Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ఇంట్లోనే మట్టి గణపతిని చేసిన బ్రహ్మానందం

    వినాయక చవితి సందర్భంగా ప్రముఖ నటుడు బ్రహ్మానందం తన ఇంట్లోనే మట్టి వినాయకుడిని తయారుచేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇందులో ఆయన తమ స్వగృహంలో మట్టి వినాయకుడిని తయారు చేస్తూ కనిపించారు. తద్వారా పర్యావరణానికి హానీ కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీ గణేశాను పూజించాలని సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అవి కరోనా సమయంలో తీసిన ఫొటోలని సమాచారం.

  • విడాకుల రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ జంట

    గత కొంతకాలంగా హీరో గోవిందా ఆయన భార్యతో విడిపోతున్నారంటూ వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా తమపై వస్తున్న విడాకుల రూమర్లకు చెక్‌ పెట్టారు గోవిందా దంపతులు. గణనాథునికి గోవిందా సతీసమేతంగా పూజలు చేశారు. అనంతరం ఆయన భార్య సునీతా అహుజా విడాకుల వార్తలపై స్పందించారు. ఆ దేవుడు కూడా తమను వేరు చేయలేడని.. అలాంటి వార్తలు నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది.

  • హ్యుందాయ్ కారులో లోపం.. షారుఖ్‌, దీపికపై కేసు

    ప్రముఖ బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణెలపై రాజస్థాన్‌లో కేసు నమోదైంది. తాను కొనుగోలు చేసిన హ్యుందాయ్ అల్కాజర్ కారులో తయారీ లోపం ఉందని, కంపెనీ మోసం చేసిందంటూ కీర్తి సింగ్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న షారుఖ్, దీపిక తప్పుదోవ పట్టించే ప్రచారం చేశారని ఆరోపిస్తూ, వారిపై కూడా మోసం, నేరపూరిత కుట్ర కింద ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.

  • బిగ్ బాస్-9లోకి ఇద్దరు హీరోయిన్స్?

    కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తెలుగు ‘బిగ్ బాస్’ సీజన్-9 సెప్టెంబర్ 5న ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే ఎప్పటిలాగే పలువురు వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు ఈసారి హౌజ్‌లోకి అడుగు పెట్టనున్నారు. అందులో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. లక్స్ పాప పాటతో గుర్తింపు తెచ్చుకున్న ఆశా శైనీ, బుజ్జిగాడు ఫేమ్ సంజనా గల్రానీ ఈసారి హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

     

  • హీరో రాజ్‌తరుణ్‌ కోలీవుడ్ ఎంట్రీ.. టైటిల్ టీజర్!

    విజయ్‌ మిల్టన్‌ డైరెక్షన్‌లో ‘గోలీసోడా’ ఫ్రాంఛైజీలో భాగంగా రూపొందిస్తున్న చిత్రం ‘గాడ్స్‌ అండ్‌ సోల్జర్స్’. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీతో రాజ్‌తరుణ్‌ తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రానికి టైటిల్‌ను ఫిక్స్‌ చేసి.. టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు.

  • ‘లిటిల్ హార్ట్స్’ నుంచి ఆకట్టుకునే సాంగ్

    మౌళి-శివానీ నాగరం జంటగా నటిస్తున్న మూవీ ‘లిటిల్ హార్ట్స్’. ఈ చిత్రాన్ని దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘చదువూ లేదు’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను క్యాచీ ట్యూన్‌తో సింజిత్ యెర్రమల్లి కంపోజ్ చేయగా.. జెస్సీ గిఫ్ట్ పాడారు.

  • హీరోగా మారిన మరో దర్శకుడు

    ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్ర డైరెక్టర్ అభిషన్ జీవింత్ హీరోగా మారనున్నాడు. సౌందర్య రజనీకాంత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మదన్ దర్శకుడు. ఇందులో అనశ్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా హీరో హీరోయిన్లు పరిచయం చేస్తూ వారి పోస్టర్లను విడుదల చేశారు. ఈ చిత్రంలో అభిషన్ ‘సత్య’గా.. అనశ్వర ‘మోనిష’ అనే పాత్రలో కనిపించనున్నారని మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని తెలిపారు.

     

     

  • ‘కర్మణ్యే వాధికారస్తే’ విడుదలకు సిద్ధం!

    బ్రహ్మాజీ, శత్రు, మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కర్మణ్యే వాధికారస్తే’. అమర్ దీప్ చల్లపల్లి తెరకెక్కిస్తున్న ఈమూవీ సెప్టెంబర్ 19న విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

  • ‘పెద్ది’.. 1000 మంది డ్యాన్సర్లతో మాస్ సాంగ్!

    గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ ‘పెద్ది’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. వినాయక చవితి వేళా చిత్రబృందం షూట్‌లో పాల్గొంది. మైసూరులో మొదలైన తాజా షెడ్యూల్‌లో బుధవారం ఓ మాస్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. జానీ మాస్టర్‌ ఆధ్వర్యంలో రామ్‌చరణ్‌తోపాటు 1000 మందికిపైగా డ్యాన్సర్లతో సాంగ్‌ షూట్‌ చేస్తున్నారు. సెట్స్‌ నుంచే చిత్రబృందం ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు వీడియో విడుదల చేసింది.

  • ‘మకుటం’తో విశాల్‌ మరో ప్రయోగం!

    హీరో విశాల్ తాజాగా మరో ప్రయోగాత్మక చిత్రానికి సిద్ధం అయ్యాడు. ఆయన నటిస్తున్న ‘మకుటం’ మూవీలో మూడు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించి అలరించబోతున్నాడు. రవి అరసు దర్శకుడు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో విశాల్.. యంగ్, మిడిల్ ఏజ్, ఓల్డేజ్ లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు.