Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • శాలరీ అడిగినందుకు డ్రైవర్‌ను కత్తితో పొడిచిన బాలీవుడ్ నిర్మాత

    కారు డ్రైవర్ జీతం అడిగాడని బాలీవుడ్ నిర్మాత మనీశ్ గుప్తా కత్తితో పొడిచినట్టు వర్సోవా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మహమ్మద్ లష్కర్ మూడేళ్లుగా మనీశ్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రతీ నెల జీతం చెల్లింపులో జాప్యం చేస్తుండటంతో ఇరువురి మధ్య పలుమార్లు వాగ్వివాదం జరిగింది. దీంతో ఇటీవలే అతన్ని విధుల్లోంచి తొలగించి జీతం ఇవ్వలేదు. మే నెల జీతం విషయంలో గొడవ జరగగా కత్తితో దాడి చేయడంతో స్వల్పంగా గాయపడ్డాడు.

  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజీవ్‌ కనకాల, సుమ

    AP: తిరుమల శ్రీవారిని నటుడు రాజీవ్‌ కనకాల, ఆయన సతీమణి యాంకర్‌ సుమ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తొలుత అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.

     

  • సినీ పరిశ్రమలో సమస్యలపై ప్రత్యేక కమిటీ

    తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో 30 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. కమిటీకి ఛైర్మన్‌గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, కన్వీనర్‌గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ వ్యవహరించనున్నారు. సభ్యులుగా ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 10 మంది, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 10 మంది, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 10 మంది ఉన్నారు.

  • యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ వెబ్ సిరీస్‌లో సమంత!

    సమంత ప్రస్తుతం ‘రక్త్‌ బ్రహ్మాండ్‌’ వెబ్ సిరీస్‌ కోసం వర్క్‌ చేస్తున్నారు. రాజ్‌, డీకే దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆదిత్యరాయ్‌ కపూర్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది సిద్ధమవుతోంది. ఇక తన నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌’ బ్యానర్‌పై ఇప్పుడు సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమా చేయనున్నారు.

  • అల్లు అర్జున్‌ – అట్లీ ప్రాజెక్ట్‌.. హీరోయిన్‌గా దీపికా పదుకొణె

    అల్లు అర్జున్‌ హీరోగా దర్శకుడు అట్లీ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె నటించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ప్రకటించింది. ఈ చిత్రానికి రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట.  ఐకాన్‌, సూపర్‌హీరో వంటి వాటిని ఎంపికచేశారని తెలుస్తోంది.

     

  • ‘హరిహర వీరమల్లు’ @ రూ.250 కోట్ల బడ్జెట్‌: జ్యోతికృష్ణ

    పవన్‌ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా బడ్జెట్‌ గురించి దర్శకుడు జ్యోతికృష్ణ ఆసక్తికర విషయాలను బయట పెట్టారు. సుమారు రూ.250 కోట్లకు పైగా బడ్జెట్‌తో దీనిని నిర్మిస్తున్నట్లు చెప్పారు.  ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని తెలిపారు.

  • సమంత ఆ టాటూ తొలగించేశారా..?: నెటిజన్ల ప్రశ్నలు

    సినీ నటి సమంత సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఇన్‌స్టాలో ‘నథింగ్‌ టు హైడ్‌’ పేరుతో  ఓ స్పెషల్‌ వీడియోను షేర్‌ చేసింది. అయితే, ఈ వీడియోలో  ఆమె మెడపై కనిపించని ‘ఏమాయచేసావె’ టాటూ కనిపించలేదు. దీంతో చాలా మంది నెటిజన్లు  ‘ఏమాయచేసావె టాటూ తొలగించేశారా?’ అంటూ నెటిజన్లు సమంతను ప్రశ్నిస్తున్నారు.

  • పవన్ కల్యాణ్‌ను కలిసిన అర్జున్‌ దాస్‌

    ‘ఓజీ’ మూవీ షూటింగ్ సెట్‌లో పవన్‌ కల్యాణ్‌ను నటుడు అర్జున్‌ దాస్ కలిశారు. పవన్‌ను కలిసి మాట్లాడిన క్షణాలను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు.

     

  • కన్నప్ప సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అడ్డుకుంటాం.. బ్రాహ్మణ సంఘాల వార్నింగ్

    హీరో మంచు విష్ణు న్యూ మూవీ ‘కన్నప్ప’ ఈ నెల 27న విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలోని ‘పిలక గిలక’ పాత్రపై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు గుంటూరులో నిర్వహించే కన్నప్ప సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను అడ్డుకుంటామని హెచ్చరించాయి. పిలక గిలక పాత్రపై స్పష్టత ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపాయి.

     

     

  • ర‌వితేజ సూప‌ర్ హిట్ మూవీ రీ రిలీజ్

    ర‌వితేజ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రం ‘వెంకీ’ని రీరిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. 2004లో వ‌చ్చిన ఈ మూవీని జూన్ 14న రీరిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ పేర్కొన్నారు. 4Kలో ఈ మూవీ విడుద‌ల కానుండ‌డంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. స్నేహ హీరోయిన్‌గా నటించిన ఈ కామెడీ ఎంటర్‌టైన‌ర్‌లో అశుతోష్ రాణా, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.