Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘#సింగిల్‌’

    శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘#సింగిల్‌’. ప్రముఖ OTT  సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతుంది.

  • నటుడు షైన్‌ టామ్‌ చాకో తండ్రి మృతి

    మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో కారుకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన తండ్రి సీపీ చాకో మృతి చెందారు.  నటుడితోపాటు తల్లి, సోదరుడు, కారు డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ఉదయం 7 గంటల సమయంలో తమిళనాడులోని ధర్మపురికి సమీపంలోని పాలకోట్టై వద్ద వారి కారు ముందున్న లారీని ఢీకొట్టింది. దీంతో అందరికి గాయాలు కాగా ఆస్పత్రిలో చేరారు. నటుడి తండ్రి చికిత్స పొందుతూ మరణించారు.

  • అఖిల్ అక్కినేని పెళ్లి.. హజరైన చిరంజీవి, ప్రశాంత్ నీల్

    హీరో నాగార్జున చిన్న కుమారుడు అఖిల్‌ బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్తూ వైవాహిక జీవితానికి వెల్‌కమ్‌ చెప్పాడు. ప్రియురాలు జైనబ్‌ను వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. జూబ్లీహిల్స్‌లో నాగార్జున నివాసంలో శుక్రవారం (జూన్‌ 6న) ఉదయం మూడు గంటలకు ఈ వివాహం జరిగింది. ఇరుకుటుంబ సభ్యులు సహా మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ వెడ్డింగ్‌కు హాజరయ్యారు. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోలో రిసెప్షన్ జరగనుంది.

     

  • వాళ్ల కర్మన వాళ్లే పోతారు: మంచు విష్ణు

    హీరో మంచు విష్ణు న్యూ మూవీ ‘కన్నప్ప’  ఈ నెల 27న విడుదల కానుంది. అయితే, మూవీ ప్రమోషన్‌లో భాగంగా మంచు విష్ణు  ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. కన్నప్పలోని ‘శివయ్య’ డైలాగ్‌ను వేరే మూవీస్‌లో వాడటంపై ప్రశ్నించగా… ‘దేవుడి పేరును వ్యంగ్యంగా వాడటాన్ని నేను యాక్సెప్ట్‌ చేయను. మనల్ని ఏమైనా అంటే వాళ్ల కర్మన వాళ్లు పోతారు అని వదిలేయాలి’ అని చెప్పుకొచ్చారు.

     

  • క్రేజీ న్యూస్.. రెండు పార్టులుగా ‘స్పిరిట్’

    దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబో తెరకెక్కనున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించి క్రేజీ న్యూస్ ప్రచారం అవుతోంది. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్.  స్క్రిప్టుకు అనుకూలంగా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో మేకర్స్ స్పందిస్తేగానీ తెలియదు.

  • ‘కన్నప్ప’లో రజనీకాంత్‌ను తీసుకుందామనుకున్నా: విష్ణు

    మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టు ‘కన్నప్ప’. ఈ చిత్రం ఈనెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు విష్ణు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. మోహన్‌బాబు పాత్ర కాంబినేషన్‌తో మరో క్యారెక్టర్‌ అనుకున్నామని, దాని కోసం రజనీకాంత్‌ని ఎంపిక చేద్దామనుకున్నానని తెలిపారు. కథకు సంబంధం లేకుండా ఆ ట్రాక్‌ ఎక్కువైపోతుందేమోనన్న అభిప్రాయంతో ఆ పాత్రను తొలగించామని తెలిపారు.

  • పెద్ది మూవీపై మరో బిగ్ అప్డేట్!

    ‘పెద్ది’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు కథానాయకుడు రామ్‌చరణ్‌. ఆయన టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటున్న ఈ సినిమా తాజాగా హైదరాబాద్‌లో మరో కొత్త షెడ్యూల్‌ని ప్రారంభించుకుంది. ప్రత్యేకంగా సిద్ధం చేసిన సెట్లో పూర్తిగా రాత్రి పూట సాగే ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలతో పాటు ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కించనున్నట్లు సమాచారం.

  • జయం రవి- కెనీషా ఫొటోలు వైరల్‌

    కోలీవుడ్‌ హీరో జయం రవి- కెనీషా మరోసారి వార్తల్లో నిలిచారు. వారిద్దరు కలిసి దిగిన ఫొటోలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. మెడలో పూల దండలు కనిపించడంతో.. ‘పెళ్లి చేసుకున్నారా?’ అంటూ నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే? తన నిర్మాణ సంస్థ ‘రవి మోహన్‌ స్టూడియోస్‌’ లోగోను జయం రవి గురువారం సోషల్‌ మీడియా వేదికగా ఆవిష్కరించారు. ఈ ప్రకటనకు ముందు ఆయన, కెనీషా చెన్నైలోని మురుగన్‌ దేవాలయాన్ని సందర్శించారు.

  • పెళ్లిపై హీరోయిన్ కీలక నిర్ణయం..

    కొన్నాళ్లుగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్న ఒకప్పటి హీరోయిన్ గ్రేసీ సింగ్.. బ్రహ్మ కుమారీగా మారి ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది. బ్ర‌హ్మ కుమారిగా మారిన ఆమెను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో సభ్యురాలిగా ఉంటూ తరచూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది. తాను బ్ర‌హ్మ కుమారిగా అపార‌మైన ఆనందం, శాంతిని పొందుతున్న‌ట్టు ఆమె పేర్కొంది.

  • నయా లుక్‌లో నమ్రతా శిరోద్కర్.. పిక్ వైరల్!

    మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకుంది.  ఆమె ట్రెండి డ్రెస్ ధరించి నయా లుక్‌లో కనిపించింది. ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.