీడియోను పంచుకుంది. మీరూ చూడండి.

  • ‘కుబేర’.. డ‌బ్బింగ్ షురూ చేసిన నాగార్జున‌

    శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. జూన్ 20న విడుదలకానుంది. తాజాగా నాగార్జున త‌న పాత్ర‌కు సంబంధించిన‌ డబ్బింగ్ పనులను మొదలుపెట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను కూడా విడుదల చేశారు. ఇందులో నాగార్జునతో పాటు డ‌బ్బింగ్ స్టూడియోలో శేఖ‌ర్ క‌మ్ముల కూడా ఉన్నారు.

  • ఉత్కంఠ రేపుతున్న ‘శంబాల’ టీజర్

    ఆది సాయికుమార్‌ హీరోగా యుగంధర్ ముని దర్శకత్వంలో నటిస్తున్న సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘శంబాల’. అర్చన అయ్యర్ కథానాయిక. తాజాగా ఈ సినిమా టీజర్‌ను టీమ్‌ విడుదల చేసింది. ‘‘ఈ విశ్వంలో అంతుపట్టని రహస్యాలు ఎన్నో ఉన్నాయి’’ అంటూ డైలాగులతో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. నటీనటుల యాక్టింగ్‌ ఆకట్టుకునేలా ఉంది. శ్రీచరణ్‌ పాకాల అందించిన సంగీతం మెప్పిస్తోంది.

  • శాలరీ అడిగినందుకు డ్రైవర్‌ను కత్తితో పొడిచిన బాలీవుడ్ నిర్మాత

    కారు డ్రైవర్ జీతం అడిగాడని బాలీవుడ్ నిర్మాత మనీశ్ గుప్తా కత్తితో పొడిచినట్టు వర్సోవా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మహమ్మద్ లష్కర్ మూడేళ్లుగా మనీశ్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రతీ నెల జీతం చెల్లింపులో జాప్యం చేస్తుండటంతో ఇరువురి మధ్య పలుమార్లు వాగ్వివాదం జరిగింది. దీంతో ఇటీవలే అతన్ని విధుల్లోంచి తొలగించి జీతం ఇవ్వలేదు. మే నెల జీతం విషయంలో గొడవ జరగగా కత్తితో దాడి చేయడంతో స్వల్పంగా గాయపడ్డాడు.

  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజీవ్‌ కనకాల, సుమ

    AP: తిరుమల శ్రీవారిని నటుడు రాజీవ్‌ కనకాల, ఆయన సతీమణి యాంకర్‌ సుమ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తొలుత అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.

     

  • సినీ పరిశ్రమలో సమస్యలపై ప్రత్యేక కమిటీ

    తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో 30 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. కమిటీకి ఛైర్మన్‌గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, కన్వీనర్‌గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ వ్యవహరించనున్నారు. సభ్యులుగా ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 10 మంది, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 10 మంది, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 10 మంది ఉన్నారు.

  • యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ వెబ్ సిరీస్‌లో సమంత!

    సమంత ప్రస్తుతం ‘రక్త్‌ బ్రహ్మాండ్‌’ వెబ్ సిరీస్‌ కోసం వర్క్‌ చేస్తున్నారు. రాజ్‌, డీకే దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆదిత్యరాయ్‌ కపూర్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది సిద్ధమవుతోంది. ఇక తన నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌’ బ్యానర్‌పై ఇప్పుడు సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమా చేయనున్నారు.