రిస్క్ తీసుకొని ఎన్నో సినిమాలు చేశానని బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ చెప్పారు. అవే మంచి పేరు తీసుకొచ్చాయని వెల్లడించారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
నా వ్యాఖ్యలు.. అలా అర్థం చేసుకోవడం మీ ఖర్మ: రాజేంద్ర ప్రసాద్
ఇటీవల ఓ కార్యక్రమంలో అలీ, రోజాపై చేసిన నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. దీనిపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ‘‘ఈ మధ్య ఓ కార్యక్రమంలో నేను పరిచయం చేసిన హీరోయిన్, యాక్టర్ గురించి సరదాగా మాట్లాడాను. వాటిని తప్పుగా అనుకున్నారు. నేను ఇలానే ఉంటాను. ఎందుకంటే అన్నయ్యను కాబట్టి. అందులో తప్పేం లేదు’’అని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.
-
‘భైరవం’ విజయ భేరి.. చిత్ర యూనిట్ సక్సెస్ సంబరాలు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటించిన సినిమా ‘భైరవం’. ఈ మూవీలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై కీలక పాత్రలు పోషించారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే30న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సక్సెస్ సంబరాలు చేసుకుంది.
-
జీవితంలో ఏదీ శాశ్వతం కాదు: రష్మిక
జీవితంలో ఒడుదొడుకులు సహజం అని సినీ నటి రష్మిక అన్నారు. ఏదీ శాశ్వతం కాదని తెలుసుకుంటే ఒత్తిడి ఉండదని వెల్లడించారు.
-
ఈ వారం ఓటీటీలో క్రేజీ మూవీలు
ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందో చూడండి
- హిట్ 3- నెట్‌ఫ్లిక్స్
- తుడరుమ్- జియో హాట్‌స్టార్
- రెట్రో- నెట్‌ఫ్లిక్స్
- అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి- అమెజాన్ ప్రైమ్
-
‘టూరిస్ట్ ఫ్యామిలీ’కి మరో హీరో ఫిదా
వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చి విజయాన్ని అందుకుంది ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. అభిషాన్ జీవింత్ దర్శకత్వంలో శశికుమార్, సిమ్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని తెలుపుతూ దర్శకుడు అభిషాన్ ఎక్స్ వేదికగా ఆనందం వ్యక్తంచేశారు. ‘‘సూర్య నన్ను కలిశారు. సినిమా ఆయనకు ఎంత నచ్చిందో వివరించారు’’అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
-
సామ్-రాజ్ డేటింగ్.. రాజ్ భార్య పోస్ట్ వైరల్!
గత కొద్ది రోజులుగా సమంత, రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారంటూ రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజ్ భార్య శ్యామల పోస్ట్ వైరల్ అవుతోంది. ‘‘మంచి కర్మను సృష్టించు. ప్రజలకు సహాయం చేయి. ప్రజలతో న్యాయంగా ఉండు’’ అని ఆమె రాసుకొచ్చింది. దీంతో ఆమె రాజ్-సామ్‌ను గురించే ఈ పోస్ట్ పెట్టిందని నెట్టింట చర్చించుకుంటున్నారు.
-
‘శాంతిని కోరుకోవడమంటే.. హానిని అంగీకరించడం కాదు’
శాంతిని కోరుకోవడమంటే.. హానిని అంగీకరించడం కాదని నటి రష్మిక అన్నారు. భారత్- పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. అన్యాయానికి బదులు తీర్చుకునే దేశాన్ని ప్రశ్నించవద్దంటూ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. రష్మిక ఇన్‌స్టా స్టోరీపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
-
ఉద్రిక్తల వేళ.. ‘థగ్ లైఫ్’ ఆడియో విడుదల వాయిదా
కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం మే 16న జరగాల్సిన ఉంది. అయితే, దేశ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితుల రీత్యా ఆడియో విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కాగా, ఈ చిత్రంలో కోలీవుడ్ హీరో శింబు కీలక పాత్రలో నటించారు.
-
పాక్ నటుడికి బాలీవుడ్ నటి కౌంటర్
‘ఆపరేషన్ సిందూర్’పై పాక్ నటుడు ఫవాద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను బాలీవుడ్ నటి రూపాలీ గంగూలీ ఖండించారు. సోషల్ మీడియా వేదికగా ఫవాద్‌ను విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు. ‘‘మీలాంటి వాళ్లు భారతీయ సినిమాల్లో పనిచేయడం మాకు సిగ్గుచేటు’’ అని అతడి ఫొటోను షేర్ చేశారు. ఈ పోస్ట్‌కు ఆపరేషన్ సిందూర్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హ్యాష్ ట్యాగ్‌లను ఆమె జోడించారు.