స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ 57 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు. ఇతను 2023లో మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. కొన్ని నెలలుగా ఆమె గర్భంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజగా వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫొటోలతో క్లారిటీ వచ్చింది. అర్బాజ్ టాలీవుడ్‌లో జై చిరంజీవ, శివం భజే సినిమాల్లో విలన్ పాత్రలో నటించాడు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
సినిమా ఫ్లాప్ అయితే నటీనటులపై నిందలు: రీతూవర్మ
సినిమా అనేది అందరూ కలిసి చేసే పని అని నటి రీతూ వర్మ అన్నారు. అయితే, సినిమా ఫ్లాప్ అయితే మాత్రం నటీనటులనే నిందిస్తారని తెలిపారు.
-
ఇట్స్ అఫీషియల్..: లోకేశ్ కనగరాజ్‌తో బాలీవుడ్ స్టార్ సినిమా
దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో సినిమా చేస్తున్నట్లు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తెలిపారు. వచ్చే ఏడాదిలో ఈ మూవీ పట్టాలెక్కుతుదని వెల్లడించారు.
-
‘హరిహర వీరమల్లు’ మరోసారి వాయిదా?
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. పవన్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈనెల 12న విడుదల కావాల్సిన ఈ సినిమా పోస్ట్‌పోన్ చేశారని వార్తలొస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం వీఎఫ్‌ఎక్స్‌తో పాటు ఆర్థికపరమైన సమస్యలేనని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే పలుసార్లు వాయిదా పడడంతో డిస్ట్రిబ్యూటర్స్ వెనకడుగు వేస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
-
ప్రియుడిని పెళ్లాడిన ప్రముఖ నటి
ప్రముఖ హిందీ టీవీ నటి హీనా ఖాన్ పెళ్లిపీటలు ఎక్కారు. చిరకాల ప్రియుడు రాకీ జైస్వాల్‌ను వివాహం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం జరిగిన తన వివాహ వేడుక అనేక ఫోటోలను సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ‘‘రెండు వేర్వేరు ప్రపంచాల నుంచి ప్రేమను నిర్మించాం. తేడాలు పోయాయి. హృదయాలు కలిశాయి. జీవితాంతం బంధాన్ని పెనవేశాయి. అన్ని అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతాం’’ అని సంతోషం వ్యక్తం చేశారు.
-
సంక్రాంతికి పెరుగుతోన్న పోటీ
సంక్రాంతి పండుగకు ఇప్పటినుంచే స్టార్, యువ హీరోలు సన్నద్ధమవుతున్నారు. సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే రిలీజ్ సమయాన్ని ప్రకటించేసి పండక్కి పోటీ పెంచేశారు. నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ మూవీ జనవరి 14న విడుదల కానుంది. అలాగే, చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కనున్న మూవీ, రవితేజ 76వ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానున్నాయి.
-
సంక్రాంతి బరిలో ‘అనగనగా ఒక రాజు’
‘అనగనగా ఒక రాజు’తో సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు నవీన్ పొలిశెట్టి . ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మారి తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయనున్నాట్లు టీమ్ ఇటీవల ప్రకటించింది. ఆద్యంతం వినోదంతో నిండిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
-
పళనిలో సూర్య పూజలు
సూర్య హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రబృందం పళని మురుగన్ దేవాలయాన్ని సందర్శించింది.
-
హ్యట్సాఫ్ ప్రీతి జింటా
సినీ నటి ప్రీతి జింటా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె 34 మంది అమ్మాయిలను దత్తత తీసుకునివారి బాగోగులు చూసుకుంటుంది. తనకు కవలలు జన్మించకముందే 3 4మందికి తల్లిగా మారినట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వారి చదువు, ఆహారం, బట్టలు తదితర విషయాలన్నీ తానే చూసుకుంటానని తెలిపారు. కాగా, IPLలో పంజాబ్ జట్టుకు ప్రీతి జింటా ఓనర్.
-
రవితేజ కొత్త చిత్రం ప్రారంభం.. రిలీజ్ ఎప్పుడంటే..?
తిరుమల కిషోర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా కొత్త సినిమా ప్రారంభం కానుంది. సంక్రాంతి కానుకగా మూవీని విడుదల చేస్తామని టీమ్ వెల్లడించింది.