TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను నటుడు నాగార్జున కలిశారు. తన కుమారుడు అఖిల్ పెళ్లిశుభలేఖను భట్టికి ఇచ్చి.. వివాహానికి రావాలని ఆహ్వానించారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
కమల్‌హాసన్ రాజ్యసభ నామినేషన్ వాయిదా
‘థగ్ లైఫ్’ సినిమా ఈవెంట్‌లో కన్నడ భాషపై MNM పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఈ భాషా వివాదం నేపథ్యంలో ఆయన రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడాన్ని వాయిదా వేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. త్వరలో విడుదల కాబోయే తన చిత్రం ‘థగ్ లైఫ్’ వ్యవహారాలు పూర్తయిన తర్వాతే నామినేషన్ వేయాలని భావిస్తున్నట్లు తెలిపాయి.
-
18 గంటలు పనిచేశాను: మీర్జాపూర్ నటుడు త్రిపాఠి
వర్కింగ్ అవర్స్ గురించి మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి మాట్లాడారు. తాను కొన్నిసార్లు 18 గంటలు పనిచేశానని వెల్లడించారు.
-
‘హరిహర వీరమల్లు’ ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రీరిలీజ్ వేడుక వాయిదా పడింది. ఈనెల 8న తిరుపతిలోని ఎస్వీయూ తారకరామా క్రీడా మైదానంలో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
-
2 నెలల్లో 8 కేజీలు తగ్గిన నటుడు
బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ 2 నెలల్లో 8 కేజీలు తగ్గారు. ‘చక్రవర్తి సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్’ సీరియల్‌లో ఆయన సోమేశ్వర్ మహారాజ్ పాత్ర పోషిస్తున్నారు. దీంతో “కింగ్’లా కనిపించేందుకు చాలా కష్టపడ్డట్లు ఆయన చెప్పారు. కఠిన వ్యాయామాలు, ఉదయం, సాయంత్రం కార్డియో వర్కౌట్స్ చేసినట్లు నటుడు తెలిపారు. అంతేకాక 2 నెలల్లో 8 కేజీలు తగ్గినట్లు చెప్పారు. మార్షల్ ఆర్ట్స్, కర్రసాము సైతం నేర్చుకున్నట్లు వెల్లడించారు.
-
చిరునవ్వుల చిన్నది.. రీతూవర్మ పిక్స్ వైరల్!
హీరోయిన్ రీతూ వర్మ తన లేటెస్ట్ పిక్స్ నెట్టింట షేర్ చేసింది. ఇందులో ఆమె చిరునవ్వులు చిందిస్తూ.. చీరలో సాంప్రదాయంగా కనిపించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
-
ఇళయరాజా పుట్టినరోజు.. ‘షష్టిపూర్తి’ టీమ్ విషెస్
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పుట్టినరోజు వేడుకను ‘షష్టిపూర్తి’ చిత్రబృందం నిర్వహించింది. సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు రాజేంద్రప్రసాద్ సహా యూనిట్ సభ్యులు ఈ సందర్భంగా ఇళయరాజాను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు పలువురు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
-
ఫస్ట్ టైం.. స్పెషల్ సాంగ్‌లో రష్మిక!
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘డ్రాగన్’. ఈ మూవీలో రష్మిక స్పెషల్ సాంగ్ చేయనుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెను డైరెక్టర్ సంప్రదించగా.. దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు ఇండస్ట్రీ టాక్. మాసివ్ ఫ్యాన్ బేస్ కలిగిన రష్మిక ఈ సాంగ్‌తో ఫ్రెష్ ఫీల్ తీసుకొస్తుందనే ఉద్దేశంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.
-
‘థగ్‌లైఫ్’ వివాదం.. ‘KFCC’కి ‘TFAPA’ లేఖ
కమల్‌హాసన్ ‘థగ్‌లైఫ్’ రిలీజ్ విషయంలో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు తమిళ్‌ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖ రాసింది. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ‘థగ్‌లైఫ్’ మూవీ బ్యాన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది. కన్నడ భాషపై కమల్ వ్యాఖ్యలు చేయడంతో.. ‘థగ్‌లైఫ్’ను కర్ణాటకలో నిషేధించాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టును కేఎఫ్‌సీసీ ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
-
కన్నడ వివాదం వేళ.. కమల్ మరో ఆసక్తికర పోస్ట్!
కన్నడ భాషపై కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలతో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే నేడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎం.కరుణానిధి జయంతి సందర్భంగా కమల్ తాజాగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘‘తమిళ భాష, తమిళనాడు అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి కరుణానిధి’’ అంటూ తమిళ్ లాంగ్వేజ్‌ను హైలైట్ చేస్తూ పోస్టు పెట్టడం చర్చనీయాంశమైంది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.