Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ప్రియ‌ద‌ర్శి ‘మిత్ర‌మండ‌లి’.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

    ప్రియ‌ద‌ర్శి-నిహారిక జంట‌గా న‌టించ‌బోతున్న చిత్రం ‘మిత్ర‌మండ‌లి’. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ సినిమాతో ఎస్ విజయేంద్ర దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను మేకర్స్ విడుద‌ల చేశారు. ఈ సినిమా బ్యాండ్ ట్రూప్‌ నేప‌థ్యంలో రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. బన్నీ వాసు సమర్పిస్తుండగా.. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

  • Video: పవన్, ప్రభాస్ సినిమాలపై మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

    మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా ‘కన్నప్ప’. ఈనెల 27న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో విష్ణు ఓ ఇంటర్వ్యూలో చిత్ర బడ్జెట్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘‘కన్నప్ప బడ్జెట్ ట్రిపుల్ ఫిగర్స్‌లో ఉంది. ‘రాజాసాబ్’, ‘ఓజీ’ సినిమాల కంటే మా మూవీ బడ్జెట్ చాలా ఎక్కువ’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

  • ఆ నిర్మాత కోసం రూ.50 కోట్లు తగ్గించుకున్న ప్రభాస్!

    ప్రభాస్-మారుతి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈమూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ రూ.150 కోట్లు కాకుండా రూ.100 కోట్లే తీసుకుంటున్నాడట. ఎందుకంటే.. గతంలో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రంతో ఈ నిర్మాత నష్టాలను చవిచూశారు. అందుకే ఆయన కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ తగ్గించినట్లు తెలుస్తోంది.

     

  • ‘హరి హర వీరమల్లు’ మూవీ రిలీజ్ వాయిదా

    పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’.  జూన్‌ 12న ఇది విడుదలవుతుందని భావించిన అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ‘హరిహర వీరమల్లు’ మరోసారి వాయిదా పడినట్లు టీమ్‌ తాజాగా అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా త్వరలోనే ట్రైలర్‌ రిలీజ్‌ కానుందని.. కొత్త విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని టీమ్‌ వెల్లడించింది.

  • రవి–కెనీషా ఫొటోలు వైరల్-పెళ్లి చేసుకున్నారా?

    కోలీవుడ్ హీరో రవి ,కెనీషా  కలిసి మురుగన్ దేవాలయంలో దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా వైరల్‌గా మారాయి. వీరి మెడలో పూల దండలు కనిపించడంతో, “పెళ్లి చేసుకున్నారా?” అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్​ చేస్తున్నారు.  గతేడాది  రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్తితో విడాకుల వెనుక కెనీషాతో ఉన్న సంబంధమే కారణమని వార్తలు వచ్చాయి.

  • ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ.. 2వేల మందితో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌

    ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం 2వేల మంది జూనియర్‌ ఆర్టిస్టుల మధ్యలో తారక్‌ ఉన్న భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా, టొవినో థామస్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా, వచ్చే ఏడాది జూన్‌ 25న ఈ మూవీ రిలీజ్‌ కానుంది.

  • ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన ‘లాల్ సలామ్’

    తమిళ యాక్టర్స్ రజినీకాంత్‌, విష్ణు విశాల్, విక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్‌ సలామ్‌’ ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ SunNXT వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. గ‌తేడాది ఫిబ్ర‌వ‌రి 9న రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలింది. కాగా, దాదాపు ఏడాదిన్నర తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు రావడం గమనార్హం.

  • అనుమతి లేకుండా ఫొటోలు తీయడంపై రానా ఆగ్రహం

    ముంబయి విమానాశ్రయం వద్ద టాలీవుడ్ నటుడు రానా ఫొటోలు తీసేందుకు ఓ ఫొటోగ్రాఫర్‌ ఉత్సాహం చూపించారు. దీంతో రానా ఫోన్‌ పడిపోవడంతో  అతడిని సున్నితంగా మందలించాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. కాగా, టాలీవుడ్‌లో నటీనటులకు కొంచెం ప్రైవసీ ఉందని ఇటీవల ఓ మీడియా సంస్థతో రానా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

  • ఘనంగా అఖిల్ వివాహం… ఫొటోలు వైరల్

    నటుడు అఖిల్‌ అక్కినేని తన ప్రియురాలు జైనబ్‌ రవ్జీని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.

  • బిగ్‌బాస్ బ్యూటీ శుభశ్రీకి నిశ్చితార్థం

    తెలుగు బిగ్‌బాస్‌ 7 సీజన్‌ శుభశ్రీ రాయగురు త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. ‘మనోభావాలు పాప’గా ఫేమస్‌ అయిన ఈ బ్యూటీ ప్రియుడు, నటుడు, నిర్మాత అజయ్‌ మైసూర్‌ను పెళ్లాడబోతుంది. తాజాగా వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఫైనల్లీ.. మా ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని క్యాప్షన్‌ జోడించింది.