Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • చిరంజీవి హిట్‌ సాంగ్‌ వెనుక కథ ఇదీ

    తెలుగు సినీ సాహిత్యాన్ని కొత్త పంథాలో నడిపించిన వారిలో వేటూరి సుందర రామ్మూర్తి  ఒకరు.  ‘చ్చా’ శబ్దం వచ్చేలా ఓ పాటను రాయాలని దర్శకుడు కోదండరామిరెడ్డి కోరగా.. ‘రాక్షసుడు’   సినిమాలోని ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాశారు. ఈ పాటలో దాదాపు 50 ‘చ’కారాలు ఉండటం గమనార్హం.   ఇక ఈ పాటలో  చిరంజీవి- రాధ జోడీ  డ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

     

  • బాలకృష్ణ ‘అఖండ 2’ వాయిదా!

    బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ‘అఖండ 2’. ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదల కావాల్సింది. తాజాగా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. వినాయక చవితికి సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ ఆలస్యానికి నందమూరి కుటుంబంలో చోటుచేసుకున్న విషాదం కూడా ఒక కారణమని తెలుస్తోంది. ‘అఖండ 2’ డిసెంబర్ 4 లేదా ఆ తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది.

  • భారీ వర్షాలు.. జమ్మూకశ్మీర్‌లో చిక్కుకుపోయిన మాధవన్

    తమిళ నటుడు మాధవన్ జమ్మూకశ్మీర్‌లో చిక్కుకుపోయారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లేహ్‌లోనే ఉండిపోయారు. షూటింగ్ కోసం అక్కడికి వెళ్లిన ఆయన, విమానాలు రద్దు కావడంతో తిరిగి రాలేకపోయారు. ఈ పరిస్థితి ఆయనకు 17 ఏళ్ల క్రితం ‘3 ఇడియట్స్’ సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాన్ని గుర్తుచేసినట్లు తెలిపారు. ఈ కష్ట సమయంలో తాను క్షేమంగా ఉన్నానని మాధవన్ సోషల్ మీడియాలో తెలిపారు.

  • మెగాస్టార్ చిరు లుక్స్ అదిరిపోయాయిగా..!

    చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’.  గతంలో చెప్పినట్లుగానే అనిల్.. మెగా ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు.  టైటిల్  గ్లింప్స్‌తో చిరంజీవి అభిమానుల ప్రశంసలు అందుకున్న ఈ డైరెక్టర్ తాజాగా పోస్టర్‌లతోనూ ఆకట్టుకుంటున్నారు. చిరు పుట్టినరోజు రిలీజ్ చేసిన స్టైలిష్ లుక్, నిన్న పంచె కట్టులోని పోస్టర్ అదిరిపోయాయని మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వింటేజ్ చిరును గుర్తు చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.

     

  • చిక్కుల్లో షారుఖ్‌, దీపిక.. ఆ కంపెనీ అంబాసిడర్లుగా..

    నటులు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె చిక్కుల్లో పడ్డారు. హ్యుందాయ్ అల్కాజర్ ఎస్‌యూవీలో లోపాలు ఉన్నాయంటూ కీర్తిసింగ్ అనే న్యాయవాది కంపెనీతోపాటు బ్రాండ్ అంబాసిడర్లైన నటులపైనా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. యాక్సిలరేటర్ నొక్కినా కారు వేగంపెరగకపోవడం, ఇంజిన్‌లో లోపాలు ఉండటాన్ని తయారీలోపమని డీలర్ చెప్పారని సింగ్ ఆరోపిస్తున్నారు. తప్పుదోవ పట్టించే ప్రచారం చేసినందుకు మోసం, నమ్మక ద్రోహం కింద నటుల పేర్లను కేసులో చేర్చారు.

  • పెళ్లిపీటలు ఎక్కనున్న నివేదా

    టాలీవుడ్‌ నటి నివేదా పేతురాజు పెళ్లిపీటలెక్కనున్నారు. తనకు కాబోయే భాగస్వామి రాజ్‌హిత్‌ ఇబ్రాన్‌ను పరిచయం చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా ఫొటోలు పంచుకున్నారు. ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగినట్లు ఇన్‌స్టా స్టోరీలో పరోక్షంగా తెలిపారు. ‘ఇప్పటినుంచి జీవితమంతా ప్రేమమయమే..’ అనే క్యాప్షన్‌తో ప్రియుడితో ఉన్న ఫొటోలను పంచుకున్నారు. వీటికి లవ్‌ సింబల్స్‌తోపాటు.. రింగ్ ఎమోజీనీ జోడించారు. దీంతో SMలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

  • కిడ్నాప్ కేసు.. పరారీలో నటి!

    మలయాళ నటి లక్ష్మీ మేనన్‌ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఓ కిడ్నాప్‌ కేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కొచ్చిలో ఓ ఐటీ ఉద్యోగిని స్నేహితులతో కలిసి కిడ్నాప్‌ చేసి, అతడిపై దాడి చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ ముగ్గురిని అరెస్టు చేయగా.. నిందితుల్లో ఒకరైన నటి పరారీలో ఉందని కొచ్చి పోలీస్‌ కమిషనర్‌ విమలాదిత్య తెలిపారు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.

  • ‘ఆస్కార్‌’ ఎంట్రీ పొందిన పా. రంజిత్‌ సినిమా

    కోలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు పా. రంజిత్‌ సహ నిర్మాతగా వ్యవహరించిన ‘పాపా బుకా’ 98వ ఆస్కార్‌ పురస్కారాల పోటీకి ఎంట్రీ సాధించింది. పపువా న్యూ గినీ (పీఎన్‌జీ) దేశం నుంచి అర్హత పొందిన తొలి సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఇది పోటీ పడనుంది. మూడు జాతీయ అవార్డులు అందుకున్న మలయాళ దర్శకుడు బిజుకుమార్‌ దమోదరన్‌ తెరకెక్కించడం విశేషం.

  • గర్ల్‌ఫ్రెండ్‌తో పృథ్వీ షా.. ఫోటో వైరల్

    టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా, నటి, ఇన్‌ప్లూయెన్సర్ ఆకృతి అగర్వాల్ కలిసి వినాయకచవితి వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. గత జూన్‌లో వీరు ఒకేచోట కనిపించడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. కాగా గతంలో నటి, మోడల్, నిధి తపాడియాతోనూ పృథ్వీ డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి. కొన్నేళ్లుగా ఫామ్ లేమితో బాధపడుతున్న అతడు తాజాగా బుచ్చిబాబు టోర్నీలో సెంచరీ చేశారు.

  • ఇంట్లోనే మట్టి గణపతిని చేసిన బ్రహ్మానందం

    వినాయక చవితి సందర్భంగా ప్రముఖ నటుడు బ్రహ్మానందం తన ఇంట్లోనే మట్టి వినాయకుడిని తయారుచేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇందులో ఆయన తమ స్వగృహంలో మట్టి వినాయకుడిని తయారు చేస్తూ కనిపించారు. తద్వారా పర్యావరణానికి హానీ కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీ గణేశాను పూజించాలని సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అవి కరోనా సమయంలో తీసిన ఫొటోలని సమాచారం.