మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ జూన్ 27న విడుదలకానుంది. ఈక్రమంలో విష్ణు, మోహన్ బాబు.. మూవీపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈనెల 22న ఏపీలోని భీమవరంలో ఈ వేడుక నిర్వహించనున్నారని సమాచారం. దీనికి ప్రభాస్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
ప్రమోషన్స్‌పై ట్రోల్స్.. ఘాటుగా స్పందించిన నయనతార
నయనతార-చిరంజీవి జంటగా అనిల్ రావిపూడి ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈచిత్రం ప్రారంభానికి ముందే నయన్ ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో కొందరు తమిళ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ‘‘తెలుగు సినిమాలపై అంత ఇష్టమా? అయితే టాలీవుడ్‌కే వెళ్లోచ్చు కదా?’’ అని విమర్శిస్తున్నారు. దీనిపై నయనతార ఘటుగా స్పందించారు. ‘‘ప్రమోషన్లకు వెళ్లాలా.. వద్దా అన్నది నా ఇష్టం. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’’ అని బదులిచ్చింది.
-
చీరలో తళుక్కుమన్న హీరోయిన్ సమంత!
టాలీవుడ్ హీరోయిన్ సమంత తాజాగా తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇందులో సామ్ గొదుమ కలర్ చీర ధరించిన ఎంతో అందంగా కనిపిస్తోంది.
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారు: ‘కేఎఫ్‌సీసీ’కి కమల్‌హాసన్ లేఖ
రాజ్‌కుమార్ కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ కన్నడ భాషపై తాను చేసిన వ్యాఖ్యలను అక్కడి వారు అపార్థం చేసుకోవడం బాధగా ఉందని కమల్ హాసన్ అన్నారు. తమది (తమిళ్, కన్నడ ప్రజలు) ఒకే ఫ్యామిలీ అని చెప్పడమే తన ఉద్దేశమని, ఆ భాషను తక్కువ చేయడం కాదని పేర్కొన్నారు.ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్‌సీసీ)కి లేఖ రాశారు.
-
దర్శకుడు శేఖర్ కమ్ములపై చిరంజీవి ఆసక్తికర పోస్ట్
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘మై డియర్ శేఖర్, మీలాంటి ఒక అభిమాని ఉండటం నాకూ అంతే ఆనందకరం. మీ ప్రస్థానానికి స్ఫూర్తినిచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25ఏళ్ల జర్నీలో నేనూ భాగమైనందుకు గర్వంగా ఉంది. సున్నితమైన వినోదంతోపాటు, ఒక సోషల్‌కామెంట్‌ని జతచేసి ఆలోచనాత్మకంగా తీసే మీ సినిమాలంటే నాకు ఎంతోఇష్టం’’ అని పేర్కొన్నారు.
-
ఈ వారం థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలివే!
- ‘థగ్ లైఫ్’ (కమల్ హాసన్)- జూన్ 5
- ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ (నార్నే నితిన్)- జూన్ 6
- ‘హౌస్‌ఫుల్5’ (అక్షయ్ కుమార్)- జూన్ 6
- ‘గ్యాంబ్లర్స్’ (సంగీత్ శోభన్)- జూన్ 6
- ‘బద్మాషులు’ (మహేశ్ చింతల)- జూన్ 6
-
మీరేమైనా చరిత్రకారుడా?.. కమల్‌కు కర్ణాటక హైకోర్టు ప్రశ్న
తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందంటూ ఇటీవల వ్యాఖ్యానించి వివాదాల్లో చిక్కుకున్నారు సినీనటుడు కమల్ హాసన్. అయితే, ఆయన వ్యాఖ్యలపై పలువురు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. మీరేమైనా చరిత్రకారుడా?.. ఏ ఆధారాలతో ఆ వ్యాఖ్యలు చేశారని కమల్ హాసన్‌ను ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో ఒక్క క్షమాపణ చెబితే సమస్య మొత్తం పరిష్కారం అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.
-
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన నాగార్జున
ఏపీ సీఎం చంద్రబాబును హీరో నాగార్జున కలిశారు. తన కొడుకు అఖిల్ వివాహానికి చంద్రబాబును నాగార్జున ఆహ్వానించారు.
-
‘రానా నాయుడు: సీజన్2’ ట్రైలర్ వచ్చేసింది
వెంకటేశ్, రానా కీలక పాత్రల్లో నటిస్తున్న ‘రానా నాయుడు: సీజన్2’ ట్రైలర్ మంగళవార విడుదలైంది. ఈ క్రేజీ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 13వ తేదీ నుంచి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
-
నాన్న మాకోసం ఎన్నో త్యాగాలు చేశారు: మంచు విష్ణు
మంచు విష్ణు న్యూ మూవీ ‘కన్నప్ప’జూన్ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విష్ణు ‘మై కన్నప్ప స్టోరీ’అంటూ వీడియో విడుదల చేశారు. ఇందులో మోహన్ బాబు గురించి చెప్పారు.ఎంతో కష్టపడి, ఎన్నో త్యాగాలు చేసి వారిని పెంచారని వివరించారు.నెటిజన్‌లను కూడా వారి జీవితంలో కన్నప్ప ఎవరో వివరిస్తూ #My Kannappa Story అనే హ్యాష్ ట్యాగ్ జోడిస్తూ వీడియో పంపాల్సిందిగా కోరారు.