కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం మే 16న జరగాల్సిన ఉంది. అయితే, దేశ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితుల రీత్యా ఆడియో విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కాగా, ఈ చిత్రంలో కోలీవుడ్ హీరో శింబు కీలక పాత్రలో నటించారు.