బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుందనే వార్త తనని కలచివేసిందని సినీ నటుడు కమల్ హాసన్ అన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, RCB తొలిసారి ఐపీఎల్ కప్ గెలిచిన సందర్బంగా చిన్నస్వామి స్టేడియం వద్ద నిర్వహించిన సంబరాలలో తొక్కిసలాట జరగ్గా.. 11 మంది మరణించిన విషయం తెలిసిందే.